హలో మీరా
హలో మీరా | |
---|---|
దర్శకత్వం | కాకర్ల శ్రీనివాస్ |
రచన | కాకర్ల శ్రీనివాస్ |
మాటలు | హిరన్మయి కళ్యాణ్ |
నిర్మాత | డా. లక్ష్మణరావు దిక్కల వరప్రసాదరావు దుంపల పద్మ కాకర్ల |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ప్రశాంత్ కొప్పినీడి |
కూర్పు | రాంబాబు మేడికొండ |
సంగీతం | ఎస్ చిన్న |
నిర్మాణ సంస్థ | లూమియర్ సినిమా |
విడుదల తేదీ | 21 ఏప్రిల్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హలో మీరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించిన ఈ సినిమాకు కాకర్ల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 22న దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేయగా[1], ట్రైలర్‌ను నవంబర్ 4న విడుదల చేసి, సినిమాను 2023 ఏప్రిల్ 21న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]కథ
[మార్చు]మీరా గార్గేయి ఎల్లాప్రగడకి రెండు రోజుల్లో పెళ్లి అనగా తన మాజీ ప్రియుడి ఆత్మ హత్యకు ప్రయత్నించాడని పోలీసుల నుండి ఫోన్ వస్తుంది. ఆమెను పోలీసులు హైదరాబాద్ రమ్మంటారు. విజయవాడ నుంచి ఆ అమ్మాయి హైదరాబాద్ బయలుదేరడంతో ఆ దారిలో తనకు వచ్చే కాల్స్ ఏంటి ? అత్యవసరంగా పెళ్లి పనులు వదిలేసి హైదరాబద్ వెళ్లిపోవడంతో ఇంట్లో వాళ్ళు ఎలా స్పందించారు? ఆ అమ్మాయి పెళ్లి జరిగిందా ? సమస్య నుంచి బయటపడిందా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లూమియర్ సినిమా
- నిర్మాత: డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
- లైన్ ప్రొడ్యూసర్: అనంత శ్రీధర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కాకర్ల శ్రీనివాస్
- సంగీతం: ఎస్ చిన్న
- సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ కొప్పినీడి
- మాటలు: హిరన్మయి కళ్యాణ్
- ఎడిటర్: రాంబాబు మేడికొండ
- పొడక్షన్ డిజైనర్: తిరుమల ఎం తిరుపతి
- ప్రొడక్షన్ మేనేజర్స్: కత్రి మల్లేష్ , ఎం. రాంబాబు
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (22 October 2022). "హరీశ్ శంకర్ లాంఛ్ చేసిన 'హలో..మీరా.. ' టీజర్." Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.
- ↑ 10TV (1 April 2023). "ఒకేఒక్క క్యారెక్టర్‌తో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'హలో మీరా'.. రిలీజ్ డేట్ అనౌన్స్." Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)