హర్నాజ్ సంధు

వికీపీడియా నుండి
(హర్నాజ్‌ సంధు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హర్నాజ్ సంధు
అందాల పోటీల విజేత
హర్నాజ్ కౌర్ సంధు
జననముహర్నాజ్ కౌర్ సంధు
(2000-03-03) 2000 మార్చి 3 (వయసు 24)
గురుహర్సహై, ఫిరోజ్‌పూర్ జిల్లా, భారతదేశం
ఎత్తు1.75 మీ. (5 అ. 9 అం.)
జుత్తు రంగునలుపు
కళ్ళ రంగుబ్రౌన్
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019, మిస్ దివా యూనివర్స్ 2021, మిస్ యూనివర్స్ 2021
ప్రధానమైన
పోటీ (లు)
ఫెమీనా మిస్ ఇండియా 2019 (టాప్ 12), మిస్ దివా యూనివర్స్ 2021 (విజేత), మిస్ యూనివర్స్ 2021 (విజేత)

హర్నాజ్ కౌర్ సంధు (జననం: 3 మార్చి 2000) ఒక భారతీయ మోడల్, పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి. మోడలింగ్‌లో రాణించడంతోపాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించారు. అందాల పోటీ టైటిల్ హోల్డర్, ఆమె మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని పొందింది.[1] ఆమె ఇంతకుముందు మిస్ దివా 2021 కిరీటాన్ని పొందింది. మిస్ యూనివర్స్ కిరీటం పొందిన మూడవ భారతీయ మహిళగా హర్నాజ్ సంధు గుర్తింపు పొందింది. గతంలో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫెమినా మిస్ ఇండియా 2019లో సెమీఫైనలిస్ట్‌గా నిలిచింది.[2][3]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

హర్నాజ్‌ సంధు లో 3 మార్చి 2000న చంఢీఘర్‌లో జన్మించింది. ఆమె శివాలిక్‌ పబ్లిక్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. సంధు ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది.[4]

మోడలింగ్‌ రంగం

[మార్చు]

హర్నాజ్‌ సంధు సినిమా పట్ల ఆసక్తితో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆమె తన కాలేజీలో తొలి స్టేజ్‌ ప్రదర్శనతో మోడలింగ్‌ ప్రారంభించింది. సంధు ఒకపక్క మోడలింగ్‌ చేస్తూనే అనేక ఫ్యాషన్‌ షోల్లో పాల్గొంటూ.. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్‌ చంఢీఘర్‌’ కిరీటాన్ని, 2019లో మిస్ పంజాబ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె 2019లో జరిగిన ‘మిస్ ఇండియా’ టైటిల్‌ పోటీల్లో పోటీ పడి టాప్‌–12 జాబితాలో నిలిచి ఇజ్రాయేల్‌, ఇలాట్‌ నగరంలోలోని రెడ్ సీ రిసార్ట్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీల్లో 12 డిసెంబర్ 2021న ‘మిస్‌ దివా యూనివర్స్‌ ఇండియా–2021’ కిరీటాన్ని సొంతం చేసుకుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. BBC News తెలుగు (13 December 2021). "21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  2. Eenadu (13 December 2021). "మిస్‌ యూనివర్స్‌గా హర్నాజ్‌ సంధు". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  3. Eenadu (13 December 2021). "మిస్‌ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్‌ సంధు". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  4. TV9 Telugu (13 December 2021). "మిస్ యూనివర్స్‌గా హర్నాజ్‌ కౌర్‌.. మూడోసారి భారత్‌కు ఈ కిరీటాన్ని అందించిన పంజాబీ భామ." Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Andhrajyothy (13 December 2021). "Miss Universe 2021 లో భారత్ నుంచి పోటీపడుతున్న హర్నాజ్‌ సంధు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.