హయాత్ బక్షీ మస్జిద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హయాత్ బక్షీ మస్జిద్
మతం
అనుబంధంఇస్లాం
Ecclesiastical or organizational statusమస్జిద్
ప్రదేశం
ప్రదేశంహయాత్‌నగర్‌, తెలంగాణ, భారత దేశము
వాస్తుశాస్త్రం.
రకంఇస్లామీయ నిర్మాణశైలి
శైలికుతుబ్ షాహి
పూర్తైనది1672
నిర్మాణ సామాగ్రిGranite

'హయాత్ బక్షీ మస్జిద్ అనునది హయాత్ బక్షీ బేగం మస్జిద్ లేదా హయాత్‌నగర్ గ్రాండ్ మస్జిద్ గా కూడా పిలువబడుతుంది. ఈ మస్జిద్ తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదు వద్ద గల హయాత్‌నగర్‌లో ఉంది.[1] ఇది 1672 లో గోల్కొండ ఐదవ సుల్తానైన అబ్దుల్లా కుతుబ్ షా చే 1672 లో నిర్మింపబడింది.[2][3]

నిర్మాణం, వాస్తుకళ

[మార్చు]
హయాత్‌బక్షీ మసీదు

ఈ మస్జిద్ కుతుబ్ షాహీ నిర్మాణ శైలిలో నిర్మితమైనది. ఇది అలసిపోయిన సైనికులకు విశ్రాంతి మందిరంగా ఉండేది. దీని ముఖభాగం ఐదు ఆర్చిలతో, రెండు మీనార్లతోనూ, శిల్పాలతోనూ గోడలచుట్టు పన్నెండి ప్రక్కల తోరణాల గ్యాలరీలను మూలలలో గల మీనార్లనుండి వచ్చే విధంగా ఉంటుంది. ఇందులో ప్రార్థనా మందిరం ఎత్తెన వేదిక కలిగి ఉంది. ఈ వేదిక తూర్పు భాగంలో, మస్జిద్ దిగువ భాగంలో వజూ ఖానా ("అబ్లుషన్ ట్యాంకు" నమాజ్ ప్రార్థన చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కునే ఆచారం) ఉంది. ఈ పెద్ద ప్రాంగణం 5 ఎకరాల విస్తీర్ణం కలిగి యున్నది. విశ్రాంతి మందిరం 150 మీటర్ల పొడవు, 130 మీటర్లు వెడల్పు కలిగి యున్నది. ఈ అతిథి గృహం 130 గదులతో కూడుకుని ఉంది. "హాథీ బావ్లి" (ఏనుగు బావి - పెద్ద బావి) అనునది ఈశాన్యంలో గల అతి పెద్ద నుయ్యి.[2]

సుల్తాన్ తన తల్లి పేరిట మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 మీనార్‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.

వివాదం

[మార్చు]

In May 2009, the archaeology and museums department requested permission from the Greater Hyderabad Municipal Corporation (GHMC) to tear down 20 structures abutting the Hayat Bakshi Begum Mosque in violation of the Ancient Monuments and Archaeological Sites and Remains Act of 1960.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Photo-docu of monuments begins". The Hindu. Archived from the original on 9 నవంబరు 2010. Retrieved 6 February 2012.
  2. 2.0 2.1 "Hayat Bakshi Begum Mosque in Hayath Nagar India". India9.com. 2005-06-07. Retrieved 2011-05-09.
  3. "hayat Bakshi begum masjid". gigapan. 2010-08-02. Retrieved 2011-05-09.
  4. "Structures around mosque to be razed". Times Of India. 2009-05-25. Archived from the original on 2011-09-16. Retrieved 2011-05-09.