హార్స్ టెయిల్ జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హార్స్ టెయిల్ జలపాతం
సూర్యాస్తమయ సమయంలో హార్స్ టెయిల్ జలపాతం దృశ్యం
ప్రదేశంయోసెమైట్ నేషనల్ పార్క్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
అక్షాంశరేఖాంశాలు37.729124°N 119.628475°W
రకంహార్స్ టెయిల్
మొత్తం ఎత్తు650 metres (2,130అడుగులు)
బిందువుల సంఖ్య2
పొడవైన బిందువు480 మీటర్లు (1,570 అడుగులు)
సగటు ప్రవాహరేటుసాధారణ సంవత్సరంలో కొన్ని వారాలు చాలా నెమ్మదిగా ప్రవహించే ప్రవాహం
అదొక జలపాతం... ఏటా కొన్ని రోజులు మాత్రం అదొక అద్భుతం!
పపంచ పర్యటకులు వచ్చి చూస్తారు...
ఇంతకీ ఏం జరుగుతుంది? నీళ్లు మంటల్లా కనిపిస్తాయి!

ఉత్తర అమెరికా ఖండంలో ప్రతి ఏటా రెండు వారాలు మాత్రమే కనిపించే అద్భుత దృశ్యం ఇది. జలజల దూకే జలపాతం ఇలా కాంతిపుంజాల్ని విరజిమ్ముతోందేమిటి? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడే ముందు ఇది ఎప్పటి కథనో చూద్దాం. 1960 నాటి మాట. బహుశా అంతకు మునుపేనేమో? ఇదమిత్థంగా తెలీదు. ఇది అసలు జలపాతం కాదు. మానవుడు సృష్టించిన అభూత కల్పన. ‘యోసేమైట్’ పార్క్‌లో ఎత్తైన శిఖరాలపై నుంచీ మందుగుండు సామాగ్రిని పేల్చి - గలగల దుమికే అగ్ని శిఖల్ని దొర్లించటం ఇక్కడి ప్రత్యేకత. గ్లేసియర్ పాయింట్ మొదలుకొని పేల్చే ‘ఫైర్ వర్క్స్’ అనతికాలంలోనే ప్రాచుర్యం పొంది ఉన్నట్టుండి అదృశ్యమై పోవటానికి కారణం - ఇది ప్రమాదభరితమైన అంశం కావటమే. అడపాదడపా ‘యోసేమైట్’ పార్క్ వచ్చి వెళ్లే సందర్శకులను మరింత ఆకర్షించటానికి ఈ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరిలో రెండు వారాలపాటు జరిగే ఈ తంతు ఆ లోయకే కొత్త అందాల్ని తెచ్చిపెట్టాయి. అందుకే ముద్దుగా ‘హార్స్ టెయిల్ ఫాల్’ అంటూ స్థానికులు పిలుచుకుంటూంటారు

జలపాతం అంటేనే కిందకి దూకే నీటి ధారలు. కానీ అవే ధారలు బంగారు రంగులో మెరిసిపోతే? ఆ అద్భుతాన్ని చూడాలంటే కాలిఫోర్నియా లోని "హార్స్ టెయిల్"[1] జలపాతం దగ్గరకు వెళ్లాల్సిందే. అయితే ఎప్పుడు పడితే అప్పుడు వెళితే లాభంలేదు. ఏడాదిలో కేవలం రెండు వారాలు మాత్రమే అవకాశం. ఆ రోజుల్లో సూర్యుడు అస్తమించేటఫ్ఫుడు కొద్ది క్షణాల పాటు నీళ్లన్నీ కిందికి దూకుతున్న మంటల్లా మారిపోతాయి. సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో పడేటప్పుడు జరిగే వింత ఇది. అందుకే దీన్ని "పైర్ ఫాల్స్"ని కూడా అంటారు.

  • యోస్‌మైట్ జాతీయ పార్కులో ఎల్‌క్యాపిటన్ అనే కొండపై నుండి పడే ఈ జలపాతం కేవలం కొన్ని ఋతువుల్లో మాత్రమే ఏర్పడుతుంది.
  • ఏటా ఫిబ్రవరి చివరి రెండు వారాలు మాత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు ఈ జలపాతం రంగులు మారిపోతాయి. తెల్లని నీళ్ల ధార క్రమంగా బంగారు రంగులోకి మారుతుంది. కాసేపటిలోనే ఎరుపు రంగును పులుముకుంటుంది[2]. అప్పుడు మంటలు దూకుతున్నట్టే అనిపిస్తుంది.
  • ఆ రెండు వారాల కోసారి దేశదేశాల నుంచి వేలాది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఫొటోలు తీసుకుంటారు[3].
  • ఈ కొండ ప్రపంచంలోనే అతి పెద్ద గ్రానైట్ కొండ.

చిత్రమాలిక[మార్చు]


ఇవి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

  1. "Yosemite National Park Waterfalls". U.S. National Park Service. 8 December 2008. Retrieved 2009-01-05.
  2. "The Natural Firefall". yosemitefirefall.com. Archived from the original on 2013-01-27. Retrieved 2013-05-17.
  3. "How to photograph Horsetail Falls". California Photo Scout. 28 January 2009. Archived from the original on 12 ఫిబ్రవరి 2009. Retrieved 2009-02-04.