హిరోషిమా
జపాన్ కు చెందిన చారిత్రక పట్టణం హీరోషిమా (Hiroshima). ఇది జపాన్ పెద్ద ద్వీపమైన హోంషులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో 1945, ఆగష్టు 6 న అమెరికా అణుబాంబుకు గురై, నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే.
హీరోషిమా నగరాన్ని 1589లో మోరి టెరిమోటో స్థాపించాడు. ఆ తర్వాత యుద్ధాల వల్ల ఎందరో రాజుల చేతులు మారింది. బలమైన ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థను కలిగి 1905లో జరిగిన జపాన్-రష్యా యుద్ధంలో సహకరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రాంత సైన్యపు ప్రధానస్థావరం హీరోషిమానే. సైన్యానికి సరఫరా చేసే అనేక డిపోలు కూడా ఈ నగరంలో ఉండేవి. కాబట్టి ఈ నగరాన్ని ధ్వంసంచేయాలని అమెరికా నిర్ణయించి 1945, ఆగస్ట్ 6 న బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అనొలాగే (Enola Gay) అణుబాంబును ఉదయం గం.8.15 ని.లకు జారవిడిచింది. అణుబాంబు దాడికి గురైన తొలి నగరంగా శాశ్వతంగా ఈ నగరం చరిత్రలో నిల్చిపోయింది. ఈ సంఘటన వల్ల వెంటనే 70 వేల ప్రజలు మరణించగా, ఆ తర్వాత గాయాల వల్ల అణుధూళి వల్ల 90,000 నుండి 1,40,000 వరకు మరణించినట్లు లెక్కవేశారు [1]. నగరంలోని దాదాపు 69% భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది జరిగిన కొద్దికాలానికే 1945, సెప్టెంబరు 17 న పెద్ద టైఫూన్ ఈ నగరంపై విరుచుకుపడింది. దీని వల్ల మరో 3 వేలమంది మరణించడం, ఆస్తి నష్టం సంభవించడం జరిగింది.
2006 ప్రకారము ఈ నగర జనాభా 11,54,391 [2]. ఈ నగర విస్తీర్ణం 905.08 చ.కి.మీ..[3] 1910లో ఈ నగరం జనాభా 1,43,000 [4] ప్రపంచ యుద్ధం ముందునాటికి 3,60,000, 1942 నాటికి 4,19,182 వరకు పెరిగింది.[3] 1945 లో ఆణుబాంబు దాడికి గురైన తరువాత జనాభా 1,37,197 కు పడిపోయింది.[3] 1955 నాటికి మళ్ళీ యుద్ధ పూర్వసమయం నాటి జనాభాకు చేరింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ (ఆంగ్లము)http://www.rerf.or.jp/general/qa_e/qa1.html Archived 2007-09-19 at the Wayback Machine రేడియేషన్ ఎఫెక్ట్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్
- ↑ (ఆంగ్లము)"జపాన్ జనాభా, పట్టీ 92". Statistics Bureau. Retrieved 2007-08-14.
- ↑ 3.0 3.1 3.2 (ఆంగ్లము)"2006 Statistical Profile". The City of Hiroshima. Archived from the original on 2008-02-06. Retrieved 2007-08-14.
- ↑ (ఆంగ్లము)టెర్రీ, థామస్ ఫిలిప్ (1914). టెర్రీస్ జపనీస్ ఎంపైర్. హౌగ్టన్ మిఫ్లిన్ కో. pp. పేజీ 640.
- ↑ (ఆంగ్లము)డి రాహమ్-అజిమి; నస్రిన్; మాట్ ఫుల్లర్; హిరోకో నకయామా (2003). Post-conflict Reconstruction in Japan, Republic of Korea, Vietnam, Cambodia, East Timor. ఐక్యరాజ్య సమితి ప్రచురణ. pp. పేజీ 69.