Jump to content

హెలెన్ క్లార్క్

వికీపీడియా నుండి
ది రైట్ ఆనరబుల్ హెలెన్ క్లార్క్ ఆర్డర్ ఆఫ్ న్యూజిలాండ్, స్టార్ ఆఫ్ ది సాల్మన్ ఐల్యాండ్స్
హెలెన్ క్లార్క్

2010లో క్లార్క్


న్యూజిలాండ్ 37వ ప్రధానమంత్రి
పదవీ కాలం
5 డిసెంబరు 1999 – 19 నవంబరు 2008
చక్రవర్తి ఎలిజబెత్ II
Governor–General మైకెల్ హార్డీ బాయ్స్
సిల్వియా కార్ట్ రైట్
ఆనంద్ సత్యానంద్
డిప్యూటీ జిమ్ అండర్టన్
మైకెల్ కలెన్
ముందు జెన్నీ షిప్లే
తరువాత జాన్ కీ

యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి కార్యక్రమం(డవలప్ మెంట్ ప్రూగ్రాం)కు 8వ నిర్వాహకురాలు
పదవీ కాలం
17 ఏప్రిల్ 2009 – 19 ఏప్రిల్ 2017
ముందు కెమల్ డెర్విస్
తరువాత అకిం స్టైనెర్

విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి
పదవీ కాలం
29 ఆగస్టు 2008 – 19 నవంబరు 2008
ముందు విన్స్టన్ పెటర్స్
తరువాత మర్రే మెక్ కల్లీ

న్యూజిలాండ్ 27వ ప్రతిపక్ష నాయకురాలు
పదవీ కాలం
1 డిసెంబరు 1993 – 10 డిసెంబరు 1999
డిప్యూటీ డేవిడ్ కేగిల్
మైకెల్ కలెన్
ముందు మైక్ మూరే
తరువాత జెన్నీ షిప్లే

న్యూజిలాండ్ లేబర్ పార్టీ 12వ నాయకురాలు
పదవీ కాలం
1 డిసెంబరు 1993 – 19 నవంబరు 2008
Deputy మైకెల్ కలెన్
ముందు మైక్ మూరే
తరువాత ఫిల్ గోఫ్

న్యూజిలాండ్ 11వ ఉపప్రధానమంత్రి
పదవీ కాలం
8 ఆగస్టు 1989 – 2 నవంబరు 1990
ప్రధాన మంత్రి గోఫ్ఫెరీ పామెర్
మైక్ మూరే
ముందు గోఫ్ఫెరీ పామెర్
తరువాత డాన్ మెక్ కిన్నన్

న్యూజిలాండ్ లేబర్ పార్టీ 11వ నాయకురాలు
పదవీ కాలం
8 ఆగస్టు 1989 – 1 డిసెంబరు 1993
నాయకుడు గోఫ్ఫెరీ పామెర్
మైక్ మూరే
ముందు గోఫ్ఫెరీ పామర్
తరువాత డేవిడ్ కేగిల్

న్యూజిలాండ్ 29వ ఆరోగ్య శాఖా మంత్రి
పదవీ కాలం
30 జనవరి 1989 – 2 నవంబరు 1990
ప్రధాన మంత్రి డేవిడ్ లంగే
గోఫ్ఫెరీ పామెర్
మైక్ మూరే
ముందు డేవిడ్ కేగిల్
తరువాత సిమన్ అప్టన్

Member of the న్యూజిలాండ్ Parliament
for మౌంట్ ఆల్బర్ట్
పదవీ కాలం
28 నవంబరు 1981 – 17 ఏప్రిల్ 2009
ముందు వారెన్ ఫ్రీర్
తరువాత డేవిడ్ షేరర్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-02-26) 1950 ఫిబ్రవరి 26 (వయసు 74)
టె పహు, న్యూజిలాండ్
రాజకీయ పార్టీ న్యూజిల్యాండ్ లేబర్ పార్టీ
జీవిత భాగస్వామి పీటర్ డావిస్(1981)
పూర్వ విద్యార్థి ఆక్ల్యాండ్ విశ్వవిద్యాలయం
సంతకం హెలెన్ క్లార్క్'s signature

హెలెన్ ఎలిజబెత్ క్లార్క్ (జననం 1950 ఫిబ్రవరి 26), న్యూజిలాండ్కు చెందిన ప్రముఖ రాజకీయవేత్త. 1999 నుంచి 2008 వరకు ఆమె న్యూజిలాండ్ 37వ ప్రధానమంత్రిగా పనిచేసింది. 2009 నుంచి 2017 వరకు యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి కార్యక్రమం (డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) కు నిర్వాహకురాలిగా కూడా చేసింది. న్యూజిలాండ్ లో అతి ఎక్కువ కాలం పనిచేసిన 5వ ప్రధానమంత్రి. ఆ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన రెండవ మహిళ హెలెన్ కావడం విశేషం.[1]

హెలెన్ న్యూజిలాండ్ లోని హామిల్టన్ అనే ద్వీపంలో ఉన్న ఒక ఫామ్‌లో పెరిగింది. ఆమె 1968లో రాజకీయ శాస్త్రం చదువుకునేందుకు ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడే హెలెన్, న్యూజిలాండ్ లేబర్ పార్టీలో చేరి, పార్టీలో క్రియాశీలకంగా ఉండేది. చదువు పూర్తి అయిన తరువాత, ఆ విశ్వవిద్యాలయంలోనే రాజకీయ శాస్త్రంలో అధ్యాపకురాలిగా చేరింది. 1974లో, ఆక్లాండ్ లో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించిన హెలెన్, ఏ పదవికీ ఎన్నిక అవ్వలేదు. ఒక విఫల యత్నం తరువాత, 1981 సార్వత్రిక ఎన్నికల్లో మౌంట్ ఆల్బర్ట్ నియోజకవర్గం నుండి న్యూజిలాండ్ పార్లమెంట్ కు సభ్యురాలిగా ఎన్నికైంది హెలెన్. 2009లో రాజీనామా చేసేవరకూ, వరసగా ఆ స్థానం నుంచే పోటీ చేసి, గెలుస్తూ వచ్చింది.[2]

