హోటల్ గాల్వెజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Galvez Hotel
Hotel galvez.jpg
The Hotel Galvez in 2006
ప్రదేశం2024 Seawall Blvd
Galveston, Texas
అక్షాంశ రేఖాంశాలు29°17′33″N 94°47′10″W / 29.29250°N 94.78611°W / 29.29250; -94.78611Coordinates: 29°17′33″N 94°47′10″W / 29.29250°N 94.78611°W / 29.29250; -94.78611
నిర్మాణం1911
ప్రభుత్వ సంస్థWyndham Hotels and Resorts, LLC
NRHP Reference #79002944[1]
RTHL #7494
Significant dates
Added to NRHPApril 4, 1979
Designated RTHL1980

హోటల్ గాల్వెజ్ అనేది యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాక్ నగరం గాల్వెస్టన్ లో ఉన్న ఒక చారిత్రక హోటల్. ఈ హోటల్ 1911లో ప్రారంభించారు.బెర్నార్డో డి గాల్వేజ్ వై మాడ్రిడ్ అనే వ్యక్తి గౌరవార్థం దీనికి ఆ పేరు పెట్టారు. చారిత్రక ప్రదేశాల జాతీయ రిజిస్టర్ లో ఈ హోటల్ పేరు ఏప్రిల్ 4, 1979లో నమోదైంది.

హోటల్ గాల్వెజ్ & స్పా -విందాం గ్రాండ్ హోటల్ అనేది అమెరికాలోని చారిత్రక హోటల్స్ సముదాయంలో సభ్యత్వం కలిగి ఉంది.[2]

చరిత్ర[మార్చు]

గాల్వెస్టన్ ద్వీపంలో గతంలో ఉన్న ఓ పెద్ద హోటల్(బీచ్ హోటల్)అగ్ని ప్రమదాంలో దగ్ధం కావడంతో స్థానిక నేతలు 1898లో గాల్వెజ్ హోటల్ భవన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. 1900 నాటి హరికేన్ తుఫాన్ తర్వాత ఈ ప్రణాళికను వేగవంతం చేసి తిరిగి పర్యాటకులను ఈ ద్వీపానికి రప్పించాలని ఆలోచించారు. ఈ హోటల్ నుసెయింట్ లూయిస్, మిస్సోరీ కి చెందిన మారన్, రస్సెల్ & క్రోవెల్ డిజైన్ చేశారు. $1 మిలియన్ల ఖర్చుతో నిర్మించిన ఈ హోటల్ జూన్ 1911లో ప్రారంభమైంది.

అక్టోబరు3, 1940లో గాల్వెజ్ హోటల్ ను విలయమ్ లూయిస్ మూడీ జూనియర్ ఆధీనంలోకి తీసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం మొదలైనప్పటి నుంచి ముగిసేదాకా యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ రెండు సంవత్సరాల పాటుఆక్రమించుకున్నారు. దీంతో.. ఈ కాలంలో పర్యాటకులకు ఈ హోటల్ ను అద్దెకు ఇవ్వలేకపోయారు. యుద్ధం ముగిసిన తర్వాత 1940, 1950 కాలంలో ఈ హోటల్లో జరిగే గ్యాంబ్లింగ్ ఆట వల్ల గాల్వెజ్ ఆదాయం భారీగా పెరిగింది. అయితే ఇది సంఘవ్యతిరేక చర్య కావడంతో గ్యాంబ్లింగ్ పరిశ్రమను 1950 మధ్యకాలంలో టెక్సాస్ రేంజర్లు మూసివేశారు.[3]

1965లో ఈ హోటల్ కు రంగులు వేసి పెద్ద ఎత్తున ఆధునీకరించారు. 1971 లో ఈ హోటల్ ను హార్వే ఓ.మెక్ కార్తే, డాక్టర్ లీయోన్ బ్రోంబెర్గ్ స్వాధీనం చేసుకున్నారు. 1978లో ఈ హోటల్ ను కొనుగోలు చేసిన డెంటన్ కూలీ చొరవతో 1979లో ఈ హోటల్ మరోసారి ఆధునీకరించారు. 1989లో ఇది మారియట్ శాఖగా మారింది. ఈ హోటల్ ను 1995 ఏప్రిల్ లో గాల్వెస్టన్ కొనుగోలు చేశారు. స్థానిక రియల్ ఎస్టేట్ డెవలపర్ గా ఉన్న జార్జ్ పి.మిచెల్ ఈ హోటల్ కు 1911 నాటి పాత లుక్ వచ్చేలా దీన్ని తీర్చి దిద్దారు. 1996లో ఈ హోటల్ పేరును హోటల్ గాల్వెజ్ గా మార్చారు. ప్రస్తుతం దీనిలో 224 గదులు, సూట్లు ఉన్నాయి.

