హితశ్రీ
హితశ్రీ తెలుగు కథా రచయిత. ఇతని అసలు పేరు మతుకుపల్లి వెంకట నరసింహ ప్రసాదరావు. ఇతడు 1926, జనవరి 3న జన్మించాడు[1]. అతని సోదరుడు మతుకుమల్లి సుబ్బారావు హిందూ కళాశాలలో ప్రధానాధ్యాపకునిగా పనిచేసాడు.[2]
వీరి పూర్వీకులు
[మార్చు]వీరి పూర్వీకులలో చాలామంది కవులు, రచయితలు ఉన్నారు. వీరిది విద్వత్కవి వంశము. ఇమ్మడి నాగన్ననాయుడు గారి ఆస్థాన కవిగా ఇతని పూర్వీకుడు మతుకుమల్లి నరసింహశాస్త్రి ఉండేవారు. వీరు ఆర్వేల నియోగ బ్రాహ్మణులు. వీరు కాశ్యప గోత్రానికి చెందినవారు. వీరు ఆపస్తంబ సూత్రులు, కృష్ణయజు శాఖీయులు, మాల్యాద్రి నృసింహస్వామి భక్తులు
మతుకుమల్లి యిల్లు మహివిద్య వెదజల్లు
పరబుధేంద్రులకును బక్కముల్లు
ఎరిగి మెలగిరేని నెలమిచే వాటిల్లు
గాన వారియిల్లు ఘనత జెందె
అతి చమత్కృతిగలిగిన మతుకుమల్లి
వారు శాబ్దముకొల్పిన కారణమున
వసుధలోపల మంచెళ్ళవారి యిల్లు
శారదాదేవి నాటక శాల యండ్రు
వాసుదేవుని కవితా విలాస మచట
మొకల బంగరు గజ్జెల మ్రోత గాదె
అని నరసింహ శాస్త్రి జననిగయు జానకాంబ మతుకుమల్లి వంశమును ప్రశంసించెను. మంచెళ్ళ వాసుదేవకవి కవితా విలాసమునకు మతుకుమల్లి వారే కారకులని సూచిందినది.
వీరి మూల పురుషుడు కృష్ణయ్య, కృష్ణయ్య ముని మనుమడగు మతుకుమల్లి మాధవ కవి అభినవ భారత కర్త. నెల్లూరు మండలంలోని చిన్నపమిడి, పెద్ద పమిడి భలేరాయణిఅంగారి సంస్థానములో మతుకుమల్లి వారు దివానులుగా నుండెడి వారు. మాధవమంత్రి అగ్రజుడగు కనకయ్య వాసిరెడ్డి వారి యాస్థాన పండితుడు. కనకయ్య కుమారుడు పెద నృసింహము. ఈ పెద నృసింహము సంతతికి చెందిన వారిలో తిరునల్వేలి హిందూ కళాశాలలో ప్రధానాధ్యాపకునిగా పనిచేసిన మతుకుమల్లి సుబ్బారావు, హితశ్రీ యను ఆధునిక కథకులుగా పేరొందిన ప్రసాదరావులు పరిగణింపదగినవారు[2].
పుస్తకాలు
[మార్చు]
పుస్తకం | రకం | ప్రచురణ తేది |
---|---|---|
కథామంజూషిక | కథా సంపుటం | 1988-01-01 |
కథాసాగరం 8 | కథా సంపుటం | 1954-01-01 |
గులాబిపువ్వు-సిగరెట్టు | కథా సంపుటం | 1970-01-01 |
చిత్ర భారతం | ఫీచర్ | 1987-01-01 |
జరీఅంచు | కథా సంపుటం | 1967-01-01 |
హితశ్రీ కథలు | కథా సంపుటం | 1964-01-01 |
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Archived from the original on 2014-11-24. Retrieved 2020-04-19.
- ↑ 2.0 2.1 తూమాటి, దోణప్ప. ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము. ఆంధ్ర విశ్వవిద్యాలయం.