సయ్యద్ హసన్ అబీదీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సయ్యద్ హసన్ అబీదీ ఒక భారతీయ రాజకీయవేత్త. సయ్యద్ హసన్ హైదరాబాదుకు చెందిన ప్రముఖ షియా కుటుంబంలో జన్మించాడు.[1] 1952 హైదరాబాద్ శాసనసభ ఎన్నికల్లో, హైదరాబాద్ సిటీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యాడు.[2] ఈయన అభ్యర్థిత్వానికి కమ్యూనిస్టు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతు ఇచ్చింది.[1] సయ్యద్ హసన్ ఈ ఎన్నికల్లో 10,772 ఓట్లు పొందాడు.[2]

అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు మార్చబడినప్పుడు, హైదరాబాద్లోని షియా ప్రాబల్య ప్రాంతాలు మలక్‌పేట నియోజకవర్గంలో భాగమయ్యాయి. సయ్యద్ హసన్ మలక్‌పేట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా (కమ్యూనిస్టుల మద్దతు లేకుండా) 1957 మరియు 1962 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేశాడు.[1] 1957లో అతను నియోజకవర్గంలో 3,258 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.[3] 1962లో ఆయన 1,908 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.[4]

మూలాలు

[మార్చు]