హషిమోటో థైరాయిడిటిస్
హషిమోటో థైరాయిడిటిస్ | |
---|---|
ఇతర పేర్లు | Chronic lymphocytic thyroiditis, autoimmune thyroiditis, struma lymphomatosa, Hashimoto's disease |
The thyroid of someone with Hashimoto's thyroiditis as seen with a microscope at low magnification | |
ప్రత్యేకత | Endocrinology |
లక్షణాలు | Painless goiter, weight gain, feeling tired, constipation, depression[1] |
సంక్లిష్టతలు | Thyroid lymphoma[2]. |
సాధారణ ప్రారంభం | 30–50 years old[1][3] |
కారణాలు | Genetic and environmental factors[4]. |
ప్రమాద కారకములు | Family history, another autoimmune disease[1] |
రోగనిర్ధారణ పద్ధతి | TSH, T4, anti-thyroid autoantibodies[1] |
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | Graves’ disease, nontoxic nodular goiter[5] |
చికిత్స | Levothyroxine, surgery[1][5] |
తరుచుదనము | 5% at some point[4] |
హషిమోటో థైరాయిడిటిస్ అంటే థైరాయిడ్ గ్రంధి క్రమంగా నాశనం అవగల స్వయం ప్రతిరక్షక వ్యాధి. దీనిని దీర్ఘకాలిక (క్రానిక్ ) లింఫోసైటిక్ థైరాయిడిటిస్ లేదా హషిమోటో వ్యాధి అని కూడా పిలుస్తారు[1][6]. ఆరంభంలో ఎటువంటి లక్షణాలు లేకపోవచ్చు. కాలక్రమేణా థైరాయిడ్ గ్రంధి పెద్దదిగా మారి, గొయిటర్ ను ఏర్పరుస్తుంది. నొప్పి ఉండదు. కానీ కొంతమందిలో బరువు పెరగడం, అలసట, మలబద్ధకం, నిరాశ, సాధారణమైన నొప్పులతో హైపోథైరాయిడిజం అను వ్యాధి అభివృద్ధి అవుతుంది. సాధారణంగా చాలా ఏళ్ల తరువాత థైరాయిడ్ పరిమాణం తగ్గుతుంది[1]. థైరాయిడ్ లింఫోమా వంటి సంక్లిష్ట సమస్యలు ఉండవచ్చు[7].
హషిమోటో థైరాయిడిటిస్ వ్యాధి జన్యు, పర్యావరణ కారకాల వలన ఏర్పడుతుందని భావిస్తున్నారు[4]. ఈ పరిస్థితికి ప్రమాద కారకాలలో కుటుంబ చరిత్ర, వేరొక స్వయం ప్రతిరక్షక వ్యాధి కలిగి ఉండటం వంటివి ఉన్నాయి. రోగ నిర్ధారణ సాధారణంగా TSH, T4, యాంటీ-థైరాయిడ్ ఆటోఆంటిబాడీస్ రక్త పరీక్షలతో జరుగుతుంది[1]. అయితే గ్రేవ్స్ వ్యాధి విషరహిత నోడ్యులర్ గోయిటర్ వంటి వ్యాధులలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి[8].
హషిమోటో థైరాయిడిటిస్ కు సాధారణంగా లెవోథైరాక్సిన్ (థైరాక్సిన్ హార్మోన్) తో చికిత్స చేస్తారు[1][9]. హైపోథైరాయిడిజం లేకపోతే, కొందరు మందులు సిఫారసు చేయకపోవచ్చు, మరికొందరు గొయిటర్ పరిమాణాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు[1][10]. ఈ వ్యాధికి గురైన వారు అయోడిన్ ఎక్కువగా ఆహరంలో తీసుకోకూడదు, అయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే గర్భధారణ సమయంలో తగినంత అయోడిన్ అవసరం[1]. గాయిటర్ చికిత్సకు శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరం పడుతుంది[5].
సుమారు 5% మంది కాకేసియన్లు (పురాతన మానవ తెగ ) వారి జీవితంలో ఏదో ఒక సమయంలో హషిమోటో థైరాయిడిటిస్ వ్యాధి ప్రభావితం చేస్తుంది[4]. ఇది సాధారణంగా 30 నుంచి 50 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. పురుషుల కంటే మహిళల్లో ఇది చాలా సాధారణం [1][3]. వ్యాధి వ్యాప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది[5]. దీనిని మొట్టమొదట 1912లో జపనీస్ వైద్యుడు హకారు హషిమోటో వివరిం చాడు[11]. 1957లో దీనిని స్వయం ప్రతిరక్షక రుగ్మతగా గుర్తించారు [12].
సూచనలు
[మార్చు]- ↑ 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 "Hashimoto's Disease". NIDDK. May 2014. Archived from the original on 22 August 2016. Retrieved 9 August 2016.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Nou2015
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 3.0 3.1 Hiromatsu, Y (2013). "Hashimoto's thyroiditis: history and future outlook.".
- ↑ 4.0 4.1 4.2 4.3 Pyzik, A (2015). "Immune disorders in Hashimoto's thyroiditis: what do we know so far?".
- ↑ 5.0 5.1 5.2 5.3 Akamizu, T (2000). "Hashimoto's Thyroiditis".
- ↑ "Hashimoto's disease". Office on Women’s Health, U.S. Department of Health and Human Services. 12 June 2017. Archived from the original on 28 July 2017. Retrieved 17 July 2017. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ Noureldine, SI; Tufano, RP (January 2015). "Association of Hashimoto's thyroiditis and thyroid cancer". Current Opinion in Oncology. 27 (1): 21–5. doi:10.1097/cco.0000000000000150. PMID 25390557.
- ↑ Akamizu, T; Amino, N; DeGroot, LJ; De Groot, LJ; Beck-Peccoz, P; Chrousos, G; Dungan, K; Grossman, A; Hershman, JM; Koch, C; McLachlan, R; New, M; Rebar, R; Singer, F; Vinik, A; Weickert, MO (2000). "Hashimoto's Thyroiditis". Endotext. PMID 25905412.
- ↑ "Hashimoto Thyroiditis – Endocrine and Metabolic Disorders". Merck Manuals Professional Edition (in కెనడియన్ ఇంగ్లీష్). July 2016. Archived from the original on 31 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "Hashimoto Thyroiditis – Hormonal and Metabolic Disorders". Merck Manuals Consumer Version (in కెనడియన్ ఇంగ్లీష్). Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
- ↑ Shoenfeld, Yehuda; Cervera, Ricard; Gershwin, M. Eric (2010). Diagnostic Criteria in Autoimmune Diseases (in ఇంగ్లీష్). Springer Science & Business Media. p. 216. ISBN 9781603272858. Archived from the original on 28 July 2020. Retrieved 29 August 2017.
- ↑ Moore, Elaine A.; Wilkinson, Samantha (2009). The Promise of Low Dose Naltrexone Therapy: Potential Benefits in Cancer, Autoimmune, Neurological and Infectious Disorders. McFarland. p. 30. ISBN 9780786452583. Archived from the original on 28 July 2020. Retrieved 29 August 2017.