హోటల్ ప్రత్యేకతలు-సేవలు[మార్చు]

హోటల్ గాల్వెజ్ & స్పా, విందాం [4]గ్రాండ్ హోటల్ అనేది చారిత్రక గాల్వెస్టన్ ద్వీపంలో బిషప్ ప్యాలేస్ , గ్రాండ్ 1894 ఒపెరా హౌస్ కు అతి సమీపంలో ఉంటుంది. ఇవి గాకుండా రైలు రోడ్ మ్యూజియం, టెక్సాస్ ఓడరేవు మ్యూజియం కూడా ఇక్కడికి సమీపంలో ఉంటాయి. ఈ హోటల్లో ఓ రెస్టారెంట్, పూల్ సైడ్ బార్, బార్/లాంజ్, స్విమ్ అప్ బార్ ఉన్నాయి. విశ్రాంతి, వినోద సౌకర్యాల్లో భాగంగా అవుట్ డోర్ పూల్, స్పా టబ్, 24 గంటల ఫిట్ నెస్ సదుపాయం ఉన్నాయి. ఈ 4 స్టార్ హోటల్లో 24-గంటల పాటు అందుబాటులో ఉండే వ్యాపార కేంద్రం, చిన్న సమావేశ గదులు కూడా ఉన్నాయి.ఇవి గాకుండా సెక్రటేరియల్ సేవలు, లిమో/టౌన్ కారు సేవ వంటివి లభిస్తాయి. వీటితో పాటు పబ్లిక్ ఏరియాలో కాంప్లిమెంటరీ వైర్ లెస్ ఇంటర్నెట్ సదుపాయం వంటివి కూడా ఉంటాయి. బాంకెట్ సదుపాయాలు, సమావేశ గదులు, బాల్ రూం, ప్రదర్శన స్థలం, క్రూయిజ్ షిప్ టెర్నినల్ షటిల్ వంటివి ఇక్కడ ఉన్నాయి. వ్యాపార సేవలు, వివాహ సేవలు, పర్యాటకులకు కావాల్సిన సమాచారం సేవలు కూడా అందిస్తారు. [5]

224 ఏసీ అతిథి గదులు హోటల్ గాల్వెజ్ & స్పాలో ఉన్నాయి. విందాం గ్రాండ్ హోటల్ సదుపాయాల్లో భాగంగా లాప్ టాప్ పరికరాల సేఫ్ లు, కాఫీ/టీ మేకర్స్ కూడా ఉంటాయి. పిల్లో టాప్ పరుపులతో కూడిన బెడ్లు, స్నానాల గదుల్లో మేకప్ /షేవింగ్ అద్దాలు, బాత్ రోబ్స్, హెయిర్ డ్రయర్స్ ఉంటాయి. 42 అంగులాల ఫ్లాట్ స్క్రీన్ టీవీ వంటి సదుపాయాలెన్నో ఇక్కడ లభిస్తాయి.

మూలాలు[మార్చు]

  1. National Park Service (2006-03-15). "National Register Information System". National Register of Historic Places. National Park Service.
  2. "Hotel Galvez & Spa, A Wyndham Grand Hotel, a Historic Hotels of America member". Historic Hotels of America. Retrieved 24 July 2015. Cite journal requires |journal= (help)
  3. "Galvez Hotel". Texas Historic Sites Atlas. మూలం నుండి 21 ఏప్రిల్ 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2015. Cite web requires |website= (help)
  4. "Hotel Galvez & Spa Services". cleartrip.com. Retrieved 24 July 2015. Cite web requires |website= (help)
  5. "Hotel Galvez & Spa Photo Gallery". hotelgalvez.com. Retrieved 24 July 2015. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]