హెన్రీ డేవిడ్ లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెన్రీ డేవిడ్ లీ యొక్క చిత్రపటం.

హెన్రీ డేవిడ్ లీ (డిసెంబరు 9, 1849 - మార్చి 15, 1928) లీ జీన్స్ ను రూపొందించిన హెచ్ డీ లీ మర్కెంటైల్ కంపెనీ వ్యవస్థాపకుడు. వెర్మాంట్ లో పుట్టిన లీ, దక్షిణ ట్యున్ బ్రిడ్జ్ లో చదువుకొన్నాడు. 1862 లో ఓహియో లోని గాలియోన్ లో ఒక హోటల్ లో గుమాస్తాగా ఉద్యోగం ప్రారంభించాడు. సెంట్రల్ ఆయిల్ కంపెనీకి కూడా పనిచేసాడు.

క్షయ వ్యాధితో బాధపడుతున్న లీని వైద్యులు పడమటి వైపుగా జీవించమని చెప్పటంతో 1889 లో హెచ్ డీ లీ మర్కెంటైల్ కంపెనీ ని స్థాపించాడు. కన్సాస్, డెన్వర్ నగరాల మధ్యలో ఆహారాన్ని అందించే సంస్థగా అతి వేగంగా ఎదిగింది. కొంత కాలానికి పాఠశాలకి కావలసిన వస్తువులని కూడా తయారు చేయటం మొదలు పెట్టినది. పనిచేసే వేళల్లో ధరించవలసిన వస్త్రాలను రూపొందించే ప్రయత్నంలో ఉద్భవించినదే లీ జీన్స్.

ఇవి కూడా చూడండి[మార్చు]