Jump to content

ఆర్మేనియా

వికీపీడియా నుండి
(Armenia నుండి దారిమార్పు చెందింది)
Republic of Armenia

Հայաստանի Հանրապետություն
Hayastani Hanrapetut’yun  (Armenian)
Flag of Armenia
జండా
Coat of arms of Armenia
Coat of arms
గీతం: 
Մեր Հայրենիք
Mer Hayrenik
"Our Fatherland"
Location of Armenia
రాజధానియెరెవాన్
40°11′N 44°31′E / 40.183°N 44.517°E / 40.183; 44.517
అధికార భాషలుArmenian[1]
జాతులు
(2011)
మతం
Armenian Apostolic Church[4]
పిలుచువిధంArmenian
ప్రభుత్వంUnitary parliamentary republic
• President
Armen Sarkissian
Nikol Pashinyan
Ara Babloyan
• నేషనల్ అసెంబ్లీ ఆర్మేనియా వైస్ ప్రెసిడెంట్
ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్
శాసనవ్యవస్థNational Assembly
Formation and independence
• Traditional date
2492 BC
1500–1290 BC
14th century–1190 BC
• Urartu[7]
860–590 BC
6th century BC
190 BC[8]
52–428
885–1045
1198–1375

28 May 1918
• Independence from the Soviet Union
21 September 1991
విస్తీర్ణం
• మొత్తం
29,743 కి.మీ2 (11,484 చ. మై.) (138th)
• నీరు (%)
4.71[10]
జనాభా
• 2016 estimate
2,924,816[11]
• 2011 census
Decrease 3,018,854[12][13] (134th)
• జనసాంద్రత
101.5/చ.కి. (262.9/చ.మై.) (99th)
GDP (PPP)2017 estimate
• Total
$27.212 billion[14]
• Per capita
$9,098[14]
GDP (nominal)2017 estimate
• Total
$11.037 billion[14]
• Per capita
$3,690[14]
జినీ (2013)31.5[15]
medium
హెచ్‌డిఐ (2015)Increase 0.743[16]
high · 84th
ద్రవ్యంDram (֏) (AMD)
కాల విభాగంUTC+4 (AMT)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+374
ISO 3166 codeAM
Internet TLD

ఆర్మేనియా లేదా ఆర్మీనియా (ఆర్మీనియన్ భాష : Հայաստան, "హయాస్తాన్") అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా" (Հայաստանի Հանրապետություն, హయాస్తానీ హన్రపెతూత్ యూన్), ఒక భూపరివేష్టిత దేశం, దక్షిణ కాకసస్ పర్వతాలతో చుట్టబడి నల్లసముద్రం, కాస్పియన్ సముద్రం ల మధ్య ఉంది. ఈ దేశం తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల నడుమ ఉంది. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్‌బైజాన్, దక్షిణాన ఇరాన్, అజర్‌బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్‌క్లేవ్లు ఉన్నాయి.

అర్మేనియా పురాతన సాంస్కృతిక వారసత్వం కలిగిన యూనిటరీ మల్టీ పార్టీ డెమొక్రటిక్ నేషన్ - స్టేట్. క్రీ.పూ.840లో స్థాపించిన ఉరర్తు క్రీ.పూ 6వ శతాబ్దంలో పతనం తరువాత " ది సాత్రపీ ఆఫ్ ఆర్మేనియా " స్థాపించబడింది. క్రీ.పూ మొదటి శతాబ్దంలో " కింగ్‌డం ఆఫ్ ఆర్మేనియా " టిగ్రనేసు ది గ్రేట్ ఆధ్వర్యంలో శిఖరాగ్రం చేరుకుంది. క్రైస్తవమతాన్ని అధికార మతంగా స్వీకరించిన ప్రపంచ దేశాలలో మొదటి దేశంగా ఆర్మేనియాకు ప్రత్యేకత ఉంది.[17] సా.శ. 3 వ 4వ శతాబ్ధాల మద్య (సా.శ. 301) [18] ఆర్మేనియా క్రైస్తవమతాన్ని అధికారమతంగా స్వీకరించినదేశంగా గుర్తింపు పొందింది. [19][20][21] ఫలితంగా అంతకు ముందున్న జోరోయాస్ట్రియనిజం, ఆర్మేనియన్ పాగనిజం క్రమంగా క్షీణించాయి.[22][23] ఆర్మేనియా రాజ్యం " సిసిలియా ఆర్మేనియా "గా పిలువబడింది. సిసిలియా ఆర్మేనియా 11-14 శతాబ్ధాలలో మధ్యధరా సముద్రతీరం వరకు విస్తరించింది. 16వ శతాబ్దం , 19 వ శతాబ్దం ఆరంభం వరకు సంప్రదాయ ఆర్మేనియా భూభాగం తూర్పు ఆర్మేనియా, పశ్చిమ ఆర్మేనియాలుగా ఓట్టమన్ సామ్రాజ్యంలో భాగం అయింది. రెండు శతాబ్ధాల తరువాత ఓట్టమన్ స్థానంలో పర్షియన్లు పాలనాధికారం చేపట్టారు. 19వ శతాబ్దం మద్యకాలం నాటికి తూర్పు ఆర్మేనియాలో సంభవించిన రుస్సో - పర్షియా యుద్ధాలలో రష్యన్లు విజయం సాధించారు. సంప్రదాయ ఆర్మేనియా భూభాగం ఓట్టమన్ పాలకుల పాలనలో నిలిచింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆర్మేనియన్లు ఓట్టమన్ సామ్రాజ్యంలో ఉన్న తమ పూర్వ భూభాగంలో నివసించారు. అక్కడే ఆర్మేనియన్లు క్రమపద్దతిలో జాతిహత్యలకు గురై నిర్మూలించబడ్డారు. 1918 లో రష్యన్ విప్లవం సమయంలో రష్యా సామ్రాజ్య విచ్ఛిన్నత కారణంగా రష్యనేతర దేశాలన్నింటికీ స్వతంత్రం లభించింది. ఫలితంగా ఆర్మేనియా కూడా " ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా "గా స్వతంత్రదేశంగా అవతరించింది. 1920 నాటికి ఆర్మేనియా " ట్రాంస్కౌకాసియన్ సోషలిస్ట్ ఫెడరేటివ్ సోవియట్ రిపబ్లిక్‌లో విలీనం చేయబడింది. 1922లో సోవియటు యూనియను ఫండింగ్ మెంబర్ అయింది. 1936లో ట్రాంస్కౌకాసియా రాజ్యం విచ్ఛిన్నం అయింది. తరువాత ఆర్మేనియా సోవియటు యూనియనులో పూర్తిస్థాయి రిపబ్లిక్కు అయింది. 1991లో సోవియటు యూనియను విచ్ఛిన్నత తరువాత ఆధునిక ఆర్మేనియా రిపబ్లికు స్వతంత్రదేశంగా ఉంది. ఆర్మేనియా రిపబ్లికు పూర్వపు మతానుయాయతకు చిహ్నంగా వరల్డ్ ఓల్డెస్ట్ నేషనల్ చర్చి అయిన " ఆర్మేనియా అపోస్టోలికు చర్చి "ని గుర్తించింది.[24][25] క్రీ.పూ 405లో మెస్రాప్ మాష్తొత్స్ సమైక్య ఆర్మేనియా ఆల్ఫబేట్‌ను రూపొందించాడు. ఆర్మేనియా " యురేషియన్ ఎకనమిక్ యూనియన్ ", ది కౌన్సిల్ ఆఫ్ ఐరోపా , ది కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ లలో సభ్యత్వం కలిగి ఉంది. నగొర్నొ- కరబఖ్ - రిపబ్లికు స్వతంత్రానికి ఆర్మేనియా మద్దతు తెలుపుతూ 1991లో ప్రకటన జారీచేసింది.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

స్థానిక ఆర్మేనియా భాషలో దేశంపేరు హయకు. మద్య యుగంలో ఇది హయస్థాను అయింది. హయకు పేరుకు స్థాన్ (స్థాన్ అంటే పర్షియా భాషలో ప్రదేశం అని అర్ధం) చేర్చబడింది. హయస్థాను అంటే హయకు ప్రజల నివాసిత ప్రదేశం. హయకు అనేది ఆర్మేనియా మూలపురుషుని పేరు నుండి వచ్చింది. సా.శ. 5వ శతాబ్ధానికి చెందిన రచయిత " మోసెసు ఆఫ్ చొరెనే " రచనలను అనుసరించి హయకు నోయాహు మునిమనుమని కుమారుడు. హయక్ క్రీ.పూ 3వ శతాబ్దంలో బాబిలోయన్ రాజులను ఓడించి ఆరత్, ఆర్మేనియా (అరారత్ ప్రాంతంలో ) రాజ్యాన్ని స్థాపించాడు.[26] అయినప్పటికీ ఆర్మేనియా పదానికి మూలం అస్పష్టంగానే ఉంది. ఆర్మేనియా అనే స్థానిక, వ్యవహారిక నామం క్రి.పూ 515 నాటి పురాతన పర్షియా బెహిస్టన్ వ్రాతలలో లభిస్తుంది.

). పురాతన గ్రీకు రచనలలో ఆర్మేనియా అనే పదం హెకాటాయస్ మిలెటస్ లో (క్రి.పూ 550-476) ప్రస్తావించబడింది.[27] పర్షియా ఆక్రమణదారులు కొదరికి సేవలు అందించిన గ్రీకు సైనికాధికారి క్సెనొఫోన్ క్రి.పూ 401నాటి ఆర్మేనియా గ్రామస్థుల జీవనవిధానం గురించి, అతిథిమర్యాదల గురించి వర్ణించాడు. ఆయన ఇక్కడ ప్రజలు మాట్లాడే భాష పర్షియా భాషలా వినిపిస్తుందని వివరించాడు.[28] మోసెస్ ఆఫ్ చొరెనె, మైకేల్ చంచైన్ చారిత్రక కథనాలను అనుసరించి ఆర్మేనియా అనే పదానికి మూలం ఆర్మ్ అని ఆర్మ్ హయక్ సంతతికి చెందినవాడని అభిప్రాయపడుతున్నారు.[29][30]

చరిత్ర

[మార్చు]

పురాతనత్వం

[మార్చు]
Reconstruction of Herodotus' world map c. 450 BC, with Armenia shown in the center
The Kingdom of Armenia at its greatest extent under Tigranes the Great, who reigned between 95 and 66 BC

ఆర్మేనియా ఆరాత్ పర్వతాల మద్య ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఆర్మేనియాలో ఆరంభకాల నాగరికతకు (కంచు యుగం క్రీ.పూ 4000) సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి. 2010-2011 లో ఏరియన్-1 గుహ సముదాయాలలో ఆర్కియోలాజికల్ శాఖ నిర్వహించిన పరిశోధనలలో ఏరిన్-1 షూ (మొట్టమొదటిదని భావిస్తున్న లెదర్ షూ),[31] స్కర్ట్[32] ఏరిన్-1 వైన్ (ద్రాక్షారసం) లభించాయి.[33] గ్రేటర్ ఆర్మేనియాలో కంచుయుగం నాటి పలు రాజ్యాలు వర్ధిల్లాయి. వీటిలో హిట్టీటీ సామ్రాజ్యం (అత్యున్నత స్థితి), మితన్ని (నైరుతీ చారిత్రక ఆర్మేనియా), హయస - ఆజ్జి (క్రి.పూ 1500-1200) లు ఉన్నాయి. నైరీ ప్రజలు (క్రి.పు. 12-9శతాబ్దాలు), ఉరతు ప్రజలు (క్రి.పూ 1000-600) ప్రజలు ఆర్మేనియా ఎగువభూములలో విజయవంతంగా రాజ్యాలు స్థాపించారు. పైన చెప్పిన రాజ్యాలలోని గిరిజన తెగల ప్రజలు ఆర్మేనియా స్థానికప్రజలుగా భావించబడుతున్నారు.[34][35][36][37] యెరెవాన్ శిలాక్షరాలలో లభించిన ఆధారాలను అనుసరించి ఆర్మేనియా రాజధాని క్రి.పూ 782 లో ఉరతు రాజు అర్గిష్తిసు చేత స్థాపించబడిందని భావిస్తున్నారు. చరిత్రలో నమోదు చేయబడిన నగరాలలో యెవెరెవన్ అతి పురాతనమైనదని భావిస్తున్నారు.

క్రి.పూ 6వ శతాబ్దం చివరి నాటికి సత్రపి ఆఫ్ ఆర్మేనియా (ఆర్మేనియా ప్రాంతం పరిధి) పొరుగు ప్రాంతాలలో అచమనిదు సామ్రాజ్యానికి ఆధిపత్యంలో సామతరాజ్యంగా ఒరొంతిదు రాజ్యం స్థాపించబడింది. క్రమంగా ఒరొంతిదు సామంతరాజ్యం సెల్యూసిదు మద్దతుతో క్రి.పూ 190లో మొదటి ఆర్తక్సియాదు పాలనలో ఆర్తక్సియాదు రాజ్యంగా స్వతంత్రరాజ్యంగా మారింది. క్రీ.పూ 95-66 మద్య టైగ్రానెసు ది గ్రేట్ ఆధ్వర్యంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా (ఆసమయంలో ఇది రోమన్ రిపబ్లిక్ తూర్పున ఉండేది) అత్యున్నత స్థితికి చేరింది. తరువాత శతాబ్ధాలలో ఆర్మేనియా తిరిదాటెసు ఆధ్వరంలో పర్షియా సామ్రాజ్యంలో భాగం (అరససిదు డైనాసిటీ ఆఫ్ పార్టీయా) అయింది. ఆర్మేనియా చరిత్ర అంతా స్వతంత్రం లేక స్వయంప్రతిపత్తిని అనుభవించింది.

భౌగోళికంగా ఆర్మేనియా రెండు ఖండాలకు మద్యన ఉన్నందున పలు జాతిప్రజల దండయాత్రకు లోనయ్యింది. వీరిలో అస్సిరియన్లు ఉన్నారు. అస్సిరియన్లు అసురబనిపాలు నాయకత్వంలో ఆర్మేనియా సరిహద్దు వరకు (కౌకాససు పర్వతాల వరకు) అస్సిరియా సామ్రాజ్య విస్తరణ చేసారు.[38] ఆర్మేనియా ప్రాంతంలో దండయాత్ర చేసిన వారిలో మెడేలు, అచమెనిదు పర్షియన్లు, గ్రీకులు, పార్టీయన్లు, పురాతన రోమన్లు, సస్సరియన్లు, బైజాంటైన్లు, అరేబియన్లు, సెల్జుక్లు, మంగోలియన్లు, ఓట్టమన్లు, ఇరానియన్లు, సఫావిదులు, క్వాజర్లు, రష్యన్లు కూడా ఉన్నారు.

The Armenian pagan Temple of Garni, probably built 1st century AD, is the only "Greco-Roman colonnaded building" in Armenia and the entire former Soviet Union.[39]

పురాతన ఆర్మేనియా చారిత్రకంగా పర్షియా విశ్వాసాలను ఆచరిస్తుంటారు. ఈ ఆచరణ వీరిని జోరాస్ట్రియనిజం వైపు నడిపించింది. జొరాస్ట్రియన్లు ప్రత్యేకంగా అవెస్టెను మిత్రాలను, స్థానిక ఆర్య దేవతలను (అరమజ్దు, వహగ్ని, అనహితు, అసత్ఘిక్) ఆరాధిస్తారు. దేశం స్యూర్యమాస ఆధారిత హయకు క్యాలెండరును (12 మాసాలు) అనుసరిస్తారు. సా.శ. 40 నుండి దేశంలో క్రైస్తవమతం ప్రవేశించింది. ఆర్మేనియా మూడవ తిరిదతెస్ (238-314) క్రైస్తవమతాన్ని ఆర్మేనియా అధికారిక మతంగా చేసాడు. [22][40][41] 10 సంవత్సరాల తరువాత రోమన్ సామ్రాజ్యానికి క్రైస్తవ దేశంగా గుర్తింపు వచ్చింది. పార్థియన్ పాలన చివరి దశలో ఆర్మేనియా జొరాస్ట్రియా భూమిగా ఉండేది.[22] ఆర్మేనియా రాజ్యం పతనం తరువాత 428 లో ఆర్మేనియా మర్జ్పనేట్‌ఉ పాలనాకాలంలో సస్సనిదు సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. తరువాత 451లో అవరాయరు యుద్ధం (ఆర్మేనియన్ తిరుగుబాటు) సంభవించింది.

