హలా షాకత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హలా షాకత్
Hala Shawkat.jpg
జననంఫత్మా టర్కన్ షాకత్
(1930-03-18) 1930 మార్చి 18
అలెప్పో, సిరియా
మరణం2007 ఏప్రిల్ 28 (2007-04-28)(వయసు 77)
డామస్కస్, సిరియా
వృత్తినటి

హలా షాకత్ (ఫత్మా టర్కన్ షాకత్) సిరియన్ నటి. 1950-60ల మధ్యకాలంలో సిరియన్ చిత్రాలలోని ప్రముఖ నటీమణులలో ఒకరు.[1] అల్జీరియా, ఈజిప్ట్ మరియు లెబనాన్ చిత్రాలలో కూడా నటించింది.

జననం[మార్చు]

షాకత్ 1930, మార్చి18న సిరియా, అలెప్పో లోని టర్కీష్ కుటుంబంలో జన్మించింది.[2][3]

కళారంగ ప్రస్థానం[మార్చు]

షాకత్ ఈజిప్టులో తన మొట్టమొదటి చలనచిత్రంలో నటించింది. 1959లో వచ్చిన మావో 'యిడ్ మా' అల్ మజౌల్ అనే చిత్రంలో ఒమర్ షరీఫ్, సమియా గామల్ లతో కలిసి నటించింది. అంతేకాకుండా, మహ్మూద్ యాసిన్ మరియు నదియా లుట్ఫీ వంటి ప్రసిద్ధ ప్రఖ్యాత ఈజిప్షియన్ నటులతో కూడా షావత్ నటించింది.సిరియాకు తిరిగివచ్చిన తరువాత, షాకత్ అనేక సిరియన్ దర్శకులతో పనిచేయడంతోపాటు, అనేక నాటకాలలో నటించింది. దురైద్ లాహమ్ తో కలిసి చీర్స్ నేషన్ అనే ప్రసిద్ధ నాటకంలో కూడా నటించింది. అటుతరువాత అనేక రేడియో కార్యక్రమాలలో నటించింది.

మరణం[మార్చు]

షాకత్ 2007, ఏప్రిల్ 28న సిరియా, డామస్కస్ లో మరణించింది.[2][3]

మూలాలు[మార్చు]

  1. Damascus History Foundation (2007). "28 April". మూలం నుండి 30 డిసెంబర్ 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 21 June 2017. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 Al-Akhbar (2007). "رحيل «الأم الطيّبة»". Retrieved 21 June 2017. Cite web requires |website= (help)
  3. 3.0 3.1 Al-Bayan (2007). "رحيل الفنانة هالة شوكت". Retrieved 21 June 2017. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=హలా_షాకత్&oldid=2816108" నుండి వెలికితీశారు