న్యూజిలాండ్ లో లేబర్ పార్టీ నాలుగోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వ కేబినెట్ లో ఎన్నో శాఖలకు మంత్రిగా పనిచేసింది హెలెన్. గృహ కల్పన శాఖ, ఆరోగ్య శాఖ, పరిరక్షణ శాఖ వంటి ఎన్నో శాఖలకు మంత్రిగా చేసింది. 1989 నుంచి 1990 వరకు గోఫ్ఫెరీ పామర్, మైక్ మూరే ల ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేసింది. 1993లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓటమి తరువాత, హెలెన్, అప్పటి పార్టీ నాయకుడు మైక్ మూరేపై సవాలు చేసి, అతనికి పోటీగా నిలబడి పార్టీకి నాయకురాలిగా ఎన్నికైంది. 1993 నుంచి 1996 వరకూ ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగింది. 1996 ఎన్నికల్లో కూడా లేబర్ పార్టీ ఓడిపోయినా, 1999 ఎన్నికల్లో భారీ మెజారిటీతో పార్టీని గెలిపించి, అధికారంలో నిలబెట్టింది హెలెన్.

హెలెన్, న్యూజిలాండ్ లో లేబర్ పార్టీ ఏర్పాటు చేసిన 5వ ప్రభుత్వాన్ని నడిపింది. ఆమె కాలంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసింది. కివీ బ్యాంక్, న్యూజిలాండ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్, న్యూజిలాండ్ ఎమిషన్స్ ట్రేండింగ్ స్కీం, కివీ సేవర్ వంటి ఎన్నో ఆర్థిక సంబంధమైన ప్రణాళికలను ప్రవేశ పెట్టింది. హెలెన్ 2004లో సముద్ర గర్భం, తీరాలకు సంబంధించిన చట్టం ప్రవేశ పెట్టింది. అయితే ఈ చట్టం ఎంతో వివాదాస్పదం కావడంతో 2011లో రద్దు చేశారు. విదేశీ వ్యవహారాల విషయంలోనూ ఆమె తనదైన శైలిలో పనిచేసింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి తన సేనలను పంపినా, ఇరాక్ యుద్ధానికి మాత్రం పంపలేదు. ఆమె ఎన్నో వాణిజ్య భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకుంది. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి అభివృద్ధి చెందిన దేశం, న్యూజిలాండ్. దీనికి ఈమె కృషే కారణం. 2006 తూర్పు టిమొరీస్ సంక్షోభం సమయంలో సైనిక సహాయం కూడా చేసింది ఈమె ప్రభుత్వం. మూడు సార్లు ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, 2008లో హెలెన్, లేబర్ పార్టీ ఓటమి పాలయ్యాయి. ఆ తరువాత, ఆమె పార్టీ నాయకురాలిగా కూడా రాజీనామా చేసేసింది. హెలెన్ తరువాత, న్యూజిలాండ్ నేషనల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, జాన్ కీ ప్రధానమంత్రి అయ్యాడు.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

నలుగురు అక్కాచెల్లెళ్ళలో, హెలెన్ మొదటి అమ్మాయి. ఆమె హామిల్టన్ ద్వీపంలోని టీ పహు ప్రాంతానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందినది.[3] ఆమె తల్లి మార్గరెట్ మెక్ మారే, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసేది. మార్గరెట్ ఐరిష్ జాతికి చెందినది. హెలెన్ తండ్రి జార్జ్ రైతు. ఆమె టీ పహులోని ప్రాథమిక పాఠశాలలోనూ, ఆక్లాండ్ లోని ఎప్సం గర్ల్స్ గ్రామర్ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించింది. 1974లో, ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ (ఆనర్స్) డిగ్రీ పూర్తి చేసింది. ఆమె గ్రామీణ రాజకీయ స్థితి, ప్రాతినిధ్యం అనే అంశం మీద థీసిస్ చేసింది.[4][5] యుక్తవయస్సులో హెలెన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించి, వియత్నామ్ యుద్ధానికి, న్యూజీల్యాండ్‌లో విదేశీ సైనిక స్థావరాలను నెలకొల్పడంపైనా తన నిరసనను తెలియజేసింది.[5]

నోట్స్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Helen Clark". New Zealand history online. 20 నవంబరు 2010. Archived from the original on 10 మార్చి 2012. Retrieved 9 మే 2018.
  2. Young, Audrey (18 April 2009). "Haere ra Helen and Heather". The New Zealand Herald.
  3. Eyley, Claudia Pond; Salmon, Dan (2015). Helen Clark: Inside Stories. Auckland: Auckland University Press. p. 300. ISBN 978 1 77558 820 7.
  4. "New Zealand Executive – Helen Clark". Archived from the original on 18 జూన్ 2006. Retrieved 9 మే 2018.
  5. 5.0 5.1 East, Roger; Thomas, Richard (2003). Profiles of People in Power: The World's Government Leaders (in ఇంగ్లీష్). Psychology Press. p. 382. ISBN 9781857431261. Archived from the original on 25 నవంబరు 2017.