మద్య యుగం

[మార్చు]
The Etchmiadzin Cathedral, Armenia's Mother Church traditionally dated 303 AD, is considered the oldest cathedral in the world.[42][43][44]

మర్జ్పనెటు కాలం (428-636) తరువాత ఆర్మేనియా " ఎమిరేట్ ఆఫ్ ఆర్మేనియా " (అరబ్బు సామ్రాజ్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యం) అయింది. అలాగే గతంలో బైజాంటైన్లు ఆక్రమిచుకున్న భూభాగాలు ఆర్మేనియాలో సమైక్యపరచబడ్డాయి. రాజుపాలనలో ఆర్మేనియాను కాలిఫు, బైజాంటైను సామ్రాజ్యాలు గుర్తించాయి. అరేబియన్లు ఆర్మేనియాను తమ సామ్రాజ్యంలో ప్రత్యేక రాజ్యవిభాగంగా రూపొందించారు. ఇందులో జార్జియా, కౌకాషియా అల్బానియాలలో కొంతభూభాగం చేర్చబడింది. ఆర్మేనియా, ద్విను నగరాలు దీకిని కేంద్రంగా ఉండేది. 884 నాటికి అరేబియా బలహీన పడిన కారణంగా ఆర్మేనియా స్వతంత్రం సంపాదించింది. తరువాత ఆర్మేనియా మొదటి అషాతు బగ్రతుని పాలనలోకి మారింది. పునరుద్ధరించబడిన ఆర్మేనియా రాజ్యాన్ని " బగ్రతుని రాజవంశం పాలించింది " 1045 వరకు పాలించింది. ఆసమయంలో బగ్రతిదు ఆర్మేనియా భూభాగాలు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయాయి. వీటిలో వస్పురకను రాజ్యాన్ని అర్తుస్రుని రాజవంశం పాలించింది. తూర్పు ప్రాంతం సియునికు (అర్త్సఖ్) (ఆధునిక నగొర్నొ కరాబఖ్) బగ్రితిదు రాజుల పాలనలోనే ఉండేది.

The Armenian Kingdom of Cilicia, 1198–1375.

1045 లో బైజాంటైను సామ్రాజ్యం బగ్రితిదు ఆర్మేనియాను జయించింది. తరువాత మిగిలిన ఆర్మేనియా రాజ్యాలు బైజాంటైను ఆధీనంలోకి చేరాయి. బైజాంటైను పాలన స్వల్పకాలంలోనే ముగింపుకు వచ్చింది. 1071లో సెల్జుకు తురుక్కులు మంజికెర్టు యుద్ధంలో బైజాంటైన్లను జయించి ఆర్మేనియాను వశపరచుకుని సెల్జుకు సామ్రాజ్యాన్ని స్థాపించారు. అనీ రాజు రెండవ గజికు తన బంధువును హతమార్చాడు. తరువాత ఆయన బంధువుల నుండి ప్రాణాలు రక్షించుకోవడానికి గజికు (ఆర్మేనియా రాకుమారుడు రూబెను) కొందరు అనుయాయులతో కలిసి తౌరసు పర్వతాలకు తరువాత సిలిసియాలోని తార్ససు నగరానికి పారిపోయాడు. బైజాంటైను రాజప్రతినిధి వారికి ఆశ్రయం ఇచ్చాడు. తరువాత 1198 జనవరి 6న రూబెను సంతతికి చెందిన మొదటి లియో " ఆర్మేనియా కింగ్డం ఆఫ్ సిలిసియా "ను స్థాపించాడు. సిలిసియా క్రుసేడర్లతో బలమైన మైత్రీసంబంధం కలిగి ఉండేది. తరువాత ఈ ప్రాంతం" బేసిన్ ఆఫ్ క్రిస్టెండం ఇన్ ది ఈస్ట్"గా గుర్తించబడింది. ఆర్మేనియా చరిత్రలో సిలిసియా కాథలికు రాజ్యంగా గుర్తించబడి " ఆర్మేనియా అపొస్టొలిక్ చర్చి " స్వస్థలంగా మారింది. అలాగే ఆర్మేనియా ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మారింది. తరువాత సెల్జుకు సామ్రాజ్యం పతనం ఆరంభమౌంది. 12వ శతాబ్దం ఆరంభంలో ఆర్మేనియా రాకుమారుడు జకరిదు సెల్జుకు తురకలను తరిమివేసి ఉత్తర, తూర్పు ఆర్మేనియా ప్రాంతాలను కలిపి " సెమీ - ఇండిపెండెంటు ఆర్మేనియా " (జకిరిద్ ఆర్మేనియా) రాజ్యాన్ని స్థాపించాడు. తరువాత జకిరిదు ఆర్మేనియా జారిజియా రాజ్యం ఆధీనంలోకి మారింది.

ఆధునిక యుగం ఆరంభకాలం

[మార్చు]
Seizure of Yerevan fortress by Russian troops in 1827 during the Russo-Persian War (1826-1828) by Franz Roubaud.

1230 లో మంగోలు సామ్రాజ్యం జకరియా రాజ్యాన్ని అలాగే మిగిలిన ఆర్మేనియాను జయించింది. క్రమంగా ఇతర మద్య ఆసియా జాతులైన కారాకొయున్లు, తింరుదు వమ్శీయులు, అక్కొయిన్లు వరకు మంగోలియా దాడులు కొనసాగాయి. ఈ ప్రాంతాలు మంగోలియా దండయాత్రలు 13 వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు సాగాయి. ఎడతెగని దాడులు దేశాన్ని విధ్వంసానికి గురిచేసి ఆర్మేనియాను బలహీనపరిచాయి. 16వ శతాబ్దం నాటికి తూర్పు ఆర్మేనియా, పశ్చిమ ఆర్మేనియా ప్రాంతాలు రెండూ సఫావిదు ఇరానియా పాలనలోకి మారాయి. [45][46] శతాబ్ధకాలం కొనసాగిన టర్కో - ఇరాను భౌగోళిక, రాజకీయ శతృత్వం రెండు దేశాల మద్య వరుస యుద్ధాలకు దారితీసింది. 16వ శతాబ్దం మద్యకాలానికి పీస్ ఆఫ్ అమాస్య, 17వ శతాబ్దంలో ట్రీటీ ఆఫ్ జుహాబ్ తరువాత 19వ శతాబ్దం మొదటి అర్ధభాగం [47] వరకు తూర్పు ఆర్మేనియాను సఫావిదు ఇరానియన్లు, అఫ్షరిదు, క్వాజరు రాజవంశీయులు విజయవంతగా పాలించారు. పశ్చిమ ఆర్మేయాను ఓట్టమను టర్కీ ఆధీనంలో ఉండేది. 1604 నుండి అబ్బాసు (పర్షియా;ఇరాన్), వాయవ్యంలోని తన పూర్వీకులను ఓట్టమను దాడుల నుండి రక్షించడానికి " స్కోర్చ్డ్ ఎర్త్" విధానం ప్రవేశపెట్టాడు. ఈ విధానం ఆర్మేనియన్లు మూకుమ్మడిగా తమస్వస్థలం విడిచిపోయేలా చేసింది (1813 - 1828 మద్యకాలం).మ[48]లో రుస్సో - పర్షియా యుద్ధం (1804-1813), రుస్సో- పర్షియా యుద్ధం (1826-1828) తరువాత క్విజారు రాజవంశం (ఇరాన్) బలవంతంగా తూర్పు ఆర్మేనియాను (కానాటే ఆఫ్ ఎరెవన్, కరాబఖ్ కనాటేకలిసిన ప్రాంతం) రష్యా సామ్రాజ్యానికి ఆధీనం చేసారు.[49]).[50] ఇరాను పాలన తరువాత తూర్పు ఆర్మేనియా ప్రాంతం శతాబ్ధాల కాలం రష్యా ఆధీనంలో రష్యా ఆర్మేనియాగా మారింది.

పశ్చిమ ఆర్మేనియా ఓట్టామను పాలనలో ఉంది. ఆర్మేనియన్లు వారి స్వంత ఎంక్లేవులతో స్వయంప్రతిపత్తి అనుభవిస్తూ సామ్రాజ్యంలోని ఇతర జాతి ప్రజలతో (పాలించే టర్కీలతో కలిసి ) అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించారు. క్రైస్తవులుగా ముస్లిములతో వివక్షను ఎదుర్కొన్నారు. ఓట్టమను సామ్రాజ్యంలో వారు అధిక హక్కుల కొరకు వత్తిడి తీసుకువచ్చినందుకు ఫలితంగా రెండవ అబ్దుల్ - హమిద్ - ఆర్మేనియన్లకు వ్యతిరేకంగా మూకుమ్మడి హత్యలకు (1894-1896) ఆదేశించాడు. ఈ సంఘటనలో దాదాపు 80,000 - 3,00,000 మంది మరణించినట్లు అంచనా. ఈ హత్యలను " ది హమిద్ మాస్క్రీ "గా అభివర్ణించబడింది. ఇది హమిదుకు అంతర్జాతీయ అపకీర్తిని తీసుకువచ్చింది. ఆయనకు " రెడ్ సుల్తాను" " బ్లడీ సుల్తాను" అనే పేర్లను ఇచ్చింది. [51] 1890లో ఆర్మేనియా రివల్యూషనరీ ఫెడరేషన్(దష్నాక్త్‌సుత్యున్) ఓట్టమను సాంరాజ్యంలో చైతన్యవంతంగా పనిచేసింది. సాంరాజ్యంలోని వివిధ చిన్న సమూహాలను సమైక్యపరిచే ప్రయత్నంలో సంస్కరణలు చేపట్టి ఆర్మేనియా గ్రామాలను మూకుమ్మడి హత్యల నుండి రక్షించడానికి చేసిన ప్రయత్నం సాంరాజ్యం అంతటా విస్తరించబడింది. దష్నాక్తుసుత్యును సభ్యులు ఆర్మేనియా ఫెడేయి బృందాలను రూపొందించారు. ఫెడేయి బృందాలు ఆర్మేనియా పౌరులకు సాయుధ సైనికులనుండి రక్షణ కల్పించింది. దష్నక్లు " స్వతంత్ర, సమైక్య ఆర్మేనియా " స్థాపన లక్ష్యంగా కృషిచేసారు.

1908లో ఓట్టమను సాంరాజ్యం పతనం ఆరంభం అయింది." యంగ్ టర్క్ రివల్యూషన్ " సుల్తాను హమిదు ప్రభుత్వాన్ని పడగొట్టింది. 1909 ఏప్రెలులో ఓట్టమను సాంరాజ్యంలోని అలానా విలయతులో " అదానా మూకుమ్మ డి హత్యలు " సంభవించాయి. ఇందులో 20,000 - 30,000 వేలమంది ఆర్మేనియన్లు మరణించారు. సామ్రాజ్యంలో ఆర్మేనియన్లు వారి రెండవ తరగతి అంతస్థులో మార్పు వస్తుందని ఆశాభావంతో జీవించారు. " 1914 ఆర్మేనియన్ రిఫార్మ్ ప్యాకేజ్ " ఆర్మేనియా వివాద పరిష్కారానికి ఇంస్పెక్టరు నియమించబడ్డాడు. [52]

మొదటి ప్రపంచ యుద్ధం

[మార్చు]
Armenian Genocide victims in 1915

మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా కౌకాససు యుద్ధం, పర్షియా యుద్ధాలలో ఓట్టమను సామ్రాజ్యం, రష్యా సామ్రాజ్యాలు ప్రతిధ్వంధులు అయ్యాయి. ఇస్తాంబులులో ఏర్పాటు చేయబడిన కొత్త ప్రభుత్వం ఆర్మేనియన్లలో అవిశ్వాసం, సందేహాలు కలిగించింది. అందువలన ఇంపీరియల్ రష్యా ఆర్మీలో ఆర్మేనియన్ వాలంటీర్ దళాలు పాల్గొన్నాయి. 1915 ఏప్రెలు 24న ఆర్మేనియా ప్రముఖులు ఓట్టమను రాజధానిలో ఖైదుచేయబడ్డారు. అనటోలియాలో నివసిస్తున్న ఆర్మేనియన్లలో అత్యధికులు నశించిపోయారు. ఇది " ఆర్మేనియన్ జెనోసైడ్ "గా అభివర్ణించబడింది. జెనోసైడు రెండు దశలుగా ప్రవేశపెట్టబడింది: ప్రముఖకుంటుంబాలకు చెందిన పురుషుల మూకుమ్మడి హత్యలు, బలవంతంగా సైన్యంలో సేవలు చేయించడం తరువాత స్త్రీలను, పిల్లలను తరలించడం జెనోసైడు రెండవ భాగంగా ఉన్నాయి. సిరియా ఎడారి ప్రయాణంలో ముసలివారు, బలహీనులు మరణానికి గురైయ్యారు. సైనిక దళాల రక్షణలో తరలించబడిన సమయంలో ఆహారం, నీరు, దారిదోపిడీ, మూకుమ్మడి హత్యలు, మానభంగాలు సంభవించాయి.[53][54] ఓట్టమను సాంరాజ్యం చర్యలను ప్రాతీయ ఆర్మేనియన్లు ప్రతిఘటించారు. 1915-1917 ఆర్మేనియా సంఘటనలను పశ్చిమ దేశాల చరిత్రకారులు " ప్రభుత్వ మద్దతుతో జగిన మూకుమ్మడి హత్యలు" లేక జెనీసైడుగా అభివర్ణించారు.[55] జెనోసైడు జరిగినవని భావిస్తున్న సమయాన్ని టర్కిషు అధికారులు అంగీకరించడం లేదు.[56][57] ఆమొల్డ్ జె టయ్నుబీ చేసిన పరిశోధనలు ఆధారంగా 1915-1916 మద్యా కాలంలో సంభవించిన తరలింపు సమయంలో 6,00,000 ఆర్మేనియన్లు మరణించారని భావిస్తున్నారు. ఈ సంఖ్య జెనోసైడు మొదటి సంవత్సరానిది. రిపోర్టు పూర్తి చేయబడిన 1916 మే 24 మద్య సంభవించిన మరణాలు పైగణనలోకి రాలేదు.[58] " ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ జెనోసైడ్ స్కాలర్స్ " ఒక మిలియను కంటే అధికంగా మరణాలు సంభవించాయని తెలియజేస్తున్నాయి. [59] చాలామంది 1-1.5 మిలియన్ల ప్రజలు మరణించి ఉంటారని భావిస్తున్నారు.[60] ఆర్మేనియా, ఆర్మేనియన్ డయాస్పోరా (విదేశాలలో నివసిస్తున్న ఆర్మేనియన్లు) ఆర్మేనియా జెనోసైడు సంఘటనలు అధికారికంగా గుర్తించబడాలని 30 సంవత్సరాల నుండి పోరాటం సాగిస్తుంది. వార్షికంగా ఏప్రెలు 24న ఈ సంఘటనలు స్మృతి దినంగా (ఆర్మేనియన్ మార్టిర్ లేక ఆర్మేనియన్ జెనోసైడ్) జరుపుకుంటున్నారు.

ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా

[మార్చు]
The Government house of the First Republic of Armenia (1918–1920)

మొదటి ప్రపంచ యుద్ధంలో నికోలై యుదెనిచు నాయకత్వంలో రష్యా కౌకాససు ఆర్మీ ఆర్మేనియన్ ఆర్మీ వాలంటీరు యూనిట్లు పనిచేసాయి. ఆర్మేనియా మిలటరీ యూనిట్లకు అండ్రనిక్ ఒజనియను, తొవ్మాదు నజర్బెకియన్ ఒకరి తరువాత ఒకరు నాయకత్వం వహించారు. బదులుగా మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఓట్టమను ఆర్మేనియా భుభాగాన్ని పొందారు. అయినప్పటికీ " అక్టోబరు తిరుగుబాటు 1967 "లో వారు పొందిన భూభాగాన్ని కోల్పోయారు. [ఆధారం చూపాలి] అదేసమయం రష్యా - నియంత్రణలోని తూర్పు ఆర్మేనియా, జార్జియా, అజర్బైజాను ఐఖ్యమై " ట్రాంస్కౌకాసియన్ డెమొక్రటిక్ ఫెడరేటివ్ రిపబ్లికు " ఏర్పాటుకు ప్రయత్నించాయి. ఈ ఫెడరేషను ఫిబ్రవరి నుండి మే వరకు మాత్రమే నిలబడింది. తరువాత ముగ్గురు భాగస్వాములు కలిసి దానిని రద్దు చేసారు. ఫలితంగా తూర్పు ఆర్మేనియా ప్రభుత్వం మే 28న స్వతంత్రం ప్రకటించి అరం మనుకియను నాయకత్వంలో " ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా "ను స్థాపించింది.

ఫస్ట్ రిపబ్లికు పాలన, యుద్ధాలు, భూభాగ వివాదాల కారణంగా ఓట్టోమను ఆర్మేనియను నుండి శరణార్ధులుగా ప్రజలు ప్రవేశించడం (వారు తీసుకువచ్చిన వ్యాధులు) కారణాలుగా స్వల్పకాలంలోనే ఇది ముగింపుకు వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ కూటమి ఓట్టొమను ప్రభుత్వ చర్యలకు ఆందోళన చెంది కొత్తగా రూపొందించబడిన ఆర్మేనియా నుండి రిలీఫ్ ఫండ్, ఇతర సహాయం కోరింది.

