Jump to content

హైదరాబాద్ రోడ్డు అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
హైదరాబాద్ రోడ్డు అభివృద్ధి సంస్థ
సంస్థ వివరాలు
స్థాపన 12 జూన్ 2017
మునుపటి ఏజెన్సీలు రోడ్లు, భవనాలు
హైదరాబాదు మహానగరపాలక సంస్థ
అధికార పరిధి హైదరాబాదు మహానగరం

హైదరాబాద్ రోడ్డు అభివృద్ధి సంస్థ (హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అనేది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పబ్లిక్ రోడ్ల అధికారిక సంస్థ. దీని ద్వారా హైదరాబాదు నగరంలో రోడ్ల నిర్మాణం, నిర్వాహణ పనులు నిర్వర్తించబడుతాయి.[1] మొదటి దశలో 240 కి.మీ.ల పొడవులోని రోడ్డును ఈ సంస్థ అభివృద్ధి చేయడంతోపాటు మిగిలినవి దశలవారీగా అభివృద్ధి చేయబడుతాయి.[1][2]

చరిత్ర

[మార్చు]

2017, మార్చి 11న జీవో నెం 106తో ప్రత్యేక ప్రయోజన వాహనంగా అధికారికంగా రూపొందించబడింది. 2017 జూన్ 12న ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా, మునిసిపల్ పరిపాలన కార్యదర్శి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా దీనిని ప్రారంభించారు. ఆర్ అండ్ బి డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన రోడ్లు ఈ అథారిటీ సంస్థకి బదిలీ చేయబడ్డాయి. పెరుగుతున్న రోడ్ల వ్యవస్థను నిర్మించడానికి, నిర్వహించడానికి మూలధనాన్ని అందించడం కోసం ఇది ఏర్పాటుచేయబడింది.[3]

సంస్థ

[మార్చు]

హైదరాబాద్, దాని పరిసర పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రహదారి నెట్‌వర్క్ ను ఈ సంస్థ కలిగి ఉంది. ఆర్ అండ్ బి శాఖ పరిధిలో హైదరాబాద్ పరిధిలోని 600 కి.మీ.ల రోడ్డు నెట్‌వర్క్ ఉంది. ఈ సంస్థ రాకముందే ఇందులోని 240 కి.మీ.ల రోడ్లు ఫేమ్ Iలో దీనికి బదిలీ చేయబడింది. రహదారిపై ప్రకటన, పార్కింగ్, యాక్సెస్, రహదారి పైన లేదా దిగువన ఉన్న ఏదైనా నిర్మాణం లేదా ఆస్తి పన్నుపై సెస్ వంటి అన్ని హక్కులు కూడా ఈ సంస్థకు ఇవ్వబడ్డాయి.

అభివృద్ధి పనులు

[మార్చు]

నగరంలోని ప్రధాన రహదారులను అనుసంధానం చేసే స్లిప్ రోడ్లు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఈ సంస్థకు రూ .313.65 కోట్లు మంజూరు చేయగా నగర రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వాహనాలు సజావుగా వెళ్ళేందుకు ఈ సంస్థ 44.70 కి.మీ.ల పొడవుగల 37 స్లిప్ రోడ్లను వేసింది.[4]

2021, జూన్ 28న ఐటి కారిడార్, ఫైనాన్షియల్ జిల్లాలో నాలుగు లింక్ రోడ్లను మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖమంత్రి కె.టి. రామారావు ప్రారంభించాడు. ఈ సంస్థ నుండి రూ. 23.43 కోట్లతో నిర్మించిన ఈ లింక్ రోడ్ల ద్వారా జెఎన్టీయూ నుండి హైటెక్ సిటీ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. మియాపూర్, సర్దార్ పటేల్ నగర్, వసంత్ నగర్, కెపిహెచ్‌బి ఫేజ్ 6 నుండి హైటెక్ సిటీ రోడ్, హఫీజ్‌పేట్ రోడ్ వరకు రోడ్ కనెక్టివిటీని మెరుగయింది.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "GHMC loss is Hyderabad Road Development Corporation's gain". Deccan Chronicle. 1 September 2017. Retrieved 19 May 2018.
  2. Hyderabad Road Development Corporation Limited set up to improve road quality in Hyderabad
  3. "GHMC faces revenue loss as four more roads go to Hyderabad Road Development Corporation Limited". The New Indian Express. Retrieved 2021-08-13.
  4. "Rs 313 crore sanctioned for 37 slip roads in Hyderabad". The New Indian Express. Retrieved 2021-08-13.
  5. Mayabrahma, Roja (2021-06-28). "KTR inaugurates four link roads in Hyderabad". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-13.
  6. "Missing links Phase I & II compressed" (PDF). www.ghmc.gov.in. Retrieved 2021-08-13.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  7. "Four new link roads opened in Hyderabad for better connectivity". The News Minute (in ఇంగ్లీష్). 2021-06-28. Retrieved 2021-08-13.