హయాత్‌నగర్‌

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హయాత్‌నగర్‌
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో హయాత్‌నగర్‌ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో హయాత్‌నగర్‌ మండలం యొక్క స్థానము
హయాత్‌నగర్‌ is located in Telangana
హయాత్‌నగర్‌
తెలంగాణ పటములో హయాత్‌నగర్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°19′37″N 78°36′17″E / 17.327042°N 78.604717°E / 17.327042; 78.604717
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము హయాత్‌నగర్‌
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 2,27,195
 - పురుషులు 1,16,368
 - స్త్రీలు 1,10,827
అక్షరాస్యత (2011)
 - మొత్తం 64.57%
 - పురుషులు 75.25%
 - స్త్రీలు 52.60%
పిన్ కోడ్ 501505

హయాత్‌నగర్‌, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది హైదరాబాదుకి 25 కి.మీ. దూరంలో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళే దారిలో రామోజీ ఫిల్మ్ సిటీకి 5 కి.మీ. సమీపంలో ఉంది. ఇక్కడ హయాత్ బక్షీ బేగం పేరు మీద కట్టించిన మసీదు వల్ల హయత్ నగర్ అని పేరు వచ్చింది.

హయాత్‌బక్షీ మసీదు[మార్చు]

హయాత్‌బక్షీ మసీదు

హైదరాబాద్ నగర శివారులోని హయాత్‌నగర్ లోని చారివూతాత్మక కట్టడమే హయాత్ బక్షీ మస్జిద్ . గోల్కొండను పాలించిన ఐదవ సుల్తాన్ మహమ్మద్ భార్య హయాత్‌బక్షీ బేగం. సుల్తాన్ తన భార్య కోరిక మేరకు ఈ మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. ఇదే పేరు మీద అక్కడి ప్రాంతాన్ని ‘హయత్‌నగర్’గా పిలుస్తున్నారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 మినార్‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.

3000 పైగా జనాభా కలిగి, 2000 పైగా ఓటర్లు కలిగి ఉన్నారు. చాలా వరకు ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానాల్లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ప్రజలు అటు పట్టణ, ఇటు పల్లెటూరు జీవన విధానాలను అలవర్చుకున్నారు.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండల్ సమాచారము[మార్చు]

జిల్లా కేంద్రము
హైదరాబాద్
భాషలు
తెలుగు/ఉర్దూ
Elevation / Altitude
505 meters. Above Seal level
Telephone Code / Std Code
08415
Vehicle Registration Number
AP-28 & AP-29
RTO Office 
Rangareddy

హయత్ నగర్ మండలంలో బాంకిలు[మార్చు]

ఆంధ్రా బాంకు, హయత్ నగర్ ( Ifsc Code ANDB0001245, micrCode 500011110)
సెంట్రల్ బాంక్ ఆఫ్ ఇండియా, భాటసింగారం, (ఆబ్దుల్లాపూర్ మెట్ ( Ifsc Code CBIN0281928, micrCode 500016025)
సిండికేట్ బాంక్, కోహెడ ( Ifsc Code SYNB0003080, micrCode 500025054)

హయత్ నగర్ లోని కళాశాలలు[మార్చు]

వర్డ్స్ అండ్ డీద్ జూ. కళాశాల, హయత్ నగర్,
ప్రభుత్వ జూ. కళాశాల, హయత్ నగర్,
Sciences విజయ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, రేడియో స్టేస్జన్ ఎదురుగా, సాయినగర్ కాలని, 2 వ ఫేస్, హయత్ నగర్.
నాగోల్ ఇనిస్టిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కుంట్లూరు గ్రామం. హయత్ నగర్ మండలం.

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,27,195 - పురుషులు 1,16,368 - స్త్రీలు 1,10,827

రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామము విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పైనున్నందున ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఇక్కడికి 10 కి.మీ. లోపు రైల్వే స్టేషను లేదు. కాని మలక పేటా రైల్వేస్టేషను, కాచిగూడ రైల్వే స్టేషనులు సమీపములో ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషను సికింద్రాబాద్ ఇక్కడికి 18 కి.మీ దూరములో ఉంది.

మూలాలు[మార్చు]

http://www.onefivenine.com/india/villag/Rangareddi/Hayathnagar

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

హయత్ నగర్ దృశ్యాలు
హయత్ నగర్ దృశ్యాలు
హయత్ నగర్ దృశ్యాలు