యుద్ధం ముగిసే సమయానికి విజేతలు ఓట్టమను సామ్రాజ్యం నుండి విభజనను కోరాయి. 1920 ఆగస్టు 10న రెండవ ప్రపంచ కూటమి దేశాలు, ఓట్టొమను సాంరాజ్యం మద్య ఒప్పంద సంతకాలు చేయబడ్డాయి. ట్రీటీ ఆఫ్ సర్వర్సు ఉనికిలో ఉన్న ఆర్మేనియాతో మునుపటి ఓట్టొమను ఆర్మేనియా భూభాగాలను విలీనం చేయడానికి అంగీకారం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు " వుడ్రో విల్సన్ " సరి కొత్త ఆర్మేనియా సరిహద్దులను రూపొందించాడు. ఓట్టమను ఆర్మేనియాను " విల్సోనియను ఆర్మేనియా "గా కూడా వ్యవహరిస్తారు.[61]

Advance of the 11th Red Army into the city of Yerevan

1920లో టర్కిషు నేషనల్ సైన్యం ఆర్మేనియా రిపబ్లికు తూర్పు భాగం మీద దాడిచేసింది. టర్కీ సైన్యానికి కాజిం కరాబెకిరు నాయకత్వం వహించాడు. టర్కీ స్వాధీనం చేసుకున్న ఆర్మేనియా భూభాగాలను రుస్సో- టర్కిషు యుద్ధం (1877-78) తరువాత రష్యాలో విలీనం చేసుకుని పురాతన నగరం అలెగ్జాండ్రోపోలు (ప్రస్తుత గ్యుంరి)ని ఆక్రమించుకుంది. 1920 డిసెంబరు 20 తీవ్రమైన యుద్ధం " ట్రీటి ఆఫ్ అలెగ్జాండ్రోపోలు "తో ముగింపుకు వచ్చింది. ఒప్పందం కారణంగా ఆర్మేనియా " ట్రీటీ ఆఫ్ సవర్సు " ద్వారా పొందిన ఓట్టోమను భాభాగాల నుండి సైన్యాలను వెనుకకు మరలించవలసిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో " గ్రిగోరీ ఆర్ద్ఝొనికిడ్జే " నాయకత్వంలో సోవియటు యూనియను సైన్యం కరవనసరై (ప్రస్తుత ఇజ్వెన్) వద్ద ఆర్మేనియా మీద దండయాత్ర చేసింది. డిసెంబరు 4న ఆర్ద్ఝొనికిడ్జె యెరెవనులో ప్రవేశించాడంతో స్వల్పకాలిక ఆర్మేనియా పతనం అయింది. 1921లో తలెత్తిన " ఫిబ్రవరి తిరుగుబాటు " రిపబ్లిక్ ఆఫ్ మౌటెనియసు ఆర్మేనియా స్థాపనకు దారితీసింది. ఏప్రెలు 26 న గరెజిను న్ఝడెహు నాయకత్వంలో ఆర్మేనియా సైన్యం దక్షిణ ఆర్మేనియా లోని జెంగేజురు ప్రాంతంలో సోవియటు, టర్కిషు సైన్యాలతో యుద్ధం చేసి రిపబ్లిక్ ఆఫ్ మౌటెనియసు ఆర్మేనియా స్థాపించాడు. తరువాత సియునికు ప్రాంతంలో జరిగిన సోవియటు ఒప్పందం తరువాత తిరుగుబాటు ముగింపుకు వచ్చింది. జూలై 13న రెడ్ ఆర్మీ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.

సోవియట్ ఆర్మేనియా

[మార్చు]
The coat of arms of Soviet Armenia depicting Mount Ararat in the center.

ఆర్మేనియా, అజర్బైజాను, జార్జియాలతో రష్యా సోవియటు ఫెడరేటివు సోషలిస్టు రిపబ్లికు (బోల్షెవిస్టు రష్యా)లో విలీనం చేయబడింది. 1922 మార్చి 4 లో ట్రాంస్కౌకాసియాలో భాగంగా ఆర్మేనియా సోవియట్ యూనియనులో విలీనం చేయబడింది. విలీనం చేయబడిన " ట్రీటీ ఆఫ్ అలెగ్జాండ్రొపోలు "ని టర్కిషు - సోవియట్ల " ట్రీటీ ఆఫ్ కార్స్ " అధిగమించింది. ఒప్పందంలో భాగంగా టర్కీ సోవియటు యూనియనుకు రేవు పట్టణం బతుమితో కలిసిన అద్జరాను స్వాధీనం చేసి బదులుగా రష్యా నుండి కార్స్, అర్దహను, ఇగ్దిరు (రష్యా ఆర్మేనియాలోని భాగాలు) ల అధికారం చేజిక్కించుకుంది. టిఎస్.ఎఫ్.ఎస్.ఆర్ 1922 నుండి 1936 వరకు ఉంది. తరువాత ఆర్మేనియా సోవియటు సోషలిస్టు రిపబ్లికు, అజర్బైజాను సోవియటు సోషలిస్టు రిపబ్లికు, జార్జియా సోవియటు సోషలిస్టు రిపబ్లికుగా విభజించబడ్డాయి. తరువాత సోవియటు పాలనలో ఆర్మేనియన్లు కొంతకాలం రాజకీయ స్థిరత్వం అనుభవించారు. ఆర్మేనియన్లు మాస్కో నుండి ఔషధాలు, ఆహారం, ఇతర నిత్యావసరాలు అందుకున్నారు. కమ్యూనిస్టు పాలన ఓట్టమను అల్లర్లను మెత్తపరిచే వంతెనగా మారింది. ఈ పరిస్థితి చర్చికి సమస్యగా మారింది. సోవియటు పాలనలో చర్చి సమస్యలను ఎదుర్కొన్నది. వ్లాదిమిరు లెనిన్, జోసెఫ్ స్టాలిన్ మరణం తరువాత అధికార మార్పిడితో ఆర్మేనియన్ల భయాందోళనలు పునరావృతం అయ్యాయి.[62] రెండవ ప్రంపంచ యుద్ధంలో ఆర్మేనియా ప్రజలలోని మూడవ వంతు ప్రజలు భాగస్వామ్యం వహించారు. వీరిలో 1,75,000 మంది మరణించారు.[63] 1953 లో స్టాలిన్ మరణించిన తరువాత నికిత ఖృశ్చేవ్ సోవియటు యూనియను కొత్త నాయకునిగా నియమించబడిన తరువాత ఆర్మేనియన్ల భయాందోళనలు తగ్గాయి. తరువాత సోవియటు ఆర్మేనియా వేగవంతంగా అభివృద్ధి చెందింది. స్టాలిన్ పాలనలో అధికంగా బాధించబడిన చర్చి 1955లో ఆర్మేనియన్ కాథలిక్కుల ప్రతినిధిగా మొదటి వజ్గెన్ బాధ్యత తీసుకున్న తరువత పునరుద్ధరించబడింది. 1967 లో ఆర్మేనియన్ జెనోసైడ్ బాధితులకు త్సిత్సెర్నకబెర్డ్ కొండ వద్ద మెమోరియలు నిర్మించబడింది. ఇది ఆర్మేనియా జెనోసైడు సంఘటన జరిగిన 50 సంవత్సరాల తరువాత 1965లో వార్షిక దినం రోజున నిర్మించబడింది.

Armenians gather at Theater Square in central Yerevan to claim unification of Nagorno-Karabakh Autonomous Oblast with the Armenian SSR

1980 మిఖైల్ గోర్బొచేవు శకంలో గ్లాస్నొస్టు, పెరెస్ట్రోయిక సంస్కరణలతో సోయటు నిర్మించిన ఫ్యాక్టరీల కారణంగా సంభవించిన వాతావరణం కలుష్యాన్నివ్యతిరేకిస్తూ ఆర్మేనియన్లు తమ దేశపర్యావరణ పరిరక్షణ కొరకు శ్రద్ధ తీసుకోవాలని పట్టుబట్టడం ఆరంభించారు. సోవియటు అజర్బైజాను, అటానింస్ డిస్ట్రిక్ నొగొర్నొ- కారాబఖులో కూడా వత్తిడులు అధికం అయ్యాయి. 1923 లో ఆర్మేనియా నుండి అధికభాగాన్ని స్టాలిన్ వేరు చేసాడు. 1970 నుండి 4,84,000 మంది ఆర్మేనియన్లు అజర్బైజనులో నివసిస్తున్నారు. [64] కరాబాఖ ఆర్మేనియన్లు సోవియటు ఆర్మేనియాతో విలీనం కొరకు పట్టుబట్టారు. కరాబాఖ ఆర్మేనియన్ల కోరికకు మద్దతు ఇస్తూ యెరెవనులో శాంతియుతమైన ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. 1998 లో ఆర్మేనియాలో (7.2 రిక్టర్ స్కేలు) శక్తివంతమైన భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది.[65]

ఆర్మేనియా సమస్యల పరిష్కరణలో గోర్బొచేవు అశక్తత ఆర్మేనియన్ల స్వతంత్రేచ్ఛను ఉత్తేజపరిచింది. 1990 మేలో ఆర్మేనియా కొత్త సైన్యం స్థాపించబడింది. ఇది సోవియటు " రెడ్ ఆర్మీ "తో చేరకుండా ప్రత్యేకంగా ఉండి రక్షణ సేవలు అందించింది. తరువాత ఆర్మేనియా ఆర్మీ, సోవియటు ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్ మద్య ఘర్షణలు తలెత్తాయి. యెరెవను వద్ద ఆర్మేనియన్లు " 1918 ఫస్ట్ ఆర్మేనియా రిపబ్లికు " స్థాపించాలని నిర్ణయించారు. 5 మంది ఆర్మేనియన్లు మరణించిన తరువాత హింసాత్మక చర్యలు చోటుచేసుకున్నాయి. ఆర్మేనియా సైనికులు, సోవియటు బృందాల మద్య పోరాటాలు అధికం అయ్యాయి. ఫలితంగా మరణించిన వారిలో ఆర్మేయన్లు అధికంగా ఉన్నారు. 1990 లో అజర్బైజను రాజధాని బకులో " ది ప్రోగ్రాం ఆర్మేనియన్ ఇన్ బకు " పేరిట తీసుకున్న నిర్ణయంలో అజర్బైజను రాజధానిలో నివసిస్తున్న 2,00,000 ఆర్మేనియన్లు ఆర్మేనియాకు పారి పోవాలని తీర్మానం జరిగింది.[66] 1991 మార్చి 17న ఆర్మేనియా బాల్టికు స్టేట్స్‌, జార్జియా, మొల్దొవాలతో కలిసి దేశవ్యాప్తంగా సేకరించిన రిఫరెండంను బహిష్కరించాయి.[67]

స్వతంత్రం పునఃస్థాపన

[మార్చు]
Armenian soldiers during the Nagorno-Karabakh War

1990 ఆగస్టు 23న ఆర్మేనియా సోవియటు యూనియన్‌ఉ నుండి విడిపోతూ నాన్- బాల్టికు రిపబ్లికుగా స్వతంత్రం ప్రకటించింది. 1991 లో సోవియటు యూనియను పతనం అయిన తరువాత ఆర్మేనియా స్వతంత్రం అధికారికంగా గుర్తించబడింది. 1991 అక్టోబరు 16 న కొత్తగా స్వతంత్రం పొందిన రిపబ్లికు ఆఫ్ ఆర్మేనియా తొలి అధ్యక్షునిగా " లెవొన్ టెర్- పెట్రొస్యన్ " ఎన్నిక చేయబడ్డాడు. లెవొన్ టెర్- పెట్రొస్యన్ పొరుగున ఉన్న అజర్బైనుతో జరిగిన " నొగొర్నొ- కారాబాఖు " యుద్ధానికి నాయకత్వం వహించాడు. స్వతంత్రం తరువాత ఆర్మేనియా ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నది. [68] 1993 లో టర్కీ అజబైజనుకు మద్దతు ప్రకటిస్తూ ఆర్మేనియనుకు వ్యతిరేకంగా బ్లాకేడుతో కలిసింది.[69] 1994లో రష్యా మద్యవర్తిత్వంతో కారాబఖు యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం కారాబఖు ఆర్మేనియా సైనికులకు విజయం చేకూర్చుంది.కారాబఖు ఆర్మేనియన్లు అజర్బైజన్ల అంతర్జాతీయ గుర్తింపు పొందిన 16% భూమిని (నొగొర్నొ - కారాబాఖుతో చేరిన) స్వాధీనం చేసుకున్నారు.[70] అప్పటి నుండి ఆర్మేనియా, అజర్బైజాను శాంతి చర్చలకు సహకారం అందించాయి. ఇందుకు " ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ కో ఆపరేషన్ ఇన్ ఐరోపా) మధ్యవర్తిత్వం వహించింది. కారాబఖు స్థితి నిర్ణయించబడింది. పూర్తి స్థాయి పరిష్కారం లభించని కారణంగా రెండు దేశాల ఆర్థికస్థితి బాధించబడింది. ఆర్మేనియా టర్కీ, అజర్బైజాన్ సరిహద్దులు మూసివేయబడ్డాయి. 1994 నాటికి టర్కీ, అజర్బైజన్లు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. యుద్ధంలో 30,000 మంది మరణించారు. ఈ అల్లర్ల కారణంగా 1 మిలియను ప్రజలు నివాసాలను వదిలి తరలించబడ్డారు.[71] 21వ శతాబ్దంలో ప్రవేశించిన తరువాత ఆర్మేనియా పలు గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నది. అది పూర్తిగా ఆర్మేనియాను మార్కెటు ఎకనమీ వైపు అడుగులు వేసేలా చేసింది. ప్రస్తుతం ఆర్మేనియాపూర్తి స్థాయి ఆర్థిక స్వేచ్ఛకలిగిన దేశాలలో స్థిరంగా 41 వ స్థానంలో నిలిపింది.[72] ఆర్మేనియా ఐరోపా, తూర్పు మద్య ప్రాంతం, " కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్" ల మద్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచబడ్డాయి.[73][74] సహజవాయువు, చమురు, ఇతర వస్తువులు ఇరాన్, జార్జియా నుండి లభిస్తున్నాయి. ఆర్మేనియా రెండు దేశాలతో సుహృద్భావ సంబంధాలు కలిగి ఉంది.[75]

భౌగోళికం

[మార్చు]

దక్షిణ కౌకాససు ప్రాంతంలోని భూబంధిత దేశాలలో ఆర్మేనియా ఒకటి. ఆర్మేనియా నల్లసముద్రం, కాస్పియను సముద్రాల మద్య ఉంది. ఆర్మేనియా ఉత్తర, తూర్పు సరిహద్దులో జార్జియా, అజర్బైజాన్ ఉన్నాయి, దక్షిణ సరిహద్దులో ఇరాన్, పశ్చిమ సరిహద్దులో టర్కీ ఉన్నాయి.

ప్రాంతం

[మార్చు]

ఆర్మేనియా 38-42 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 43-47 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.

నైసర్గికం

[మార్చు]
Armenia's topography is mountainous and volcanic

ఆర్మేనియా రిపబ్లిక్కు వైశాల్యం 29743 చ.కి.మీ. దేశంలో హైలాండు ప్రాంతంలో కాంటినెంటల్ వాతావరణం నెలకొని ఉంటుంది. దేశం అత్యధికంగా పర్వతమయంగా ఉంటింది. దేశంలో వేసవిలో వేడి వాతావరణం, శీతాకాలంలో చల్లగానూ ఉంటుంది. దేశంలోని అర్గాట్సు పర్వతం ఎత్తు సముద్రమట్టానికి సరాసరి 4090 మీ ఉంటుంది. దేశంలో సముద్రమట్టానికి 390 మీ కంటే తక్కువ ఎత్తైన ప్రాంతం ఏదీ లేదు.[76] అరాతు పర్వతం చారిత్రకంగా ఆర్మేనియాలో భాగంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇది అత్యంత ఎత్తైన పర్వతంగా గుర్తించబడుతుంది. ఇది ప్రస్తుతం టర్కీలో ఉంది. అయినప్పటికీ ఆర్మేనియా నుండి ఈ పర్వతం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్మేనియన్లు ఈ పర్వతాన్ని తమజాతి చిహ్నంగా గౌరవిస్తుంటారు. అందువలన ఈ పర్వతం ఆర్మేనియా జాతీయ చిహ్నంలో చోటుచేసుకుంది.[77][78][79]

పర్యావరణం

[మార్చు]

ఆర్మేనియా " మినిస్టరీ ఆఫ్ నేచుర్ ప్రొటెక్షన్ " మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. అలాగే వాయు కాలుష్యం, జలకాలుష్యం, సాలిడ్- చేస్ట్ డిస్పోసల్ పన్ను విధానం ఏర్పాటుచేసింది. పన్ను ద్వారా లభిస్తున్న ఆదాయం పర్యావరణ పరిరక్షణకు ఉపయోగించబడుతుంది. ఆర్మేనియాలో వేస్టేజ్ మేనేజిమెంటు తగినంత అభివృద్ధి చేయబడలేదు.

ఆర్మేనియాలోని విద్యుదుత్పత్తి చేయడానికి అవకాశాలు (ప్రత్యేకంగా జల ఉత్పత్తి) ఉపయోగిస్తూ, ప్రభుత్వం మెట్సామొర్ సమీపంలో (యెరెవన్ సమీపంలో ) " మెట్సామొర్ న్యూక్లియర్ పవర్ ప్లాంటిన్యూక్లియర్ పవర్ ప్లాంటు " నిర్మిచడానికి ఏర్పాటు చేస్తుంది.[80]

వాతావరణం

[మార్చు]

ఆర్మేనియాలో కాంటినెంటల్ వాతావరణం నెలకొని ఉంటుంది. వేసవి కాలం పొడిగా, సూర్యప్రకాశం అధికంగా ఉంది. వేసవి జూన్ నుండి సెప్టెంబరు మాసం వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతలు 22-36 డిగ్రీల సెల్షియస్ మద్యన ఉంటింది. గాలిలో తేమ తక్కుగా ఉంటుంది కనుక ఉష్ణతీవ్రత తక్కువగా ఉంటుంది. పర్వతాల నుండి వీచే సాయంకాల మలయమారుతం ఆహ్లాదం, చల్లదనం కలిగిస్తుంది. వసంతకాలం తక్కువగా ఉంటుంది. హేమంతకాలం దీర్ఘంగా ఉంటుంది. హేమతం వర్ణరంజితంగా ఉండి ఆహ్లాదం కలిగిస్తుంది కనుక ఇక్కడ హేమంతానికి ప్రత్యేకత ఉంది.

