హరేకల హజబ్బ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరేకల హజబ్బ
Hajabba Harekala.jpg
జననం (1952-10-17) 1952 అక్టోబరు 17 (వయస్సు 69)
జాతీయత భారతదేశం
సుపరిచితుడుసామజిక సేవకుడు
సన్మానాలుపద్మశ్రీ

చదువుకోని వారికే అక్షరం విలువ తెలుస్తుందంటారు.ఆ విలువ తెలిసిన వాడు కాబట్టే ఎంతో మందికి అక్షరదానం చేస్తున్నాడు.వీధుల్లో పండ్లు అమ్మితే వచ్చే సంపాదనతో పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన హజబ్బ సేవా గుణాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ తో సత్కరించింది.[1]

ప్రస్థానం[మార్చు]

కర్ణాటక రాష్ట్రం మంగుళూరు తాలుకా న్యూపడపు గ్రామానికి చెందిన హరేకల హజబ్బా(Harekala Hajabba) నిరక్షరాస్యుడు.స్థానికంగా బత్తాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.

జీవితాన్ని మార్చిన సంఘటన[మార్చు]

హరేకల హజబ్బ స్థానికంగా ఉన్న సెంట్రల్‌ మార్కెట్‌లో కమలాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.ఈ క్రమంలో ఓ రోజు ఫారిన్‌ దంపతులు హజబ్బ దగ్గరకు వచ్చి కిలో కమలాలు ఎంత అని ఇంగ్లీష్‌లో అడిగారు.హజబ్బకు కన్నడ, మాతృభాష అరబ్బీ తప్ప మరో భాష రాదు. అందుకే ఆ ఫారిన్‌ దంపతులు అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు.ఆ దంపతులు హజబ్బను చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు.జరిగిన అవమానం హజబ్బను చాలా కుంగదీసింది.తన పరిస్థితి మరేవరికి రాకూడదనుకున్నాడు.[2][3]

పాఠశాల స్థాపితం[మార్చు]

ఇంగ్లీష్‌ రాకపోవడం వల్లే తాను ఇలా అవమానాలు పొందాల్సి వచ్చిందని భావించాడు.తన గ్రామంలోని పిల్లలు ఎవరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొకుండా ఉండాలంటే వారికి ఇంగ్లీష్‌ తప్పనిసరిగా రావాలని భావించాడు.కానీ తన గ్రామంలో మంచి స్కూల్‌ లేకపోవడం మదర్సాలో అరబ్బీ తప్ప మరో భాష నేర్పకపోవడం హజబ్బను కలవరపరిచింది.ఈ క్రమంలో హజబ్బ తానే స్వయంగా ఓ పాఠశాలను ప్రారంభించాలిన నిర్ణయించుకున్నాడు.అయితే అది అనుకున్నంత సులభంగా జరగలేదు.ఎన్నో అవమానాలు అడ్డంకులు ఎదురుకున్నాడు. వాటన్నింటిని దాటుకుని 1999, జూన్‌లో తన కలని నిజం చేసుకున్నాడు. అప్పటి వరకు తాను పొదుపు చేసుకున్న ఐదువేల రూపాయలతో సొంతంగా కొంత భూమి కొనుగోలు చేసి పాఠశాల నిర్మాణం ప్రారంభించాడు.

ప్రభుత్వం, దాతల సాయంతో అలా 2001 జూన్‌ నాటికి 8 తరగతి గదులు, రెండు మరుగుదొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తయింది. అయితే పాఠశాల నిర్మించాలనే అతని కల నెరవేరింది.ఆ తర్వాత హైస్కూలు స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. పదేళ్లు కష్టపడి దాన్ని కూడా సాకారం చేసుకున్నాడు.2012 నాటికి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగ్‌ నిర్మించాడు.[4]

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌ నుండి పద్మశీ అవార్డును అందుకుంటూ

ఫ్రీ యూనివర్శిటీ[మార్చు]

భవిష్యత్ పిల్లల కోసం మరిన్ని విద్యాసంస్థలు నిర్మించి గ్రామంలో ఫ్రీ యూనివర్సిటీ కళాశాలను నిర్మించాలన్నదే హజబ్బ అంతిమ లక్ష్యం.

పద్మ శ్రీ పురస్కారం[మార్చు]

నిరక్షరాస్యుడైన హాజబ్బ బుట్టలో పండ్లమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో బడిని కట్టించారు.తనలా నేటి తరం పిల్లలు చదువుకు దూరం కావొద్దనే ఆయన ఆశయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను  పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

మూలాలు[మార్చు]

  1. Mana Telangana (8 November 2021). "సామాన్యుడికి పద్మపురస్కారం." Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
  2. Sakshi (8 November 2021). "అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ". Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
  3. TV9 Telugu (27 January 2020). "ఆరెంజ్ పండ్ల వ్యాపారికి 'పద్మశ్రీ' .. పేదరికానికి పెద్ద 'బహుమతి'". Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
  4. "Harekala_Hajabba".{{cite web}}: CS1 maint: url-status (link)