Jump to content

హస్నైన్ మసూది

వికీపీడియా నుండి
హస్నైన్ మసూది
హస్నైన్ మసూది


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 అక్టోబర్ 8
ముందు జహూర్ అహ్మద్ మీర్
నియోజకవర్గం పాంపోర్

పదవీ కాలం
2019 మే 23  2024 జూన్ 4
ముందు మెహబూబా ముఫ్తీ
తరువాత మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి
నియోజకవర్గం అనంతనాగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-02-12) 1954 ఫిబ్రవరి 12 (వయసు: 72)
పుల్వామా , జమ్మూ & కాశ్మీర్ , భారతదేశం
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
తల్లిదండ్రులు గులాం అలీ మసూది
జీవిత భాగస్వామి తసీన్ ఖాద్రీ
సంతానం ఒక కొడుకు & ఒక కూతురు
నివాసం క్రూ , పుల్వామా

హస్నైన్ మసూది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అనంతనాగ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పాంపోర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

హస్నైన్ మసూది జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గులాం అహ్మద్ మీర్‌పై 6,676 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[3] పార్లమెంట్‌లో పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ, లైబ్రరీ కమిటీ, సంస్కృతి, పర్యాటక మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

హస్నైన్ మసూది 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పాంపోర్ శాసనసభ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీడీపీ అభ్యర్థి జహూర్ అహ్మద్ మీర్‌పై 2,763 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] [5]

మూలాలు

[మార్చు]
  1. "Hasnain Masoodi" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.
  2. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
  4. Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Pampore". the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది.
  5. "J&K Assembly Election Results 2024: JKNC Candidate Hasnain Masoodi Wins Pampore Constituency" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 October 2024. the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.