శీతాకాలం విస్తారమైన హిమపాతంతో చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత 10-5 డిగ్రీల సెల్షియస్ ఉంటింది. శీతాకాలంలో దిగువ పర్వత ప్రాంతంలో (త్సాక్కద్జర్) ఉత్సాహవంతమైన స్కీయింగ్ క్రీడలు నిర్వహించబడుతుంటాయి. ఈ ప్రాంతం యెరెవన్‌కు 30 నిముషాల ప్రయాణదూరంలో ఉంది. ఆర్మేనియన్ ఎగువభూములలో సెవెన్ సరసు ఉంది. ఇది సముద్రమట్టానికి అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న సరసులలో ప్రపంచంలో రెండవదిగా (సముద్రమట్టానికి1900 మీ ఎత్తున) ఉంది.

ప్రభుత్వం , రాజకీయాలు

[మార్చు]
The National Assembly in Yerevan.

ఆర్మేనియా రాజకీయాలు అధ్యక్షవిధానం ఆధారితంగా రూపొందించబడ్డాయి. ఇది డెమొక్రటిక్ రిపబ్లిక్. ఆర్మేనియా రాజ్యాంగం అనుసరించి అధ్యక్షుడు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుంటాడు. ఆర్మేనియాలో మల్టీపార్టీ సిస్టం అమలులో ఉంది. దేశంలో 4 రాజకీయ పార్టీలు భాద్వామ్యం వహిస్తున్న యూనికెమరల్ పార్లమెంటు అమలులో ఉంది. అవి వరుసగా కంసర్వేటివ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఆర్మేనియా, ప్రాస్పరస్ ఆర్మేనియా, రూల్ అఫ్ లా (ఆర్మేనియా) పార్టీ, ఆర్మేనియా రివల్యూషన్ ఫెడరేషన్ పార్టీ. రఫీహొవనిసియన్ పార్టీ హెరిటేజ్ (ఆర్మేనియా) పార్టీ ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఉంది. పశ్చిమదేశాల శైలిలో పార్లమెంటరీ విధానం అనుసరించి ప్రభుత్వవిధానాలను రూపొందించాలని ఆర్మేనియా భావిస్తుంది. ఆర్మేనియా పౌరులకు 18 సవత్సరాలకు ఓటుహక్కును కలిగిస్తుంది.

1995 నుండి అంతర్జాతీయ పర్యవేక్షకులైన " కౌంసిల్ ఆఫ్ యూరప్ ", యునైటెడ్ స్టేట్స్ డెవెలెప్మెంటు ఆఫ్ స్టేట్ ఆర్మేనియా పార్లమెంటు, అధ్యక్ష ఎన్నికలు, రాజ్యాంగ వ్యవహారాల నిర్వహణ గురించి ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అంతర్జాతీయ పర్యవేక్షకులు ఎన్నికల నిర్వహణలో లోపాలు, ఎలెక్టోరల్ అఫైర్స్ కమిషన్ సహకార లోపం, ఎన్నికల జాబితా నిర్వహణ, పోలింగ్ ప్రాంతాల నిర్వహణ లోపం వంటి సమస్యలను గుర్తించారు. 2008లో ఫ్రీడం హౌస్ వర్గీకరించిన నివేదిక ఆర్మేనియాను " సెమీకంసాలిడేటెడ్ అథారిటేరియన్ రిజైమ్"గా (ఈ వర్గీకరణలో మొల్దోవ, కొసొవొ, కిర్గిజిస్తాన్ , రష్యాలు ఉన్నాయి) వర్గీకరించింది. అలాగే వర్గీకరించిన 29దేశాలలో ఆర్మేనియా 20వ స్థానంలో ఉంది. [81] [82][83]

[84]

విదేశీ సంబంధాలు

[మార్చు]
Embassy of Armenia in Moscow

ఆర్మేనియా ప్రస్తుతం దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంది. టర్కీ , అజర్‌బైజాన్ దేశాలతో మాత్రం సంఘర్షణలు పరిష్కృతం కాలేదు. సోయియట్ పాలన చివరిదశలో ఆర్మేనియనియన్లు , అజర్‌బైజానియన్లు మద్య సంఘర్షణలు చోటుచేసుకున్నాయి. 1990 లో నగొర్నొ- కారాబాఖ్ యుద్ధం ప్రంతీయ రాజకీయాలలో ఆధిక్యత చేసాయి. [85] ఇరు శతృదేశాల మద్య సరిహద్దు మూసివేయబడింది. " ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో- ఆరరేషన్ ఇన్ ఐరోపా " చేసిన రాజీ ప్రయత్నాలు సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించలేదు.

టర్కీ

[మార్చు]

ఆర్మేనియా 40 కంటే ఆర్గనైజేషంస్‌లో శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది. వీటిలో ఐఖ్యరాజ్యసమితి, ది కౌంసిల్ ఆఫ్ ఐరోపా, ది ఆసియన్ డెవెలెప్మెంటు బ్యాంక్, ది కామంవెల్త్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ ల ఫ్రాంకొఫొనియేలా ఫ్రాంకోఫోనీ ప్రధానమైనవి. కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ , నేటోలో పార్టనర్‌షిప్ ఫర్ పీస్ సభ్యత్వం కూడా కలిగి ఉంది. ఆర్మేనియా టర్కీల మద్య దీర్ఘకాలంగా బలహీన సంబంధాలు ఉన్నాయి. టర్కీ ఆర్మేనియా జెనోసైడ్ గుర్తించడానికి నిరాకరించడం ఇందుకు ప్రధాన కారణం. ఆర్మేనియా రిపబ్లిక్‌ను గుర్తించిన మొదటి దేశాలలో టర్కీ ఒకటి. 20వ శతాబ్దం , 21వ శతాబ్ధ ప్రారంభంలో ఇరుదేశాల మద్య ఘర్షణలు కొనసాగాయి. రెండు దేశాలమద్య దౌత్య సంబంధాలు లేవు. టర్కీ పలుకారణాలతో దౌత్యసంబంధాలను పలుమార్లు నిరాకరించడం అందుకు ప్రధాన కారణం. 1993లో నగొర్నొ- కారాబాఖ్ యుద్ధం సమయంలో టర్కీ చట్టవిరోధంగా ఆర్మేనియా సరిహద్దును మూసివేసింది. టర్కీ వ్యాపారులకు ఆర్మేనియన్ మార్కెట్ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ టర్కీ సరిహద్దును తెరిచిఉంచడానికి అంగీకరించలేదు.[85]

2009 అక్టోబర్ 10 న ఆర్మేనియా , టర్కీ " ప్రొటోకాల్ ఆన్ నార్మలైజేషన్ ఆఫ్ రిలేషన్‌షిప్ " మీద సంతకాలు చేసాయి. సరిహద్దును తిరిగి తెరవడానికి , దౌత్యసంబంధాలను పునరుద్ధరించడానికి ఇరు దేశాలు టైంటేబుల్ ఏర్పాటు చేసాయి.[86]

ధృవీకరణ సమస్య

[మార్చు]

రెండు దేశాల మద్య ఒప్పంద వివరాలు నేషనల్ పార్లమెంట్‌లో ఇరుదేశాలు దృవీకరించాలి. ఆర్మేనియా కాంస్టిట్య్యుషనల్ కోర్టు అనుమతి పొంది పార్లమెంటులో ప్రవేశపెట్టి దృవీకరణ చేసింది. ఆర్మేనియన్ అధ్యక్షుడు ఆర్మేనియా , అంతర్జాతీయ వేదికలలో ప్రకటించాడు. ఆర్మేనియా రాజకీయ నాయకులు టర్కీ కూడా దృవీకరించాలని సూచించాయి. టర్కీ వరుసగా నిబంధనలు షరతులు విధిస్తున్నందున ఒప్పందం అమలు నిలుపబడింది. ఆర్మేనియా రష్యాల మద్య సెక్యూరిటీ సంబంధాలు ఉన్నాయి. ఆర్మేనియా అభ్యర్ధనతో రష్యా ఆర్మేనియన్ లోని గ్యుంరి నగరం వద్ద " రష్యన్ 102వ మిలటరీ బేస్ "ను నిర్వహిస్తుంది. [87] [ఆధారం చూపాలి] సమీపకాలంలో ఆర్మేనియా యూరో - అట్లాంటిక్ సంబధాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాక యునైటెడ్ స్టేట్స్‌తో సత్సంబంధాలు కలిగి ఉంది (ప్రత్యేకంగా ఆర్మేనియన్ డయాస్పోరా ద్వారా). యునైటెడ్ స్టేట్స్ గణాంకాలను అనుసరించి అమెరికాలో 4,27,822 మంది ఆర్మేనియన్లు నివసిస్తున్నారని భావిస్తున్నారు. [88]అజర్‌బైజాన్ , టర్కీ ల దిగ్భంధాల కారణంగా ఆర్మేనియా దక్షిణ సరిహద్దులో ఉన్న ఇరాన్తో స్థిరమైన ఆర్ధికసంబంధాలను అభివృద్ధి చేసింది. ఇరాన్ , ఆర్మేనియాల మద్య గ్యాస్ పైప్ లైన్ అభివృద్ధి చేయబడింది.

Russian President Dmitry Medvedev at Armenian Genocide memorial in Yerevan

ఆర్మేనియా కౌంసిల్ ఆఫ్ ఐరోపా సభ్యత్వం కలిగి ఉంది. అలాగే యురేపియన్ యూనియన్‌తో సత్సంబంధాలు కలిగి ఉంది (ప్రత్యేకంగా ఫ్రాంస్ , గ్రీస్).

2005 సర్వే అనుసరించి 64% ఆర్మేనియన్లు ఐరోపా సంబంధాలకు అనుకూలంగా ఉన్నారని భావిస్తున్నారు.[89] కొంతమంది ఆర్మేనియన్ అధికారులు ఆర్మేనియా యురేపియన్ యూనియన్‌లో శాశ్వసభ్యత్వం కావాలన్న కోరిక వెలిబుచ్చారు.[90] కొంత మంది కొన్నిసంవత్సరాలలో శాశ్వత సంబంధం కోరుతూ అధికారిక బిడ్డింగ్ చేస్తుందని అంటున్నారు. 2004 లో నేటో నాయకత్వంలో కొసొవొలో నిర్వహించబడుతున్న అంతర్జాతీయ సైనిక దళం కొసొవొ ఫోర్స్‌తో కలిసింది. ఇది యురేషియన్ ఎకనమిక్ కమ్యూనిటీ , నాన్- అలైండ్ మూవ్మెంటులలో పర్యవేక్షణ సభ్యత్వం కలిగి ఉంది. [91][92][93][94] ఆర్మేనియా ప్రభుత్వం " కస్టంస్ యూనియన్ ఆఫ్ బెలారస్ (కజకస్తాన్), రష్యా" చేర్చబడింది.[95][96][97] యురేపియన్ యూనియన్ పొరుగు రాజ్యాలను సన్నిహితం చేయడం లక్ష్యంగా ఆర్మేనియన్ యురేపియన్ యూనియన్ " యురేపియన్ నైవర్‌హుడ్ పాలసీ " చేర్చబడింది.

మానవహక్కులు

[మార్చు]

ఆర్మేనియా మానవహక్కులు మిగిలిన " పోస్ట్ సోసియట్ రిపబ్లిక్" ల కంటే మెరుగుగా ఉన్నాయి. అలాగే అంగీకరించతగిన స్థాయికి సమీపంలో ఉంది. (ప్రత్యేకంగా ఆర్థికంగా ). దేశంలో ఇప్పటికీ గణనీయమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆర్మేనియా మానవహక్కులు దాదాపు జార్జియాను పోలి ఉంటుంది. ఫ్రీడం హౌస్ ఆర్మేనియాను " పార్ట్లీ ఫ్రీ దేశంగా " గుర్తించింది.[98]

సైన్యం

[మార్చు]
Armenian Army BTR-80s.
Armenian soldiers at the 2010 Moscow Victory Day Parade.

ఆర్మేనియన్ రిపబ్లిక్‌లో ఆర్మేవియన్ ఆర్మీ, ఆర్మేనియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మేనియన్ ఎయిర్ డెఫెంస్, ఆర్మేనియన్ బార్డర్ గార్డ్ అంతర్భాగంగా ఉన్న 4 సైనికదళాలతో చేరిన సైన్యం ఉంది. సోవియట్ యూనియన్ పతనం తరువాత (1985-1991) రక్షణ మంత్రిత్వశాఖ స్థాపించిన తరువాత 1992 లో ఆర్మేనియన్ సైనికదళం రూపొందించబడింది. అధ్యక్షుడు " ది కమాండర్ - ఇన్ - చీఫ్ " అధికారం కలిగి ఉంటాడు. రాజకీయ నేపథ్యంతో రక్షణ మత్రి నియమించబడతాడు. మిలటరీ కల్నల్ జనరల్ కమాండ్ అధికారం కలిగి ఉంటాడు.

యాక్టివ్ ఫోర్స్‌లో ప్రస్తుతం 81,000 మంది సైనికులు ఉంటారు. అదనంగా రిజర్వ్డ్ మిలటరీ 32,000 మంది ఉంటారు. సరిహద్దు రక్షణ దళం జార్జియా, అజర్‌బైజాన్ సరిహద్దులరక్షణ బాధ్యత వహిస్తుంటారు. రష్యన్ సైనిక బృందాలు ఆర్మేనియా టర్కీ, ఇరాన్ సరిహద్దుల రక్షణ బాధ్యత వహిస్తుంటారు. ఆర్మేనియా శరీరదారుఢ్యం కలిగిన 15-59 మద్య వయస్కులందరినీ సైనికదళ శిక్షణ ఇస్తారు.

1992 జూలైలో అమెరికన్ పార్లమెంటు " ది ట్రీటీ ఆన్ కాంవెంషనల్ ఆర్ండ్ ఫోర్స్ ఇన్ ఐరోపా"లో మిలటరీ ఎక్విప్మెంట్ పరిమితి నిర్ణయించబడింది. 1993 మార్చిలో ఆర్మేనియా " మల్టీలేటరల్ కెమికల్ వెపంస్ కాంవెంషన్ " ఒప్పదం మీద సంతకం చేసింది. రసాయన ఆయుధాల తొలగింపుకు ఇది సహకరిస్తుంది. 1993 లో " నాన్- ప్రొలిఫరేషన్" ఒప్పందానికి ఆర్మేనియా అంగీకారం తెలిపింది.

ఆర్మేనియా " కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్" సభ్యత్వం కలిగి ఉంది. ఇందులో బెలారస్, కజకస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు కూడా సభ్యత్వం కలిగి ఉంది. ఆర్మేనియా నేటో " పార్టనర్‌షిప్ ఫర్ పీస్ ", నేటో " యూరో - అట్లాంటిక్ - పర్టనర్‌షిప్ కౌంసిల్ "లో భాస్వామ్యం వహిస్తుంది. గ్రీక్ ఆధ్వర్యంలో నాన్ - నేటో కొసొవొ ఫోర్స్ " భాగస్వామ్యం వహించింది.[99] ఆర్మేనియా ఇరాక్ యుద్ధం సమయంలో " కోయిలేషన్ ఫోర్స్" 46 మంది సభ్యులను కలిగి ఉంది (2008 అక్టోబరు).[100]

నిర్వహణా విభాగాలు

[మార్చు]
Geghard monastery, Kotayk Province.

ఆర్మేనియా 10 నిర్వహణా విభాగాలుగా (బహువచనం మర్జర్ ఏకవచనం మర్జ్) విభజించబడింది. యెరెవన్ (కఘక్) నగరానికి రాజధాని నగరంగా స్వయం పతిపత్తి ఉంది. విభాల నిర్వహణాధికారిని మర్జ్‌పెట్ (మర్జ్ గవర్నర్) అంటారు. వీరిని ఆర్మేనియన్ ప్రభుత్వం నియమిస్తుంది. యెరెవన్ నిర్వహణాధికారిని మేయర్ అంటారు. మేయర్‌ను అధ్యక్షుడు నియమిస్తాడు. ఒక్కొక ప్రాంతంలో " ఆర్మేనియా మునిసిపాలిటీలు " (హమయంక్నర్ ఏకవచనం హమయంక్) ఉంటాయి. ఒక్కొక కమ్యూనిటీ స్వయంగా పాలన కలిగి ఉంది. ఒక్కొక కమ్యూనిటీలో పలు సెటిల్మెంట్లు (బ్నాకవయ్రర్ ఏకవచనం బ్నకవర్య్) ఉంటాయి. సెటిల్మెంట్లను పట్టణాలు (కఘక్నర్ ఏకవచనం కఘక్), గ్రామాలుగా (గ్యుఘర్ ఏకవచనం గ్యుఘ్) వర్గీకరిస్తారు. 2007 గణాంకాలను అనుసరించి 915 కమ్యూనిటీలలో 49 నగరాలు, 866 గ్రామీణ ప్రాంతాలు ఉన్నయని అంచనా. రాజధాని యెరెవన్ కూడా కమ్యూనిటీ అంతస్తు కలిగి ఉంది. [101] అదనంగా యెరెవన్ 12 స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాలుగా విభజించబడింది.

