హరికథ (సినిమా)
హరికథ | |
---|---|
దర్శకత్వం | అనుదీప్ రెడ్డి |
రచన | అనుదీప్ రెడ్డి |
నిర్మాత | రంజిత్ కుమార్ గౌడ్ బి.రఘు వివేకానంద గోర కవిత |
తారాగణం | కిరణ్ రంజిత్ కుమార్ గౌడ్ |
కూర్పు | బొంతల నాగేశ్వర్ రెడ్డి |
సంగీతం | ఏలెందర్ మహావీర్ |
నిర్మాణ సంస్థ | ఐరావత సినీ కలర్స్ బ్యానర్ |
విడుదల తేదీ | సెప్టెంబర్ 2022 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
హరికథ కుటుంబ, ప్రేమకథా చిత్రం. అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలుగా నటించారు.[1]
సినిమా ఫస్ట్ లుక్
[మార్చు]ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు, కవిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసాడు.[2] ఈ చిత్రానికి కెమెరామెన్ గా మస్తాన్ షరీఫ్ వ్యవహరించగా బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. మహావీర్ సంగీతం సమకూర్చాడు.
సినిమా బృందం
[మార్చు]- అనుదీప్ రెడ్డి (రచయిత, దర్శకుడు)
- మస్తాన్ షరీఫ్ (కెమెరామెన్)
- బొంతల నాగేశ్వర్ రెడ్డి (ఎడిటర్)
- ఏలెందర్ మహావీర్ (సంగీతం)
నటీ నటులు
[మార్చు]- కిరణ్
- రంజిత్ కుమార్ గౌడ్
- సజ్జన్
- అఖిల రామ్
- లావణ్య రెడ్డి
- కీర్తి
అభిప్రాయాలు
[మార్చు]చిత్ర దర్శకుడు అనుదీప్ రెడ్డి హరికథ సినిమా వినూత్నమైన సినిమా. అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం. ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన సినిమా ఇది అని సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ హరికథతో ప్రేమకథ చెప్పడానికి వస్తున్న కొత్త టీం (2022-05-07). "హరికథ సినిమా గురించి 10టివి వార్త". 10TV. Archived from the original on 2022-08-18. Retrieved 2022-05-07.
- ↑ హరికథ సినిమా గురించి సాక్షి న్యూస్ (2022-05-07). "మంత్రి తలసాని చేతుల మీదుగా హరికథ ఫస్ట్‌లుక్". Sakshi news. Archived from the original on 2022-08-18. Retrieved 2022-05-07.
- ↑ NTV న్యూస్ లో మూవీ ఆవిష్కరణ వార్త. "తలసాని ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్". NTV News. Archived from the original on 2022-08-18. Retrieved 2022-05-07.