హితోక్తి రత్నాకరము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హితోక్తి రత్నాకరము
కృతికర్త: వేదుల సత్యనారాయణ శాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: పిల్లల కథలు
ప్రచురణ:
విడుదల: 1931
పేజీలు: 113


సంస్కృత సాహిత్యం ప్రపంచానికి అందించిన అపురూపమైన సారస్వత నిధుల్లో పంచతంత్రం ఒకటి. మనిషి జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని జంతువుల నడుమ జరిగినట్లుగా వివిధ కథల ద్వారా చెప్తూ వివేకాన్ని, వినోదాన్ని ఏకకాలంలో అందించే కథల మాలిక అది. దాన్ని విష్ణుశర్మ రచించారు. ఆ పుస్తకం విస్తారం కావడంతో ముఖ్యమైన కథలను స్వీకరించి నారాయణ పండితుడు అనే కవి తన స్వంత కల్పితాలైన మరికొన్ని కథలు చేర్చి హితోపదేశం అనే గ్రంథరచన సంస్కృతంలో చేశారు.

దానిని ఈ గ్రంథ రూపంలో రచయిత వేదుల సత్యనారాయణ శాస్త్రి తెనిగించారు. ఇది 1931 లో ముద్రణ చేయబడింది. ఇందులో సుహృల్లాభము, సుహృద్భేదము అని రెండు భాగాలు కలవు.

మూలాలు

[మార్చు]