ప్రాంతం రాజధాని ప్రాంతం (చ.కి.మీ) జనసంఖ్య †
అగ్రాట్సన్ Արագածոտն అష్తరక్ Աշտարակ 2,756 132,925
అరాత్ ప్రాంతం Արարատ అర్తాషత్ (ఆర్మేనియా) Արտաշատ 2,090 260,367
అర్మవిర్ ప్రాంతం Արմավիր అర్మవీర్ (ఆర్మేనియా) Արմավիր 1,242 265,770
జెఘర్కునిక్ ప్రాంతం    Գեղարքունիք   గవర్ Գավառ 5,349 235,075
కోతక్ ప్రాంతం Կոտայք హ్రజ్దన్ Հրազդան 2,086 254,397
లోరి ప్రాంతం Լոռի వనద్జర్ Վանաձոր 3,799 235,537
షిరక్ ప్రాంతం Շիրակ గియుంర్ Գյումրի 2,680 251,941
సియునిక్ ప్రాంతం Սյունիք కపన్ Կապան 4,506 141,771
తవుష్ Տավուշ ఇజ్వన్ Իջևան 2,704 128,609
వయొత్స్ ద్జర్ Վայոց Ձոր యఘెగ్నద్జర్    Եղեգնաձոր   2,308 52,324
యెరెవన్ Երևան 223 1,060,138

† 2011 గణాంకాలు
ఆధారాలు:

ప్రాంతం, జనసంఖ్యా ప్రాంతాలు:

[102]

ఆర్ధికరంగం

[మార్చు]

ఆర్మేనియా ఆర్థికరంగం అధికంగా విదేశలలో పనిచేస్తున్న ఉద్యోగుల మద్దతు, పెట్టుబడుల మీద ఆధారపడిఉంది. [103] స్వతంత్రానికి ముందు ఆర్మేనియా ఆర్థికరంగం అయధికగా పారిశ్రామిక (రసాయన), ఎలెక్ట్రానిక్స్, మెషినరీ, ఆహార తయారీ, కృత్రిమ రబ్బర్, వస్త్రాల తయారీ ఆధారితంగా ఉండేది. రిపబ్లిక్ ఆధునిక ఇండస్ట్రియల్ సెక్టర్, మెషిన్ టూల్స్ సరఫరా, వస్త్రాలు, ఇతర వస్తువుల తయారీ మీద ఆధారపడి ఉంది. [40] సమీపకాలంలో " ది ఇంటెల్ కార్పొరేషన్ " ఆర్మేనియాలో పరిశోధనా కేంద్రం ప్రారంభించడానికి అంగీకరించింది. ఆర్మేనియాలో టెక్నాలజీ పరిశ్రమల అభివృద్ధి కొరకు ఇతర టెక్నికల్ సంస్థలు సంతకం చేసాయి.[104]

వ్యవసాయం

[మార్చు]

1991లో సోవియట్ యూనియన్ పతనం కావడానికి ముందు వ్యవసాయ ఉత్పత్తి, ఉపాధి కల్పన కొరకు ఆర్మేనియా వ్యవసాయరంగం 20% కంటే తక్కువగా సహకరిస్తుంది. స్వతంత్రం తరువాత ఆర్మేనియాలో వ్యవసాయానికి ప్రాధాన్యత అధికం చేయబడింది. 1990 నాటికి అభివృద్ధి ప్రయత్నాలు ఫలించి వ్యవసాయరంగం జి.డి.పి.లో 30% కంటే అధికం అయింది. అలాగే మొత్తం ఉపాధికల్పనలో 40% వ్యవసాయరంగం నుండి లభిస్తుంది.[105] అభివృద్ధి చెందిన వ్యవసాయరంగం ఆర్మేనియాకు ఆహారబధ్రత ఇచ్చింది. వ్యవసాయేతర సంస్థల పతనం తరువాత ఆర్థికరంగం 1990 ఆరంభంలో అస్థిరతను ఎదుర్కొన్నది. తరువాత ఆర్థికరంగం స్థిరపరచబడిన తరువాత అభివృద్ధి తిరుగి పునరుద్ధరించబడింది.[106]

గనులు

[మార్చు]
Yerevan is the economic and cultural centre of Armenia

ఆర్మేనియన్ గనుల నుండి జింక్, బంగారం, లీడ్ (సత్తు) లభిస్తుంది. రష్యా నుండి దిగుమతి చేయబడుతున్న ఫ్యూయల్, సహజవాయువు, న్యూక్లియర్ ఫ్యూయల్ (అణువిద్యుత్ ఉత్పత్తి కొరకు) నుండి విస్తారంగా విద్యుత్తు ఉత్పత్తి చేయబడ్తుంది. జవిద్యుత్తు దేశ విద్యుత్తు అవసరాలకు అధికంగా సహకరిస్తుంది. బొగ్గు, గ్యాస్, పెట్రోలియం నిక్షేపాలు స్వల్పంగా ఉన్నప్పటికీ అభివృద్ధి చేయబడ లేదు.

ఆర్ధిక సమస్యలు

[మార్చు]

స్వతంత్రం లభించిన తరువాత ఆర్మేనియా ఆర్థికరగం సోవియట్ వ్యాపార సంబంధాలు నిలుపుదల కారణంగా దెబ్బతిన్నది. ఆర్మేనియాలో పరిశ్రమరంగంలో సోవియట్ పెట్టుబడులు కనుమరుగయ్యాయి. 1988 ఆర్మేనియన్ భూకంపం సృష్టించిన విధ్వంసం 25,000 మంది ప్రాణాలను బలిగొని, 5.00,000 మందిని నిరాశ్రయులను చేసింది.నొగొర్నొ- కారాబఖ్ విషయంలో అజర్‌బైజాన్‌తో కలహాలు అపరిష్కృతంగా నిలిచాయి. అజర్‌బైజాన్, టర్కీ సరిహద్దులను మూసివేయడం ఆర్థికరంగానికి అధిఖభారంగా మారింది. ఫలితంగా ఆర్మేనియా విద్యుత్తు, ఇతర ముడిసరుకు కొరకు విదేశాల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఎదురైంది. జార్జియా, ఇరాన్ మీదుగా భూమార్గాలు తగినంతగా అభివృద్ధి చేయబడ లేదు. 1989 - 1993 మద్య కాలంలో జి.డి.పి 60% పతనం అయింది.[105]

ఆర్ధికసంస్కరణలు

[మార్చు]

The national currency, the dram, suffered hyperinflation for the first years after its introduction in 1993. ఆర్మేనియా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. సంస్కరణల ఫలితంగా ధ్రవ్యోభణం తగ్గి స్థిరమైన అభివృద్ధి సాధ్యం అయింది. 1994 నొగొర్నొ - కారాబాఖ్ సంఘర్షణలో శాతి ప్రయత్నాలు ఫలించిన కారణంగా ఆర్థికరం పునరుద్ధరించబడింది. 1995 నాటికి ఆర్మేనియా ఆర్థికరంగం అభివృద్ధి చెందింది. ప్రెసీషియస్ స్టోన్ ప్రొసెసింగ్, ఆభరణ తయారీ, సమాచర, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాలు ఆర్థికాభివృద్ధికి సహకరించాయి. పర్యాటక రంగంతో పలు అనుబంధిత రంగాలు అభివృద్ధి చేయబడ్డాయి. వ్యవసాయరంగం కూడా అభివృద్ధి చేయబడింది.

New buildings in the district in Ajapnyak District

ఆర్ధికాభివృద్ధి

[మార్చు]

ఆర్మేనియా సాధించిన స్థిరమైన ఆర్థికాభివృద్ధికి అంతర్జాతీయ సంస్థల మద్దతు తోడైంది. ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, యురేపియన్ బ్యాంక్ ఆఫ్ రీకంస్ట్రక్షన్ అండ్ డెవెలెప్మెంటు, గ్లోబల్ ఫైనాంషియల్ ఇంస్టిట్యూషనల్, విదేశాలు గణనీయంగా ఆర్థికసహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. 1993 నుండి ఆర్మేనియా ఋణాలు 1.1 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఈ ౠణాలు బడ్జెట్ లోటును భర్తీ చేసేయడం, కరెంసీ మార్కెట్ స్థిరపచడం లక్ష్యంగా ఉపయోగించబడ్డాయి. ప్రైవేట్ వ్యాపారం అభివృద్ధి, విద్యుత్తు, వ్యవసాయం, ఆహార తయారీ, రవాణా, ఆరోగ్యం, విద్య రంగాలు అభివృద్ధి చేయబడ్డాయి. భూకంపం బాధితులకు పునరావాసం కల్పించబడింది. 2003 ఫిబ్రవరి 5న ఆర్మేనియా ప్రభుత్వం " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ "లో చేరింది. అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల నుండి లభిస్తున్న విదేశీమారకం ఆర్ధికరంగానికి సహకరిస్తుంది. అది ఇఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలకు , ఇతర ప్రాజెక్టులకు వినియోగించబడుతుంది. దెమొక్రటిక్ దేశంగా ఆర్మేనియా పశ్చిమదేశాల నుండి అధికంగా ఆర్ధిక సహాయం అందగలదని భావిస్తుంది.

స్వేచ్ఛావిఫణి

[మార్చు]

విదేశీ పెట్టుబడులకు స్వాతంత్రం అంగీకరిస్తూ 1994లో చట్టం రూపొఇందించబడింది. 1997 లో ప్రైవేటీకరణ చట్టం రూపొందించబడింది. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ అంగీకరించబడింది. స్థిరమైన ఆర్ధికాభివృద్ధి మైక్రోఎకనమిక్ మేనేజ్మెంటుకు సహకరించింది. రెవెన్యూ వసూలు, పెట్టుబడుల వాతావరణంలో అభివృద్ధి , లంచగొండితనానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆర్ధికాభివృద్ధికి సహకారం అందించింది. అయినప్పటికీ ఇప్పటికీ 15%గా ఉన్న నిరోద్యసమస్య ప్రధాన సమస్యగా భావించబడుతుంది. కారాబాఖ్ నుండి శరణార్ధుల ప్రవాహం నిరుద్యోగ సమస్యను అధికరిస్తుంది. 2010 " యునైటెడ్ నేషంస్ డెవెలెప్మెంటు ప్రోగ్రాం " హ్యూమన్ డెవెలెప్మెంటు ఇండెక్స్‌లో ఆర్మేనియా 78వ స్థానంలో ఉంది. సౌత్ సౌకాసస్ రిపలిక్కులలో ఇది చివరి స్థానం.[107] 2007లో ట్రాంస్పరెంసీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షంస్ ఇండెక్స్‌లోని 179 దేశాలలో ఆర్మేనియా 99వ స్థానంలో ఉంది.[108] 2008 ఇండెక్స్ ఎలనమీ ఫ్రీడం జాబితాలో ఆర్మేనియా 28వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రియా, ఫ్రాంస్, పోర్చుగల్, ఇటలీలు ఆర్మేనియాకంటే వెనుక ఉన్నాయి.[72]

గణాంకాలు

[మార్చు]

2008 గణాంకాలను అనుసరించి ఆర్మేనియా జనసంఖ్య 32,38,000.[109] సోవియట్ రిపబ్లిక్‌లలో జనసాంధ్రత అధికంగా కలిగిన దేశాలలో ఆర్మేనియా ద్వితీయస్థానంలో ఉంది. సోవియట్ యూనియన్ పతనం తరువాత ఆర్మేనియా జనసంఖ్యలో క్షీణత ఆరంభం అయింది.[110] అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా వలసలు తగ్గి క్రమంగా జనసఖ్యలో అభివృద్ధి కొనసగుతూ ఉంది.

విదేశీ ఉపాధి

[మార్చు]
The Armenian population in the world

ఆర్మేనియా దేశస్థులు విదేశాలలో అత్యధికంగా పనిచేస్తున్నారు. 8 మిలియన్ల ఆర్మేనియన్ ప్రజలు విదేశాలలో పనిచేస్తున్నారని అంచనా. ఆర్మేనియన్ ప్రజలు ప్రంపంచం అంతటా విస్తరించి ఉన్నారు. ఆర్మేనియన్లు అత్యధికంగా రష్యా, ఫ్రాంస్, ఇరాన్, అమెరికా, జార్జియా,సిరియా, లెబనాన్,అర్జెంటీనా,ఆస్ట్రేలియా,కెనడా,గ్రీస్,సైప్రస్,ఇజ్రాయేల్,పోలాండ్,ఉక్రెయిన్, బ్రెజిల్ దేశాలలో ఉన్నారు. 40,000 నుండి 70,000 ఆర్మేనియన్లు ఇప్పటికీ టర్కీలో (అత్యధికంగా ఇస్తాంబుల్)లో నివసిస్తున్నారు. [111] పురాతన నగరం జెరుసలేంలోని ఆర్మేనియన్ క్వార్టర్‌లో 1,000 మంది నివసిస్తున్నారు. వీరు ఒకప్పుడు అత్యధికసంఖ్యలో నివసిస్తున్న సమూహంలో వివిధ ప్రాంతాలకు వలసవెళ్ళిన తరువాత మిగిలిన ప్రజలుగా భావిస్తున్నారు.[112] ఇటలీలో శాన్ లజ్జారో డెగి ఆర్మేనియని ఉంది. ఇది వెనెటెన్ లాగూన్‌లో ఉన్నద్వీపం . దీని మీద ఆర్మేనియన్ కాథలిక్ సమాజం పూర్తి ఆధీనత కలిగి ఉంది.[113] అదనంగా సుమారుగా 1,39,000 ఆర్మేనియన్లు డెఫాక్టో లోని నగొర్నొ - కారాబాఖ్‌లో నివసిస్తున్నారు.[114]

సంప్రదాయ సమూహాలు

[మార్చు]
Armenian children at the UN Cup Chess Tournament in 2005.

ఆర్మేనియా జనసంఖ్యలో సంప్రదాయ ప్రజలు 97.9% ఉన్నారు. యజ్ది ప్రజలు 1.3%, రష్యన్లు 0.5% ఉన్నారు. ఇతర అల్పసంఖ్యాక ప్రజలలో అస్సిరియన్ ప్రజలు, ఉక్రెనియన్లు, పోనిక్ గ్రీకులు (కౌకాసస్ గ్రీకులు), కుర్దిష్ ప్రజలు, జార్జియన్లు, బెలారసియన్లు ఉన్నారు. దేశంలో వ్లాచస్, మొర్దివింస్, ఒస్సెటియన్లు, ఉది ప్రజలు, టాట్ ప్రజలు, అల్పసంఖ్యలో పోల్స్, కౌకాసస్ జర్మన్లు ఉన్నారు.[115] సోవియట్ కాలంలో అజర్‌బైజాన్ ప్రజలు సంఖ్యాపరంగా రెండవస్థానంలో ఉన్నారు. (1989 నాటికి 2,5% ఉన్నారు).[116] నగొర్నొ- కారాబఖ్ సంఘర్షణ సమయంలో వారందరూ ఆర్మేనియా నుండి అజర్‌బైజాన్‌కు వలస పోయారు. ఆర్మేనియాకు అజర్‌బైజాన్‌నుండి పెద్ద ఎత్తున ఆర్మేనియన్ శరణార్ధులు వచ్చిచేరారు. అందువలన ఆర్మేనియాలో స్థానికుల సంఖ్య అధికంగా ఉంది.

భాషలు

[మార్చు]

ఆర్మేనియాలో ఆర్మేనియన్ భాష మాత్రమే అధికార భాషగా ఉంది. గతంలో సోవియట్ రిపబ్లిక్‌గా ఉన్నందున రష్యాభాష దేశమంటా వాడుకలో ఉంది. రష్యా భాష డీ ఫాక్టో రెండవ భాషగా భావించబడుతుంది. 2013 గణాంకాలను అనుసరించి 95% ఆర్మేనియన్లు రష్యాభాషను మాట్లాడగలరని (24% ధారాళంగా 59% మాధ్యమంగా) భావిస్తున్నారు. 40% ప్రజలు ఆంగ్లం తెలుసని (4% ధారాళంగా 16% మాధ్యమంగా, 20% ఆరంభ పరిచయం) తెలియజేస్తున్నారు. 50% ప్రజలు ఆగ్లం పబ్లిక్ సెకండరిక్ స్కూల్స్‌లో బోధించాలని భావిస్తుండగా 44% మంది రష్యా భాష బోధించాలని భావిస్తున్నారు.[117]

ఆరోగ్యం

[మార్చు]

ఆర్మేనియా ప్రజల ఆయుఃప్రమాణం పురుషులకు 70 సంవత్సరాలు, స్త్రీలకు 76 సంవత్సరాలు.[118] 2004 గణాంకాలను అనుసరించి ఆరోగ్యసంరక్షణా వ్యయం జి.డి.పిలో 5.6% ఉంది.[118] ఈ వ్యయం ప్రైవేటు రంగం నుండి లభిస్తుంది.[118] 2006 గణాంకాలను అనుసరించి ప్రభుత్వం ఆరోగ్యపరిరక్షణ కొరకు వ్యక్తిగతంగా 112 అమెరికన్ డాలర్లు వ్యయం చేస్తున్నారు.[119] గత దశాబ్ధంలో ఆరోగ్య సేవలలో విస్తారమైన అభివృద్ధి కొనసాగుతుంది. అభివృద్ధి కారణంగా ఆరోగ్యసేవలు సులభంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి. అంతేకాక ఆరోగ్యసంరక్షణా శాఖలో ఉపాధి సౌకర్యాలు లభిస్తున్నాయి.[120]

The 7th-century Khor Virap monastery in the shadow of Mount Ararat, the peak on which Noah's Ark is said to have landed during the biblical flood.

