Jump to content

ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను
పటం
Interactive map of ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి

ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. రంగారెడ్డి జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఇబ్రహీంపట్నం పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన

[మార్చు]

ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 హయాత్‌నగర్‌ మండలం 6 రెవెన్యూ గ్రామాలు
2 అబ్దుల్లాపూర్‌మెట్ మండలం 35 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు)
3 ఇబ్రహీంపట్నం మండలం 31 రెవెన్యూ గ్రామాలు (5 నిర్జన గ్రామాలు)
4 మంచాల్‌ మండలం 24 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు)
5 యాచారం మండలం 19 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామాలు)
6 మాడ్గుల్ మండలం 15 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామాలు)

మూలాలు

[మార్చు]
  1. ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. ↑ "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-09-30.
  3. ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-09-30.
  4. ↑ "DIVISIONS | RangaReddy District Government of Telangana | India". Archived from the original on 2021-11-27. Retrieved 2022-10-01.
  5. ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.