హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు
రీజినల్ రింగు రోడ్డు | |
---|---|
మార్గ సమాచారం | |
నిర్వహిస్తున్న సంస్థ హైదరాబాదు మహానగరపాలక సంస్థ, హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం, హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ | |
పొడవు | 210 మై. (340 కి.మీ.) |
Status | ప్రతిపాదించిన (2018) |
Existed | 2018 (ప్రతిపాదించిన)–present |
ముఖ్యమైన కూడళ్ళు | |
రింగు రోడ్డు around హైదరాబాదు | |
దక్షిణం చివర | కంది |
ఉత్తర చివర | సంగారెడ్డి |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రహదారి వ్యవస్థ | |
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ 340 కిలోమీటర్ల మేర ఈ రింగు రోడ్డును నిర్మించనున్నారు. సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-యాదాద్రి-చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం, చౌటుప్పల్-చేవెళ్ల-శంకర్‌పల్లి-ఆమనగల్-సంగారెడ్డి వరకు దక్షిణ భాగంగా 182 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతించింది.[1][2]
హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి మొత్తం 17 వేల కోట్ల రూపాయలు. చౌటుప్పల్ (జాతీయ రహదారి 65) , షాద్ నగర్ (జాతీయ రహదారి 44), సంగారెడ్డి (జాతీయ రహదారి 65) వరకు దక్షిణ భాగ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి 6 వేల 481 కోట్లు (ఉత్తర భాగానికి పదివేల కోట్లకు పైగా + దక్షిణ భాగానికి 6,481 కోట్లు కలిపి) ఖర్చు అవుతాయని ప్రాథమిక అంఛనా. దాదాపు 17 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఆర్.ఆర్.ఆర్. ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది.[3]
క్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్టర్లు రానున్న ప్రాంతాలు
[మార్చు]- హైదరాబాద్–ముంబై జాతీయ రహదారి: పెద్దాపూర్–గిర్మాపూర్ గ్రామాల మధ్య
- సంగారెడ్డి–నాందేడ్ రహదారి: శివంపేట సమీపంలోని ఫసల్‌వాది సమీపంలో..
- హైదరాబాద్–మెదక్ రోడ్డు: రెడ్డిపల్లి–పెద్ద చింతకుంట మధ్య
- హైదరాబాద్–నాగ్‌పూర్ రోడ్డు: తూప్రాన్ సమీపంలోని మాసాయిపేట వద్ద
- హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి: గౌరారం సమీపంలోని గుందాన్‌పల్లి వద్ద
- హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి: భువనగిరి–రాయ్‌గిరి మధ్య భువనగిరికి చేరువలో..
- జగదేవ్‌పూర్–చౌటుప్పల్ రోడ్డు: మందాపురం–పెనుమటివానిపురం మధ్య..
- హైదరాబాద్–విజయవాడ హైవే: చౌటుప్పల్ సమీపంలోని బాగరిగడ్డ వద్ద
మూలాలు
[మార్చు]- ↑ NTV (12 December 2021). "రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి మరో ముందడుగు". Archived from the original on 27 January 2022. Retrieved 27 January 2022.
- ↑ Sakshi (23 February 2021). "ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రం ఓకే!". Archived from the original on 12 April 2021. Retrieved 27 January 2022.
- ↑ Namasthe Telangana (25 March 2022). "ఆర్‌ఆర్‌ఆర్‌పై తొలి గెజిట్ రెడీ!". Archived from the original on 25 March 2022. Retrieved 25 March 2022.