ఆర్మేనియా క్రైస్తవమతాన్ని దేశీయమతంగా స్వీకరించిన (సా.శ. 301) మొదటి దేశంగా గుర్తించబడితుంది.[121][122][123][124] ఆర్మేనియాలో క్రైస్తవమతం పురాతన కాలం నుండి ఆధిక్యత వహిస్తుంది. మొదటి శతాబ్దంలో " ఆర్మేనియన్ అపోస్టిల్ చర్చి " స్థాపించబడింది. ఆర్మేనియన్ చర్చిని ట్వెల్వ్ అపోస్టిల్ - జ్యూడ్ ది అపోస్టిల్, భర్తోలోమ్యూ ది అపోస్టిల్ చర్చిలు నిర్మించాయని భావిస్తున్నారు. ఇవి సా.శ. 40-60 లలో నిర్మించబడ్డాయని భావిస్తున్నారు. ఆర్మేనియన్ క్రైస్తవులలో 93% కంటే అధికంగా ఆర్మేనియన్ అపోస్టొలిక్ చర్చికి చెందినవారని భావిస్తున్నారు. చల్సెడోనియన్ క్రిస్టియానిటీ కోపిక్ ఆర్థడాక్స్ చర్చి, సిరియాక్ ఆర్ధడాక్స్ చర్చి కంటే చాలా ఆచారం, సంప్రదాయ వాద క్రైస్తవ శాఖ అని భావిస్తున్నారు.[125] ఆర్మేనియన్ ఎవంజెలికల్ చర్చి ఆర్మేనియన్ ప్రజలకు అభిమానపాత్రమై ఉంది. ఆర్మేనియా అంతటి నుండి వేలాది మంది ప్రజలు ఈ చర్చిని సందర్శిస్తుంటారు. ఇది 1846లో నిర్మించబడిందని భావిస్తున్నారు. అపొస్టోలిక్ చర్చికి అవసరమైన క్లెర్జీలకు శిక్షణ ఇచ్చి నాణ్యమైన క్లెర్జీలను అందించడానికి ది " ఆర్మేనియన్ పాట్రియార్చేట్ ఆఫ్ కంస్టంటినొపుల్ " స్థాపించబడింది. ఆర్మేనియాలోని ఇతర క్రైస్తవ తెగలు నిసెనే క్రీడ్ ఫెయిత్‌ను అనుసరిస్తున్నారు. [126] ఆర్మేనియాలో పురాతనకాలం నుండి నివసిస్తున్న క్రైస్తవ శాఖకు చెందినవారు బాప్తిస్టులు. వీరిని సోవియట్ యూనియన్ అధికారికంగా గుర్తించింది.[127][128] [129] ఆర్మేనియాలో కాథిలిక్ క్రైస్తవులు కూడా ఉన్నారు. వీరిలో లాటిన్ చర్చి, ఆర్మేనియన్ రైట్‌ కాథలిక్ శాఖకు చెందినవారు ఉన్నారు. మెషిటారిస్టులు (మెఖితారిస్టులు) బెనెడిక్టైన్ సన్యాసులు ఉంటారు. ఆర్మేనియన్ కాథలిక్ చర్చి 1712లో మెఖితార్ ఆఫ్ సబెస్టీన్ చేత స్థాపించబడింది. వారు స్కాలర్లీ ప్రచురణల ద్వారా ప్రజలకు సుపరిచితులై ఉన్నారు. వీరు పురాతన ఆర్మేనియన్ వర్షన్లు, గ్రీస్ రచనలు ప్రచురించారు. ఆర్మేనియన్ కాథలిక్ చర్చి శాఖ ప్రధానకార్యాలయం బ్జౌమ్మర్, లెబనాన్లలో ఉంది. రష్యన్ ఆర్థడాక్స్ చర్చికి చెందిన క్రైస్తవులైన రష్యన్ కమ్యూనిటీ మొలోకన్లకు స్వస్థానం ఆర్మేనియా.[130] ఆర్మేనియా పశ్చిమ ప్రాంతంలో యెజిద్ కుర్దులు నివసిస్తున్నారు. వీరు యజ్దిజం అనుసరిస్తున్నారు. యజ్ది కుర్దీలలో కొందరు సున్నీ ఇస్లాం మతానుయాయులుగా ఉన్నారు. [ఆధారం చూపాలి] ఆర్మేనియన్ యూదులు 750 మంది ఆర్మేనియాకు స్వతంత్రం వచ్చిన తరువాత ఇజ్రాయేల్కు వలస పోయారు. ప్రస్తుతం రెండు సినగోగ్‌లు - రాజధాని నగరంలో ఒకటి, సెవన్ నగరాలలో (సెవన్ సరసు) మరొకటీ ఊన్నాయి.

విద్య

[మార్చు]

ఆర్మేనియా చరిత్ర ఆరంభకాలంలో సోషల్ సర్వీస్ సేవారంగంలో తగినంత అభివృద్ధి సాధించలేక పోయింది.[131] ఆర్మేనియన్ సంస్కృతిలో విద్యకు ఉన్న గౌరవం సోషల్ సర్వీస్ సేవారంగంలో వేగవంతమైన మార్పులు సంభవించాయి. ఆరోగ్య, వెల్ఫేర్ సేవలు సోయియట్ పాలనలో అనుసరించిన ప్రణాళికలను అనుసరించాయి.[131]1960 గణాంకాలను అనుసరించి ఆర్మేనియా అక్షరాస్యత 100% ఉంది. [131] సోయియట్ పాలనలో ఆర్మేనియా విద్యావిధానం పూర్తిగా సోవియట్ విధానంలో పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో (మాస్కో) ఉండేది. అధ్యయనా విధానం సమైక్యంగా సోవియట్ విధానాలకు అనుగుణంగా ఉండేఫి.[131] సోవియట్ పాలనలో ఆర్మేనియాలో ప్రాథమిక, మాధ్యమిక విద్య ఉచితంగా అందించబడింది. మాధ్యమిక విద్యవరకు నిర్భంధ విద్యావిధానం అమలులో ఉండేది.[131]

Yerevan State Medical University named after Mkhitar Heratsi

1988-1989 విద్యా సంవత్సరంలో 10,000 మందికి 301 మంది విద్యార్థులు సెంకండరీ విద్యలో ప్రత్యేకత లేక ఉన్నత విద్య కొనసాగించారు. సోవియట్ సరాసరిలో ఇది అత్యల్పం.[131] 1989లో ఆర్మేనియాలో 58% విద్యార్థులు సెకండరీ విద్యను 15 సంవత్సరాల వయసులో పూర్తిచేసారు. 14% విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించారు. [131] 1990-1991 విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలకు 1,307 మంది విద్యార్థులు, సెకండరీ స్కూలుకు 6,08,800 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.[131] స్పెషలైజ్డ్ సెకండరీ విద్యాసంస్థలలో అదనంగా 45,000 విద్యార్థులు, 68,400 విద్యార్థులు విశ్వవిద్యాలయం మొదలైన పోస్ట్ సెకండరీ విద్యాసంస్థలలో ప్రవేశించారు. [131] అదనంగా 35% విద్యార్థులు ప్రీ స్కూలుకు హాజరయ్యారు.[131]

యెరెవన్ విశ్వవిద్యాలయం

[మార్చు]

ఆర్మేనియా అత్యంత పెద్ద విద్యాసంస్థ " యెరెవన్ స్టేట్ యూనివర్శిటీ "లో 18 డిపార్ట్మెంటులు ఉన్నాయి. వీటిలో సోషల్ సర్వీస్, సైంస్ , లా డిపార్ట్మెంటులు ఉన్నాయి. [131] విశ్వవిద్యాలయ విద్యార్ధుల సంఖ్య 10,000 ఉపాధ్యాయుల సంఖ్య 1,300.[131] 1933 నుండి " ది నేషనల్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ " పనిచేయడం ఆరంభం అయింది.[131]

విద్యావిధానంలో మార్పులు

[మార్చు]

1990 లో ఆర్మేనియా సోవియట్ కేంద్రీకరణ , రెజిమెంటల్ విధానాలలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. [131] ఆర్మేనియా ఉన్నత విద్యార్ధులలో 98% ఆర్మేనియన్లు ఉన్నారు. అందువలన ఆర్మేనియన్ సంస్కృతి , సంప్రదాయాల చరిత్రను సిలబస్‌లో చేర్చాడానికి మార్పులు చేయబడ్డాయి.[131] విద్యాసంస్థలలో ఆర్మేనియన్ భాషకు ఆధిఖ్యత కలిగించబడింది. 1991లో రష్యన్ భాషను బోధించే పలు పాఠశాలలు మూదివేయబడ్డాయి. [131] రష్యన్ ఇప్పటికీ దేసమంతటా రెండవ భాషగా బోధించబడుతుంది.[131]

విద్యాసంస్థల విస్తరణ

[మార్చు]

యెరెవన్ స్టేట్ యూనివర్శిటీ విస్తరణ , అభివృద్ధి క్రమంలో పలు ఉన్నత విద్యాసంస్థలు రూపొందించబడ్డాయి. 1930లో మెడికల్ ఇంస్టిట్యూట్ ప్రత్యేకించబడింది. 1980లో యెరెవన్ స్టేట్ మెడికల్ యూనివర్శిటీ సోవియట్ యూనియన్ నుండి ప్రధాన అవార్డును అందుకున్నది. 1995లో వై.ఎస్.ఎం.ఐ. పేరును మార్చి వై.ఎస్.ఎం.యు పేరును నిర్ధారించారు.

Graduates of the MAB program of the Agribusiness Teaching Center

విదేశీవిద్యార్ధులు

[మార్చు]

1957లో విదేశీ విద్యార్ధులు డిపార్ట్మెంటు ఫర్ ఆర్మేనియన్ డయాస్పొరా స్థాపించబడి తరువాత విస్తరించబడింది. తరువాత విదేశీ విద్యార్ధులను చేర్చడం మొదలైంది. ప్రస్తుతం వై.ఎస్.ఎం.యు మెడికల్ సంస్థ అంతర్జాతీయ విద్యార్ధులకు కూడా గమ్యం అయింది. ఇది మెడికల్ సిబ్బందిని ఆర్మేనియాకు మాత్రమే కాక పొరుగున ఉన్న ఇరాన్,సిరియా,లెబనాన్,జార్జియా , ఇతరదేశాల మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. భారత్,నేపాల్,శ్రీలంకఅమెరికా , రష్యా విద్యార్ధులు కూడా అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మెడికల్ విద్యాసంస్థ అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తూ " వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ " ప్రచురణలలో గౌరవనీయమైన స్థానం సంపాదించింది.

ఇతర విద్యాసంస్థలు

[మార్చు]

ఆర్మేనియాలోని ఇతర విద్యాసంస్థలలో " అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్మేనియా ", ది క్యూ.ఎస్.ఐ. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ యెరెవన్‌లు ఉన్నాయి. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్మేనియా గాజ్యుయేట్ ప్రోగ్రాంస్ (గ్రాజ్యుయేట్ విద్య) అభ్యసించబడుతుంది. అందులో బిజినెస్, లా, ఇతర డిగ్రీ కోర్సులు బోధించబడుతున్నాయి. ఆర్మేనియా ప్రభుత్వం, యునైటెడ్ స్టేట్స్ ఏజెంసీ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలెప్మెంట్, యూనివర్శిటీ ఆఫ్ కలిఫోర్నియా సమైక్య కృషితో ఆర్మేనియా విద్యాసంస్థలు పనిచేయగలుగుతున్నాయి.[132]

సంస్కృతి

[మార్చు]

ఆర్మేనియా వారి ప్రత్యేక అక్షరమాలను, ఆర్మేనియన్ భాష కలిగి ఉంది. ఆర్మేనియన్ అక్షరమాల సా.శ. 405లో మెస్రాప్ మష్తోస్ చేత రూపొందించబడింది. ఇందులో 39 అక్షరాలు ఉంటాయి. సిలిసియా పాలనా సమయంలో మూడు అక్షరాలు అదనంగా చేర్చబడ్డాయి. ఆర్మేనియా లోని 96% ప్రజలకు ఆర్మేనియా వాడుకభాషగా ఉంది. రష్యన్ భాష 75.8% ప్రజలకు పరిచిత భాషగా ఉంది. ఆంగ్లభాకు ఆదరణ అధికం ఔతూ ఉంది.

సంగీతం , నృత్యం

[మార్చు]
Djivan Gasparyan (left), Sirusho (middle) and Charles Aznavour (right) are among most popular musicians of Armenia.

ఆర్మేనియా సంగీతం స్థానిక, జానపద సంగీతాల కలయికగా ఉంటుంది. దుదక్ సంగీతాన్ని ప్రఖ్యాత గాయకుడు ద్జీవన్ గాస్పర్యన్ చేత చక్కగా అందించబడుతుంది. అలాగే లైట్ పాప్, విస్తారమైన క్రైస్తవ సంగీతం ప్రజలకు అందుబాటులో ఉంది.

దుదక్, ధోల్, జుర్నా, కనున్ మొదలైన సంగీత పరికరాలు ఆర్మేనియా జానపద సంగీతంలో కనిపిస్తుంటాయి. సయత్ నోవా వంటి సంగీత కళాకారులు ఆర్మేనియన్ జానపద సంగీతాన్ని అభివృద్ధి చేసి ప్రఖ్యాతిగాంచారు. ఆర్మేనియన్ సంగీత పురాతన రీతులలో ఆర్మేనియన్ చాంట్ ఒకటి. ఇది ఆర్మేనియాలో సాఫ్హారణ మతసంబంధిత సంగీతరూపం. పురాతనమైన ఈ చాంట్ సంగీతం క్రైస్తవ మతానికి ముందు ప్రచారంలో ఉండేది. మిగిలినవి ఆధునికమైనవి. వీటిలో ఆర్మేనియన్ అక్షరమాల రూపకర్త సెయింట్ మెస్రోప్ మష్తోట్స్ సంగీతం కూర్చిన పాటలు ఉన్నాయి. సోవియట్ పాలనలో ఆర్ం ఖత్చతురియన్ (వైవిధ్యమైన బాలెట్, సబ్రే నృత్యం, గయానే బాలెట్ రూపకల్పనకు) తన సంగీతంతో అంతర్జాతీయ ఖ్యాతిగడించాడు.

Traditional Armenian dance

ఆర్మేనియన్ జెనెసైడ్ దేశవ్యాప్తంగా వలసలకు కారణం అయింది. అది ఆర్మేనియన్లు ప్రంపంచంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడాడానికి దారితీసింది. ఆర్మేనియన్లు వారి సంప్రదాయాన్ని సంరక్షించుకొనడం కారణంగా వలసలపోయిన ప్రాంతాలలో ఆర్మేనియన్ సంగీతం ప్రాబల్యత సంతరించుకుంది. జెనొసైడ్ తరువాతి కాలంలో యునైటెడ్ స్టేట్స్ లోని ఆర్మేనియన్ కమ్యూనిటీ కెట్ శైలి ఆర్మేనియన్ నృత్యానికి ఆర్మేనియన్, మిడి ఈస్ట్ సంగీతపరికరాలు, కొన్ని పశ్చిమ ప్రాంత సంగీత పరికరాలను ఉపయోగిస్తూ ప్రాబల్యత తీసుకువచ్చారు. ఈ శైలి ద్వారా జానపద సంగీతం, పశ్చిమ దేశాల నృత్యం సంరక్షించబడ్డాయి. పలు కళాకారులు తమకు పరిచితమైన, గతంలో నివసించిన టర్కీ, ఇతర మద్య ఆసియా సంగీత నృత్యాలను ప్రచారం చేసారు. సంప్రదాయ కెట్ శైలిలో రిచర్డ్ హాగోపియన్ కీర్తి గడించాడు. తమ స్వంత శైలిలో కెట్ సంగీతం రూపొందించి వోస్బికియన్ బాండ్ 1940-1950 లలో ప్రాబల్యత కలిగి ఉన్నారు. ఇందులో ఆసమయంలో ప్రాబల్యత కలిగిన అమెరికన్ బిగ్ బాండ్ జాజ్ కూడా కలిసి ఉండేది. తరువాత కాంటినెంటల్ యురేపియన్ పాప్ సంగీత ప్రభావంతో మద్య తూర్పు ఆర్మేనియన్ వలసపౌరులు 1960-1970 లలో ప్రాబల్యత సంతరించుకున్నారు. వీరిలో అదిస్ హర్మండియన్, హరౌట్ పంబౌక్జియన్ మొదలైన ఆర్మేనియన్ కళాకారులు ఉన్నారు. సిరుషో ఆర్మేనియన్ జానపద సంగీతానికి పాప్ సంగీతాన్ని జోడించి ప్రదర్శనలిచ్చాడు.అంతర్జాతీయ సంగీత కళాకారులుగా కీర్తి గడించిన ఆర్మేనియన్ వలసపౌరులలో ఫ్రెంచ్ ఆర్మేనియన్ వలసపౌరుడు చార్లెస్ అజ్నవోర్ గాయకుడు సంగీత రూపకర్తగా కీర్తిపొందాడు. పియానో కళాకారుడు సహాన్ అర్జ్రుని, ప్రబల ఒపేరా కళాకారుడు హస్మిక్ పాపియన్, సమీపకాలంలో ఇసాబెల్, అన్నాకసియన్ వంటి ఆర్మేనియన్ వలసపౌరులు అంతర్జాతీయ సంగీతప్రపంచంలో ఖ్యాతి గడించారు. కొతమంది ఆర్మేనియన్లు హెవీ మెటల్ బాండ్ " సిస్టం ఆఫ్ డాన్, పాప్ సంగీత కళాకారుడు చెర్ నాన్- ఆర్మేనియన్ సంగీతంలో గుర్తింపు పొందారు. ఆర్మేనియన్ వలసపౌరులైన యువకులలో ఆర్మేనియన్ రివల్యూషనరీ పాటలు ప్రాబల్యత సంతరించుకున్నాయి. ఈ పాటలు ఆర్మేనియన్ దేశభక్తిని ప్రేరేపించాయి. ఈ పాటలలో ఆర్మేయన్ చరిత్ర , నాయకుల గురించిన గాథలు చోటుచేసుకుని ఉంటాయి.

