హెన్రీ పెక్వెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశం తపాలా బిళ్ల - 1961 - కోల్నెక్ట్ 238985 - 1 - పెక్వెట్ ఫ్లయింగ్ హంబర్ సోమర్

హెన్రీ పెక్వెట్ (ఆంగ్లం: Henri Pequet; 1888 ఫిబ్రవరి 1 - 1974 మార్చి 13) 1911 ఫిబ్రవరి 18న మొదటి అధికారిక ఎయిర్‌మెయిల్ విమానంలో పైలట్.[1][2][3] ఎయిర్‌మెయిల్ అనేది విమానాల ద్వారా ఉత్తరాలను రవాణా చేసే సేవ. ఫ్రెంచ్ కు చెందిన 23 ఏళ్ల అతను మొదటి సారి భారతదేశంలో, అలహాబాద్ పోలో మైదానం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైనీకి దాదాపు 6,500 లేఖలను బట్వాడా చేశాడు. నైని ప్రాంతాన్ని నైని ఇండస్ట్రియల్ ఏరియా అని కూడా పిలుస్తారు. ఇది అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్) పరిసర ప్రాంతం, అలాగే ప్రయాగ్‌రాజ్ జంట నగరం అని చెప్పవచ్చు.[4]

అతను దాదాపు యాభై హార్స్పవర్ (37 kW)తో హంబర్-సోమర్ బైప్లేన్‌ను ఎగురవేసాడు. పదమూడు నిమిషాల్లో ఈ ప్రయాణాన్ని పూర్తి చేశాడు.

ఈ లేఖలపై "ఫస్ట్ ఏరియల్ పోస్ట్, యు.పి. ఎగ్జిబిషన్ అలహాబాద్ 1911" అని నమోదు చేసారు. దీంతో ఎయిర్‌మెయిల్‌ సేవ 1911లో అలహాబాద్, యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటీష్ ఇండియాలో అధికారికంగా ప్రారంభమైందని తెలుస్తుంది,[5][6]

మూలాలు[మార్చు]

  1. S. B. Bhattacherje (May 2009). Encyclopaedia of Indian Events & Dates. p. A-175. ISBN 9788120740747.
  2. "Blog | National Postal Museum".
  3. "100 years of the world's first official airmail flight | Stamp News | Philately News | Postage Stamp | philately". Archived from the original on 2015-06-09. Retrieved 2013-06-29.
  4. "10 Twin Towns and Sister Cities of Indian States". walkthroughindia.com. Retrieved 9 January 2014.
  5. "Blog | National Postal Museum".
  6. S. B. Bhattacherje (May 2009). Encyclopaedia of Indian Events & Dates. p. A-175. ISBN 9788120740747.