Jump to content

హెచ్‌ఏ రెహమాన్

వికీపీడియా నుండి
(హెచ్‌ఏ రెహమాన్‌ నుండి దారిమార్పు చెందింది)

హెచ్‌ఏ రెహమాన్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మాజీ ఎమ్మెల్సీ గా, వైఎస్సా ర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

హబీబుర్‌ అబ్దుల్ రహమాన్‌లో టిఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో అసెంబీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్‌ రహమాన్‌కు ఖరారుకాగా చివరి నిమిషంలో మార్పు జరిగింది తరువాత 2007లో ఆయనను టిఆర్ఎస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చింది. [1] ఆయన వై.యస్. రాజశేఖరరెడ్డి పట్ల అభిమానంతో ఆయనను కలిశాడు. దీనిని సీరియస్ గా తీసుకున్న టిఆర్ఎస్ అధిష్టానం ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.[2] వై ఎస్ రాజశేఖర్ మరణాంతరం ఆయన తనయుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3][4] 2014లో తెలంగాణ రాష్ట్రం నుంచి హెచ్‌ఏ రెహమాన్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించాడు. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు.[5]

మరణం

[మార్చు]

హెచ్‌ఏ రెహమాన్‌ 2021, ఏప్రిల్ 30న హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. The Hindu Images (7 March 2007). "Hyderabad: TRS MLC nominees Sudershan Rao and H.A.Rahman shouting slogans against rebel TRS MLA's and... | The Hindu Images". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  2. The New Indian Express (28 June 2009). "Four TRS rebels back in party fold". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  3. YSR Congress Party (28 May 2015). "'అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను తొలగించాలి'". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  4. The Hans India (20 March 2019). "Former YSRCP MLC MA Rahman gets three years jail imprisonment". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  5. Andhrajyothy (30 April 2021). "వైసీపీ నాయకుడు హబీబుర్‌ రహమాన్‌ మృతి". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  6. "వైఎస్సార్‌సీపీ నేత రెహ్మాన్‌ మృతి.. సీఎం జగన్‌ సంతాపం". Sakshi. 30 April 2021. Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  7. Sakshi (30 April 2021). "వైఎస్సార్‌సీపీ నేత రెహమాన్‌ మృతి." Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.