కళలు

[మార్చు]
Ancient Armenian Khachkars (cross-stones)

రిపబ్లిక్ క్వేర్ సమీపంలోని యెరెవన్ వర్నిసేజ్ (కళలు , హస్థకళల మార్కెట్)లో వారాంతపు రోజులలు , బుధవారంలో వందలాది వ్యాపారులు వైవిధ్యమైన హస్థకళా వస్తువులను విక్రయిస్తుంటారు (అందువలన మిగిలిన రోజులలో వస్తువులు తక్కువగా ఉంటాయి). మార్కెట్లో కొయ్యచెక్కడాలు, పురాతన వస్తువులు, ఫైన్ లేస్ , చేతితో అల్లిన ఉన్ని తివాచీలు , కిలిమ్లు(కౌకాసియన్ ప్రత్యేకత) విక్రయించబడుతుంటాయి. ప్రాంతీయంగా తయారు చేయబడిన ఒబ్సియన్ అనబడే ఆభరణాలు , అలంకరణ వస్తువులు కూడా ఈ మార్కెట్లో లభిస్తాయి. ఆర్మేనియన్ కంసలి పని దీర్ఘమైన చరిత్ర కలిగి ఉంది. ప్రత్యేకమైన ఈ ఆభరణాలు మార్కెట్‌లో ఒక మూలలో విక్రయించబడుతుంటాయి. సోవియట్ అవశేషాలు , సావనీర్లు (సమీపకాల రష్యన్ తయారీలు)గడియారాలు, బొమ్మలు, ఎనామిల్ బాక్సులు , ఇతర వస్తువులు వర్నిసేజ్‌లో లభిస్తుంటాయి.

Queen Zabel’s Return to the Palace, Vardges Sureniants, (1909).

ప్రబలమైన కళావస్తు విక్రయశాలలలో ఒకటైన ఒపేరా వారంతాలలో హౌస్‌ సిటీ పార్క్ వద్ద కళాఖండాలను విక్రైస్తుంది. దీర్ఘమైన ఆర్మేనియా చరిత్ర సంబంధిత మనోహరమైన పలు పురాతన సందర్శనా ప్రాంతాలు ఆర్మేనియాలో ఉన్నాయి. మద్య యుగం, ఇనుప యుగం, కంచు యుగం , రాతి యుగాలకు చెందిన పలు ప్రాంతాలు నగరానికి కొన్ని గంటల ప్రయాణదూరంలో ఉన్నాయి. చర్చీలు , కోటలు వాటి సహజస్థితిలో సందర్శకులను అనుమతిస్తున్నాయి. అయినప్పటికీ పలు పురతన సుందర ప్రాంతాలు పరిశోధనలకు అందక ఇప్పటికీ మరుగున ఉన్నాయి.

యెరెవన్‌లోని " ది నేషనల్ ఆర్ట్ గ్యాలరీ " లో మద్యయుగానికి చెందిన 16,000 కళావస్తువులు ఉన్నాయి. ఇవి ఆర్మేనియన్ కాలానికి చెందిన సుసంపన్నమైన గాథలు వివరిస్తున్నాయి. అందులో యూరప్ సంప్రదాయ సమూహాలకు చెందిన పలు వర్ణచిత్రాలు (అమూల్యమైన కళాఖండాలు) ఉన్నాయి. " ది మోడర్న్ ఆర్ట్ మ్యూజియం ", ది చిల్డ్రెన్ పిక్చర్ గ్యాలరీ , మార్టిరోస్ సర్యన్ మ్యూజియంలలో ఇతర ప్రముఖ కళావస్తువులు ఉన్నాయి. అంతేకాక పలు ప్రైవేట్ గ్యాలరీలు ఇంకా ఉనికిలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం సరికొత్తగా ఆరంభించపడుతూ ఉన్నాయి. ఇవి కళావస్తువుల ప్రదర్శనతో విక్రయాలు కూడా సాగిస్తుంటాయి. 2013 ఏప్రెల్ 13 న ఆర్మేనియన్ ప్రభుత్వం " ఫ్రీడం ఆఫ్ పనోరమా ఫర్ 3ది వర్క్ ఆఫ్ ఆర్ట్ "కు అనుమతి ఇస్తూ చట్టసవరణ చేసింది.[133]

క్రీడ

[మార్చు]
Tsaghkadzor Olympic Sports complex
The Armenia national football team in Dublin, Ireland

ఆర్మేనియాలో పలు క్రీడలు ఆడబడుతున్నాయి. వీటిలో అత్యధిక ప్రజాదరణ కలిగిన క్రీడ మల్లయుద్ధం, వెయిట్ లిఫ్టింగ్, జూడో, అసోసియేషన్ ఫుట్ బాల్, బాక్సింగ్ క్రీడలు ప్రధానమైనవి. పర్వతమయమైన ఆర్మేనియా భూభాగం స్కీయింగ్, పర్వతారోహణ వంటి క్రీడలకు అవకాశం కల్పిస్తుంది. భూబంధిత దేశంగా వాటర్ స్పోర్ట్స్ సరసులలో మాత్రమే అభ్యసించబడుతున్నాయి (ప్రత్యేకంగా సెవన్ సరసులో). ఆర్మేనియా క్రీడాకారులు చదరంగం, వెయిట్‌లిఫ్టింగ్, మల్లయుద్ధం మొదలైన క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చూపుతున్నారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కమ్యూనిటీలో ఆర్మేనియా సభ్యత్వం కలిగి ఉంది. యురేపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌, ఇంటర్నేషనల్ ఐస్ హాకీలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది. పాన్- ఆర్మేనియా క్రీడలకు ఆర్మేనియా ఆతిథ్యం ఇచ్చింది.

ఒలింపిక్ క్రీడలు

[మార్చు]

1992లో ఆర్మేనియా ఒలింపిక్స్ క్రీడలలో సోవియట్ యూనియన్ తరఫున పాల్గొన్నది. సోవియట్ యూనియన్‌లో భాగంగా ఆర్మేనియా విజయవంతంగా ఉంది. అనేక పతకాలను సాధించి పలు సందర్భాలలో ఆర్మేనియా సోవియట్ యూనియన్ విజయాలకు సహకారం అందించింది. ఆర్మేనియా మొదటి ఒలింపిక్ పతకాన్ని హ్రంత్ షహిన్యన్ సాధించాడు. హెలెంస్కీలో జరిగిన 1952 సమ్మర్ ఒలింపిక్స్‌లో హ్రంత్ షహిన్యన్ జిమ్నాస్టిక్స్‌లో 2 బంగారు పతకాలు, 2 రజిత పతకాలు సాధించాడు.[134] బార్సిలోనాలో 1992 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఆర్మేనియా మొదటిసారిగా పాల్గొన్నది. ఆర్మేనియా ఈ క్రీడలలో మూడు బంగారు పతకాలు, ఒక రజితపతకం సాధించి విజయవంతంగా నిలిచింది. ఈ పతకాలను మల్లయుద్ధం, వెయిట్ లిఫ్టింగ్, షార్ప్ షూటింగ్‌లలో సాధించింది. ఈ పూటీలో ఆర్మేనియా తరఫున 5 మంది క్రీడాకారులు పాల్గొని మూడు పతకాలు సాధించడం మరొక ప్రత్యేకత. లిల్లెహమ్మర్‌లో జరిగిన 1992 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఆర్మేనియా స్వతంత్రదేశంగా పాల్గొన్నది. ఆర్మేనియా సమ్మర్ ఒలింపిక్స్‌లో ముష్టి యుద్ధం (బాక్సింగ్), మల్లయుద్ధం (రెస్ట్లింగ్), వెయిట్ లిఫ్టింగ్, జూడో, జిమ్నాస్టిక్స్, ట్రాక్, ఫీల్డ్, డైవింగ్, స్విమ్మింగ్, షార్ప్ షూటింగ్ మొదలైన క్రీడలలో పాల్గొన్నది. ఆర్మేనియా వింటర్ ఒలింపిక్ క్రీడలలో ఆల్ఫైన్ స్కీయింగ్, క్రాస్- కౌంట్రీ స్కీయింగ్, ఫిగర్ స్కేటింగ్ క్రీడలలో పాల్గొన్నది.

ఫుట్ బాల్

[మార్చు]
World number 2 Chess Champion Levon Aronian

ఆర్మేనియాలో ఫుట్ బాల్ క్రీడకు అత్యంత ఆదరణ ఉంది. 1970 లో ఎఫ్.సి. అరారత్ యెరెవన్ టీం అత్యంత విజయవంతమైన టీంగా ఉంది. ఇది 1973, 1975 ల, సోవియట్ టాప్ లిగ్‌లలో విజయం సాధించింది. తరువాత యురేపియన్ కప్ 1974-75 సాధించింది. 1992లో ఆర్మేనియా నేషనల్ ఫుట్ బాల్ టీం రూపొందించే వరకు ఆర్మేనియా సోవియట్ యూనియన్ తరఫున ఫుట్ బాల్ క్రీడలలో పాల్గొన్నది. ఆర్మేనియా మేజర్ టోర్నమెంటుకు ఎప్పుడూ అర్హత సాధించలేదు. సమీపకాల సాధనలు ఆర్మేనియాను అంతర్జాతీయంగా ఎఫ్.ఐ.ఎఫ్.ఎ వరల్డ్ ర్యాకింగ్ 44వ స్థానంలో (2011 సెప్టెంబరు) నిలిపింది. నేషనల్ టీం " ఫుట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్మేనియా " ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ది ఆర్మేనియన్ ప్రీమియర్ లీగ్ ఆర్మేనియాలో ఉన్నత స్థాయి ఫుట్ బాల్ టీంగా గుర్తించబడుతుంది. సమీపకాలంలో దీని మీద ఎఫ్.సి. పియునిక్ ఆధిక్యత సాధిస్తుంది. లీగ్ లో ప్రస్తుతం 8 టీంలు ఉన్నాయి.

ఆర్మేనియా విదేశీవాస క్రీడాకారులు

[మార్చు]

ఆర్మేనియా, ఆర్మేనియన్ విదేశీవాస క్రీడాకారులు పలు విజయవంతమైన ఫుట్ క్రీడాకారులను అందించాయి.వీరిలో యొయూరి ద్జొర్కాఫ్, అలియన్ బొఘొస్సియన్, ఆంధ్రనిక్ ఎస్కందరియన్, ఆంధ్రనిక్ తెమౌర్యన్, ఎద్గర్ మనుచరియన్, నికిత సిమొన్యన్ వంటి ప్రబల క్రీడాకారులు ఉన్నారు. ద్జొకాఫ్, బొఘొస్సియన్ 1988 ఎఫ్.ఐ,ఎఫ్.ఎ. వరల్డ్ కప్ క్రీడలలో ఫ్రాంస్ నేషనల్ ఫుట్ బాల్ టీం మీద విజయం సాధించారు. ఆంధ్రనిక్ తెమైరియన్ 2006 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ క్రీడలలో ఇరాన్ నేషనల్ ఫుట్ బాల్ టీం తరఫున పాల్గొన్నాడు, ఎద్గర్ మనుచరియన్ డచ్ తరఫున పాల్గొన్నాడు, ఎరెదివైసి ఎ.ఎఫ్.సి అజాక్స్ తరఫున పాల్గొన్నాడు.

మల్లయుద్ధం

[మార్చు]

మల్లయుద్ధం ఒలింపిక్స్ ఆర్మేనియాలో విజయవంతమైన క్రీడగా ఉంది. అట్లాంటాలో జరిగిన ఆర్మేనియా సమ్మర్ ఒలింపిక్స్ 1996 క్రీడలలో మెంస్ గ్రీకో- రోమన్ రెస్టింగ్ పోటీలో ఆర్మేనియన్ నజర్యన్ బంగారుపతకం సాధించాడు. అలాగే మెంస్ ఫ్రీ స్ట్రైల్ రెస్టిలింగ్ పోటీలో ఆర్మేనియన్ మెక్ర్‌చ్యన్ రజత పతకం సాధించాడు. సంప్రదాయ ఆర్మేనియా మల్లయుద్ధాన్ని " కొఖ్" అంటారు. ఇది సంప్రదాయ " గార్బ్" అభ్యసించబడుతుంది. సోవియట్ కంబాట్ స్పోర్ట్ " శాంబో " (మార్షల్ ఆర్ట్)లో ప్రాబల్యత కలిగిన క్రీడలలో కోఖ్ ఒకటి. ఆర్మేనియాలో ఇది అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ.[135] ఆర్మేనియా బడ్జెట్‌లో క్రీడలకు వార్షికంగా 2.8 అమెరికన్ డాలర్లు ప్రతిపాదించబడుతుంది. ప్రభుత్వ నిధులు " నేషనల్ కమిటీ ఆఫ్ ఫినికల్ ఎజ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ "కు అందించబడుతున్నాయి.[136]

క్రీడలలో శిక్షణ

[మార్చు]

అంతర్జాతీయ స్థాయిలో విజయాలు కొరవడుతున్న కారణంగా సమీప సంవత్సరాలలో ఆర్మేనియా తిరిగి పాఠశాలలలో సోవియట్ కాలంనాటి 16 క్రీడలకు శిక్షణ ఇస్తుంది. అలాగే 1.9 మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో వారికి సరికొత్త ఉపకరణాలు అందిస్తుంది. ప్రాంతీయ పాఠశాలల పునర్నిర్మాణానికి ఆర్మేనియా ప్రభుత్వం నధిసహాయం అందిస్తుంది.రిసార్ట్ పట్టణం త్సాఘ్‌కద్జర్‌లో సమీపకాల వింటర్ స్పోర్ట్స్‌లో ఆర్మేనియా క్రీడాకారులు లేకపోవడం కారణంగా వింటర్ స్పోర్ట్స్ ఇంఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కొరకు 9.3 మిలియన్ డాలర్లు వ్యయం చేయబడ్డాయి. అంతర్జాతీయ ఆర్మేనియన్ సైక్లిస్టులను తయారుచేసే లక్ష్యంతో యెరెవన్ లో 2005 సైక్లింగ్ కేంద్రం ప్రారంభించబడింది. ఒలింపిక్ సైకిల్ పోటీలో బంగారు పతకం సాధించే క్రీడాకారునికి 700,000 అమెరికన్ డాలర్ల బహుమతి అందించబడుతుందని ఆర్మేనియా ప్రభుత్వం ప్రకటించింది.[136] ఆర్మేనియా చదరంగ క్రీడలో చాలా విజయవంతంగా ఉంది. " 2011 వరల్డ్ టీం చెస్ చాంపియన్ షిప్ "లో ఆర్మేనియా విజయం సాధించింది. అలాగే " వరల్డ్ చెస్ ఒలింపియాడ్ "లో మూడుసార్లు విజయం సాధించింది. [137]

ఆహారసంస్కృతి

[మార్చు]
Armenian cuisine

ఆర్మేనియన్ ఆహారవిధానం పురాతనమైనది. ఇది వైధ్యమైన రుచులు , సువాసనల మిశ్రితం. ఆహారం తరచుగా వైవిధ్యమైన సువాసన కలిగి ఉంటుంది. ఇది తూర్పు ప్రాంతం , మధ్యధరా ఆహారవిధానానికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది. ఆహారంలో వైవిధ్యమైన సుగంధద్రవ్యాలు, కూరగాయలు, చేపలు , పండ్లు చోటుచేసుకుంటాయి. ఆర్మేనియన్ ఆహారంలో కారం కంటే నాణ్యమైన ఆహారపదార్ధాలు ఉంటాయి. మూలికలు , గోధుమలు ఆహారంలో వివిధరూపాలలో ఉంటాయి. చిక్కుళ్ళు, నట్స్ , పండ్లు ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. పలు ఆకు కూరలను కూడా ఆహారంలో స్టఫ్ చేసి తయారుచేయడం వీరి ఆచారం. అప్రికాట్ జాతీయ ఆహారంగా గుర్తించబడుతుంది.

