హోవ్హాన్నెస్ తుమాన్యెన్ తోలుబొమ్మల థియేటరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హోవ్హాన్నెస్ తుమాన్యెన్ జాతీయ తోలుబొమ్మల థియేటరు
పటం
Addressసయత్ నోవా అవెన్యూ 4
యెరెవాన్
 Armenia
Ownerఆర్మేనియా ప్రభుత్వం
Operatorరుబెన్ బబయాన్
Typeతోలుబొమ్మల థియేటరు
Opened1935
Website
అధికారిక వెబ్సైటు

అధికారికంగా యెరెవాన్ రాష్ట్ర తోలుబొమ్మల థియేటరు పేరును హోవ్హన్నెస్ తుమన్యన్ (అర్మేనియన్:Երևանի Հովհաննես Թումանյանի անվան Պետական Տիկնիկային Թատրոն (యెరెవని హోవ్హన్నెస్ తుమన్యాని అంవన్ పెటకాన్ టిక్నికాయిన్ టాట్రన్) ) గా నామకరించారు. ఇది యెరెవాన్ లోని  ఒక తోలుబొమ్మ థియేటరు. దీనిని 1935 జూన్ 1వ తేదీన దర్శకుడు సోఫియా బెజన్యాన్, చెత్రకారుడు గెవార్గ్ అరకెల్యాన్, నటులు పావ్లోస్, అరక్సియా అరబ్యాన్ లు ప్రారంభించారు. ఈ థియేటరు యొక్క మొదటి డైరెక్టరు వరియా స్టెఫన్యన్. తరువాత 1938 లో, థియేటర్ నామకరణం చేయబడింది. తరువాత థియేటరు పేరును హోవ్హాన్నెస్ తుమన్యాన్ కు మార్చారు.

1950-1957 మధ్య కాలంలో థియేటరును మూసివేశారు. అయితే, 1957 జూలై 27న, థియేటరును పునఃప్రారంభించారు అప్పుడు యెరెవాండ్ మనర్యన్ డైరెక్టరు అయ్యారు. 1975 నుండి ఈ థియేటరు ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుండి తన కార్యకలాపాలను సాగిస్తుంది.

ఈ థియేటరు యొక్క ప్రస్తుత మేనేజర్, ఆర్ట్ డైరెక్టర్ థియేటరు రుబెన్ బబయాన్.

పవ్లోస్ బొరోయాన్ పేరిట నామాంతరం వచ్చిన తోలుబొమ్మల సంగ్రహాలయానికి ఇది నిలయం.[1]

సూచనలు

[మార్చు]
  1. "ఆర్మేనియా తోలుబొమ్మల థియేటరు". Archived from the original on 2014-10-18. Retrieved 2018-07-03.