Jump to content

హర్షవర్థన్ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
హర్షవర్ధన్
డా. హర్షవర్ధన్
వ్యక్తిగత వివరాలు
జననం
హర్షవర్ధన్ గోయల్ [1]

(1954-12-13) 1954 డిసెంబరు 13 (వయసు 69)
ఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామినూతన్ గోయల్
సంతానంముగ్గురు
నివాసంన్యూ ఢిల్లీ
నైపుణ్యంవైద్యుడు, రాజకీయ నాయకుడు

హర్షవర్థన్‌ భారతదేశానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఆయన ప్రస్తుతం చాందిని చౌక్ లోక్ సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఉన్నాడు.[2][3]

జననం & విద్యాభాస్యం

[మార్చు]

హర్షవర్థన్‌ 1954, డిసెంబరు 13న ఓం ప్రకాష్ గోయల్, స్నేహలత గోయల్ దంపతులకు ఢిల్లీలో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు ఢిల్లీలోని హ్యాపీ స్కూల్ లో 1971లో చదివాడు. హర్షవర్ధన్ గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీ, కాన్పూర్ యూనివర్సిటీ నుండి ఎంబిబిఎస్ పట్టా అందుకున్నాడు. ఆయన చిన్ననాటి నుండే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా ఉన్నాడు.

వైవాహిక జీవితం

[మార్చు]

హర్షవర్థన్‌కు భార్య నూతన్ గోయల్, ఇద్దరు కుమారులు డా. మయాంక్ భారత్, సచిన్, ఒక కూతురు ఇనాక్షి ఉన్నారు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

హర్షవర్థన్‌ 1993లో, ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కృష్ణానగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పటి ప్రభుత్వంలో ఆయన రాష్ట్ర ఆరోగ్య శాఖ, విద్యశాఖ, న్యాయ శాఖ మంత్రిగా పనిచేశాడు..[5] హర్షవర్థన్‌ కృష్ణ నగర్ నియోజకవర్గం నుండి 1998, 2003, 2008 & 2013 ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో ఆయన ఢిల్లీ బిజెపి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[6]

2014లో చాందిని చౌక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబాల్ పై గెలిచాడు. ఆయన ఎన్.డి.ఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ క్యాబినేట్ లో ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా 2014 మే 26లో ప్రమాణ స్వీకారం చేపట్టాడు.[7][8] ఆయనకు 2017లో కేంద్ర అటవీ & పర్యావరణ శాఖ మంత్రిఅనిల్ మాధవ్ దావే మృతి చెందడంతో హర్షవర్థన్‌కు ఆ శాఖల అదనపు బాధ్యతలు అప్పగించారు. 2019లో చాందిని చౌక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాష్ అగర్వాల్ పై 2,28,145 ఓట్ల మెజారిటీతో రెండవసారి గెలిచాడు. ఆయన 2019 మే 30న ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[9][10] ఆయన 2019 మే 30 నుండి 7 జూలై 2021 వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. "What's in a surname?".
  2. TV9 Telugu (4 March 2020). "దేశంలో 28 కరోనా పాజిటివ్ కేసులు.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్". Archived from the original on 27 April 2021. Retrieved 27 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhrajyothy (3 March 2024). "బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఎఫెక్ట్.. రాజకీయాలకు కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై". Archived from the original on 4 March 2024. Retrieved 4 March 2024.
  4. "Dr.Harsh Vardhan". Archived from the original on 2013-10-16. Retrieved 27 April 2021.
  5. "Dr. Harsh Vardhan Biography". elections.in. Archived from the original on 21 సెప్టెంబరు 2014. Retrieved 10 August 2014.
  6. "Harshvardhan is new Delhi BJP president". The Times of India. 19 February 2014. Retrieved 27 April 2021.
  7. "Modi's complete cabinet: Jaitley gets Finance, Smriti Human Resources". Firstpost. 27 May 2014.
  8. Live, India (26 May 2014). "PM Modi announces list of cabinet ministers with portfolios". IndiaLive.today. Archived from the original on 3 October 2015. Retrieved 28 April 2021.
  9. "ENT Surgeon, Dr. Harsh Vardhan Appointed Union Health Minister in Modi Government 2.0". Medical Dialogues. 31 May 2019. Retrieved 27 April 2021.
  10. "PM Modi allocates portfolios. Full list of new ministers", Live Mint, 31 May 2019
  11. Namasthe Telangana (7 July 2021). "కేంద్ర మంత్రులు రవి శంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేకర్ రాజీనామా". Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.