హెన్రీ స్టావ్లీ లారెన్స్
Jump to navigation
Jump to search
సర్ హెన్రీ స్టావ్లీ లారెన్స్ (1870, అక్టోబరు 20 - 1949, జూన్ 29)[1] ఒక బ్రిటీష్ సివిల్ సర్వెంట్, కలోనియల్ అడ్మినిస్ట్రేటర్. ఇతను బ్రిటీష్ రాజ్ కాలంలో 1926 మార్చి 20 నుండి 1928 డిసెంబరు 8 వరకు బొంబాయికి తాత్కాలిక గవర్నర్‌గా పనిచేశాడు.
బ్రిటిష్ సివిల్ సర్వీస్‌లో న్యాయమూర్తి అయిన జార్జ్ హెన్రీ లారెన్స్ - మార్గరెట్ స్టావ్లీల దంపతులకు కౌంటీ డోనెగల్‌లో జన్మించాడు. ఇతను బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన సర్ జార్జ్ సెయింట్ పాట్రిక్ లారెన్స్ మనవడు, సర్ హెన్రీ మోంట్‌గోమెరీ లారెన్స్, జాన్ లారెన్స్, 1వ బారన్ లారెన్స్మేనల్లుడు.[2]
ఇతను 1926 న్యూ ఇయర్ ఆనర్స్‌లో ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా నైట్ కమాండర్‌గా నియమించబడ్డాడు.
మూలాలు
[మార్చు]- ↑ Foster, Joseph (1882). The Baronetage and Knightage of the British Empire for 1882: Forming the Second Part of "The Peerage, Baronetage and Knightage of the British Empire" (in ఇంగ్లీష్). Nichols. p. 399. Retrieved 3 February 2021.
- ↑ Fox-Davies, Arthur Charles. Armorial Families: A Directory of Gentlemen of Coat-armour (in ఇంగ్లీష్). T.C. & E.C. Jack. p. 960. Retrieved 3 February 2021.