హైదరాబాద్ సిటీ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
హైదరాబాద్ సిటీ శాసనసభ నియోజకవర్గం 1952లో హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన శాసనసభా నియోజకవర్గం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
| సంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
|---|---|---|---|---|---|---|---|---|---|
| 1952 | జనరల్ | సయ్యద్ హసన్ అబీదీ | పు | స్వతంత్ర అభ్యర్ధి | 10772 | మీర్ అహ్మద్ అలీఖాన్ | పు | కాంగ్రేసు | 8086 |
సయ్యద్ హసన్ హైదరాబాదుకు చెందిన ప్రముఖ షియా కుటుంబంలో జన్మించాడు.[2] 1952 హైదరాబాద్ శాసనసభ ఎన్నికల్లో, హైదరాబాద్ సిటీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యాడు.[3] ఈయన అభ్యర్థిత్వానికి కమ్యూనిస్టు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతు ఇచ్చింది.[2] సయ్యద్ హసన్ ఈ ఎన్నికల్లో 10,772 ఓట్లు పొందాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 224.
- ↑ 2.0 2.1 Economic and Political Weekly, Vol. 6, Eds. 15. Sameeksha Trust., 1971. p. 793
- ↑ 3.0 3.1 Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF HYDERABAD