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Constitution of Armenia, Article 20". president.am.
  2. Asatryan, Garnik; Arakelova, Victoria (Yerevan 2002). The Ethnic Minorities in Armenia. Part of the OSCE. at WebCite (16 April 2010).
  3. Ministry of Culture of Armenia "The ethnic minorities in Armenia. Brief information" Archived 2017-10-10 at the Wayback Machine. As per the most recent census in 2011. "National minority".
  4. "National Assembly of the Republic of Armenia - Official Web Site - parliament.am". www.parliament.am.
  5. Lang, David Marshall. Armenia: Cradle of Civilization. London: Allen and Unwin, 1970, p. 114. ISBN 0-04-956007-7.
  6. Redgate, Anna Elizabeth. The Armenians. Cornwall: Blackwell, 1998, pp. 16–19, 23, 25, 26 (map), 30–32, 38, 43 ISBN 0-631-22037-2.
  7. Redgate, A. E. (2000). The Armenians (Reprint ed.). Oxford: Blackwell. p. 5. ISBN 0-631-22037-2. However, the most easily identifiable ancestors of the later Armenian nation are the Urartians.
  8. Encyclopedia Americana: Ankara to Azusa. Scholastic Library Publishing. 2005. p. 393. It was named for Artaxias, a general of Antiochus the Great, who founded the kingdom of Armenia about 190 B.C.
  9. de Laet, Sigfried J.; Herrmann, Joachim, eds. (1996). History of Humanity: From the seventh century B.C. to the seventh century A.D. (1st ed.). London: Routledge. p. 128. ISBN 978-92-3-102812-0. The ruler of the part known as Greater Armenia, Artaxias (Artashes), the founder of a new dynasty, managed to unite the country...
  10. "The World Fact Book – Armenia". Central Intelligence Agency. Archived from the original on 19 జూలై 2010. Retrieved 3 నవంబరు 2015.
  11. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  12. "Statistical Service of Armenia" (PDF). Armstat. Retrieved 20 February 2014.
  13. "Armenia Population". countrymeters.info.
  14. 14.0 14.1 14.2 14.3 "Report for Selected Countries and Subjects". World Economic Outlook Database, October 2017. Washington, D.C.: International Monetary Fund. 4 October 2017. Retrieved 17 January 2018.
  15. "Gini index". World Bank. Retrieved 12 May 2016.
  16. "Human Development Report 2016" (PDF). United Nations. 2016. Retrieved 28 September 2017.
  17. (Garsoïan, Nina (1997). Hovannisian, R.G. (ed.). Armenian People from Ancient to Modern Times. Palgrave Macmillan. pp. Volume 1, p.81.).
  18. Grousset, René (1947). Histoire de l'Arménie (1984 ed.). Payot. p. 122.. Estimated dates vary from 284 to 314. Garsoïan (op.cit. p.82), following the research of Ananian, favours the latter.
  19. Stringer, Martin D. (2005). A Sociological History of Christian Worship. Cambridge: Cambridge University Press. p. 92. ISBN 0521819555.
  20. "Armenia Facts". National Geographic. Retrieved 12 October 2013.
  21. Smaller nations that have claimed a prior official adoption of Christianity include Osroene, the Silures, and San Marino. See Timeline of official adoptions of Christianity.
  22. 22.0 22.1 22.2 Mary Boyce. Zoroastrians: Their Religious Beliefs and Practices Psychology Press, 2001 ISBN 0415239028 p 84
  23. Charl Wolhuter,Corene de Wet. International Comparative Perspectives on Religion and Education AFRICAN SUN MeDIA, ISBN 1920382372. 1 March 2014 p 31
  24. The republic has separation of church and state
  25. "The Constitution of the Republic of Armenia, Article 8.1". President.am. Archived from the original on 2010-12-20. Retrieved 2015-11-03.
  26. Razmik Panossian, The Armenians: From Kings And Priests to Merchants And Commissars, Columbia University Press (2006), ISBN 978-0-231-13926-7, p. 106.
  27. "Χαλύβοισι πρὸς νότον Ἀρμένιοι ὁμουρέουσι (The Armenians border on the Chalybes to the south)". Chahin, Mark (2001). The Kingdom of Armenia. London: Routledge. pp. fr. 203. ISBN 978-0-7007-1452-0.
  28. Xenophon. Anabasis. pp. IV.v.2–9.
  29. Moses of Chorene,The History of Armenia, Book 1, Ch. 12 (in Russian)
  30. History of Armenia by Father Michael Chamich from B.C. 2247 to the Year of Christ 1780, or 1229 of the Armenian era, Bishop's College Press, Calcutta, 1827, page 19: "[Aram] was the first to raise the Armenian name to any degree of renown; so that contemporary nations... called them the Aramians, or followers of Aram, a name which has been corrupted into Armenians; and the country they inhabited, by universal consent, took the name of Armenia."
  31. "The first leather shoe,". CNN. Archived from the original on 26 సెప్టెంబరు 2010. Retrieved 11 January 2011.
  32. "5,900-year-old women's skirt discovered in Armenian cave". News Armenia. 13 September 2011. Archived from the original on 10 అక్టోబరు 2017. Retrieved 14 September 2011.
  33. "National Geographic: the first wine-making facility". National Geographic. Retrieved 11 January 2011.
  34. Kurkjian, Vahan (1958). History of Armenia (1964 ed.). Michigan: Armenian General Benevolent Union. Retrieved 2009-07-22.
  35. Armenian Soviet Encyclopedia. Yerevan: Armenian Encyclopedia. 1987. pp. v. 12.
  36. Movsisyan, Artak (2000). Sacred Highland: Armenia in the spiritual conception of the Near East. Yerevan.
  37. Kavoukjian, Martiros (1982). The Genesis of Armenian People. Montreal.
  38. Assyria - Ancient History Encyclopedia
  39. Charles W. Hartley, G. Bike Yazicioğlu, Adam T. Smith, ed. (2012). The Archaeology of Power and Politics in Eurasia: Regimes and Revolutions. Cambridge University Press. p. 65. ISBN 9781107016521. ...the unique temple-tomb at Garni, just east of Yerevan - the only Greco-Roman colonnaded building anywhere in the Soviet Union.{{cite book}}: CS1 maint: multiple names: editors list (link)
  40. 40.0 40.1 "The World Factbook: Armenia". CIA. Archived from the original on 2010-07-19. Retrieved 2015-11-03.
  41. Brunner, Borgna (2006). Time Almanac with Information Please 2007. New York: Time Home Entertainment. p. 685. ISBN 978-1-933405-49-0.
  42. Stokes, Jamie, ed. (2008). Encyclopedia of the Peoples of Africa and the Middle East. New York: Infobase Publishing. p. 65. ISBN 978-1-4381-2676-0. Etchmiatzin is located in the west of modern Armenia, close to the border with Turkey, and its fourth-century cathedral is generally regarded as the oldest in the world.
  43. Bauer-Manndorff, Elisabeth (1981). Armenia: Past and Present. Lucerne: Reich Verlag. OCLC 8063377. Etchmiadzin, with the world's oldest cathedral and the seat of the Catholicos, draws tourists from all over the world.
  44. Utudjian, Édouard (1968). Armenian Architecture: 4th to 17th Century. Paris: Editions A. Morancé. p. 7. OCLC 464421. ...the oldest cathedral in Christendom, that of Etchmiadzin, founded in the 4th century.
  45. Donald Rayfield. Edge of Empires: A History of Georgia Reaktion Books, 2013 ISBN 1780230702 p 165
  46. Steven R. Ward. Immortal, Updated Edition: A Military History of Iran and Its Armed Forces Georgetown University Press, 8 jan. 2014 ISBN 1626160325 p 43
  47. "Armenians: Past and Present in the Making of National Identity". Retrieved 30 December 2014.
  48. H. Nahavandi, Y. Bomati, Shah Abbas, empereur de Perse (1587–1629) (Perrin, Paris, 1998)
  49. "Philippe Buache: Retraite Des Dix Mille Tabula conspectum exhibens Regionum omnium quas Cyrus Junior... MDCCLXXX". Raremaps.com. Retrieved 2010-12-30.
  50. "Armenia". Encyclopædia Britannica.
  51. Minahan, James (2010). The complete guide to national symbols and emblems. Santa Barbara, Calif.: Greenwood Press. p. 310. ISBN 0313344973.
  52. Kirakosian, J. S. (1972). Hayastane michazkayin divanakitut'yan ew sovetakan artakin kaghakakanut'yan pastateghterum, 1828–1923 (Armenia in the documents of international diplomacy and Soviet foreign policy, 1828–1923) (in Armenian). Yerevan. pp. 149–358.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  53. Kieser, Hans-Lukas; Schaller, Dominik J. (2002), Der Völkermord an den Armeniern und die Shoah [The Armenian genocide and the Shoah] (in German), Chronos, p. 114, ISBN 3-0340-0561-X{{citation}}: CS1 maint: unrecognized language (link)
  54. Walker, Christopher J. (1980), Armenia: The Survival of A Nation, London: Croom Helm, pp. 200–3
  55. "Extensive bibliography by University of Michigan on the Armenian Genocide". Umd.umich.edu. Archived from the original on 2013-09-17. Retrieved 2010-12-30.
  56. "Council of Europe Parliamentary Assembly Resolution". Armenian genocide.
  57. Ferguson, Niall (2006). The War of the World: Twentieth-Century Conflict and the Descent of the West. New York: Penguin Press. p. 177. ISBN 1-59420-100-5.
  58. Robert Melson, Revolution and Genocide: On the Origins of the Armenian Genocide and the Holocaust, University Of Chicago Press, October 15, 1992, p. 147
  59. Q&A: Armenian genocide dispute. BBC News. 10 July 2008.
  60. "Tsitsernakaberd Memorial Complex". Armenian Genocide Museum-Institute.
  61. Hovannisian, Richard, and Simon Payaslian. Armenian Cilicia. Costa Mesa: Mazda Publishers, Inc., 2008. 483. Print.
  62. Ronald G. Suny, James Nichol, Darrell L. Slider. Armenia, Azerbaijan, and Georgia. Federal Research Division, Library of Congress. 1995. p.17 and following
  63. C. Mouradian, L'Armenie sovietique, pp. 278–9
  64. "Azerbaijan Soviet Socialist Republic". The Great Soviet Encyclopedia (1979).
  65. Eastern Europe, Russia and Central Asia 2004 – Page 74 by Imogen Gladman, Taylor & Francis Group
  66. Notes from Baku: Black January. Rufat Ahmedov. EurasiaNet Human Rights.
  67. "The March Referendum". Archived from the original on 2006-10-15. Retrieved 2008-11-10.
  68. Croissant, Michael P. (1998). The Armenia-Azerbaijan Conflict: Causes and Implications. London: Praeger. ISBN 978-0-275-96241-8.
  69. "The Ties That Divide". Global Heritage Fund. 17 June 2006. Archived from the original on 2008-04-05. Retrieved 2015-11-03.
  70. De Waal, Thomas (2004). Black Garden: Armenia And Azerbaijan Through Peace and War. New York: New York University Press. p. 240. ISBN 978-0-8147-1945-9.
  71. A Conflict That Can Be Resolved in Time: Nagorno-Karabakh Archived 2015-12-08 at the Wayback Machine. International Herald Tribune. 29 November 2003.
  72. 72.0 72.1 "Heritage Index of Economic Freedom". The Heritage Foundation. Archived from the original on 2018-12-24. Retrieved 2015-11-03.
  73. "EU negotiations with Armenia and Georgia on Free Trade Agreements successfully concluded". EPP Group. Archived from the original on 2016-01-20. Retrieved 2015-11-03.
  74. "Armenia will significantly increase its revenues by reinforcing its role of a transit country between Europe, CIS and Middle East". Arka News Agency.
  75. "EUROPE COULD DRAW GAS THROUGH IRAN-ARMENIA PIPELINE". European dialogue. Archived from the original on 2016-02-17. Retrieved 2015-11-03.
  76. "Geographic Characteristic of The Republic of Armenia" (PDF). Marzes of the Republic of Armenia in Figures, 2002–2006. National Statistical Service of the Republic of Armenia. 2007. Retrieved 2009-07-22.
  77. Natasha May Azarian (2007). The Seeds of Memory: Narrative Renditions of the Armenian Genocide Across Generations. ProQuest. p. 96. ISBN 978-0-549-53005-3. Retrieved 28 April 2013. Mount Ararat is considered the 'heart' of historical Armenia as it is Armenian folklore which considers the majestic mountain to be the place where Noah's Arc landed. Armenian businesses, households, and schools almost ubiquitously have at ...
  78. Rouben Paul Adalian (13 May 2010). Historical Dictionary of Armenia. Scarecrow Press. p. 85. ISBN 978-0-8108-7450-3. Retrieved 28 April 2013. Although the mythology associated with the pagan worship of the mountain is now lost to popular belief, Mount Ararat has played a very ...
  79. James Minahan (1998). Miniature empires: a historical dictionary of the newly independent states. Greenwood Publishing Group. pp. 2–3. ISBN 978-0-313-30610-5. Retrieved 28 April 2013. Mount Ararat, the legendary landing place of Noah's Ark, is located in what is now modern Turkey. Situated near the border, the peak is visible from nearly every area of Armenia. Historically, the mountain has been the Armenian people's most ...
  80. "Address by President Serzh Sargsyan to the People of Armenia and the National Assembly on 2 October 2008". President.am. Archived from the original on 22 మే 2012. Retrieved 2010-12-30.
  81. "Nations in Transit 2008" (PDF). Freedom House. Archived from the original (PDF) on 2009-03-25. Retrieved 1 March 2014.
  82. "Nations in Transit 2008: Armenia" (PDF). Freedom House. Archived from the original (PDF) on 2008-08-19. Retrieved 2008-06-26.
  83. "Freedom in the World 2007" (PDF). Freedom House. Archived from the original (PDF) on 2007-02-18. Retrieved 2015-11-07.
  84. Danielyan, Emil (20 February 2008). "Armenian Vote 'Largely Democratic'". ArmeniaLiberty, Radio Free Europe. Archived from the original on 2008-03-06. Retrieved 2008-02-20.
  85. 85.0 85.1 "Nagorno-Karabakh: The Crisis in the Caucasus". Retrieved 2007-04-06.
  86. "Armenia and Turkey sign peace deal - Yahoo! News". Archived from the original on 2009-10-14. Retrieved 2009-10-14.
  87. "Baku and Moscow – 'One Hundred Percent Strategic Partners'". Hetq Online. 27 February 2006. Archived from the original on 1 జూలై 2016. Retrieved 2008-04-20.
  88. "Ancestry Data". U.S. Census Bureau. 2006. Archived from the original on 2008-04-03. Retrieved 2015-11-07. The 2001 Canadian Census Archived 2013-04-09 at the Wayback Machine determined that there are 40,505 persons of Armenian ancestry currently living in Canada. However, these are liable to be low numbers, since people of mixed ancestry, very common in North America tend to be under-counted: the 1990 census US indicates 149,694 people who speak Armenian at home. Archived 2006-08-26 at the Wayback Machine estimates 1 million ethnic Armenians in the US and 100,000 in Canada. The Armenian Church of America makes a similar estimate Archived 2016-03-04 at the Wayback Machine. By all accounts, over half of the Armenians in the United States live in California.
  89. "RFE/RL Caucasus Report". Armenian Ministry of Foreign Affairs. 7 January 2005. Archived from the original on 20 నవంబరు 2010. Retrieved 2009-07-22.
  90. "Interview with RA National Assembly Speaker Artur Baghdasaryan". ArmInfo News Agency. 26 October 2005. Archived from the original on 7 జూన్ 2007. Retrieved 2009-07-22.
  91. "How Armenia Could Approach the European Union" (PDF). Archived from the original (PDF) on 2008-04-28. Retrieved 2013-03-12.
  92. "EUROPA – Press Releases – EU launches negotiations on Association Agreements with Armenia, Azerbaijan and Georgia". Europa (web portal). 15 July 2010. Retrieved 21 September 2011.
  93. "Armenia-EU association agreement may be concluded shortly | Armenia News –". News.am. Archived from the original on 8 అక్టోబరు 2011. Retrieved 21 September 2011.
  94. "3rd PLENARY ROUND OF THE EU-ARMENIA NEGOTIATIONS ON THE ASSOCIATION AGREEMENT". Ec.europa.eu. 2010-12-15. Retrieved 2012-08-28.
  95. "Eurasian Economic Commission". www.eurasiancommission.org. Retrieved 2015-10-13.
  96. "ДОГОВОР О ПРИСОЕДИНЕНИИ РЕСПУБЛИКИ АРМЕНИЯ К ДОГОВОРУ О ЕВРАЗИЙСКОМ ЭКОНОМИЧЕСКОМ СОЮЗЕ ОТ 29 МАЯ 2014 ГОДА (Минск, 10 октября 2014 года)". www.customs-code.ru. Archived from the original on 2014-12-25. Retrieved 2015-10-13.
  97. "Armenia To Join Russian-Led Customs Union". Radio Free Europe/Radio Liberty. 3 September 2013. Retrieved 13 September 2013.
  98. "Armenia | Freedom House". freedomhouse.org. Archived from the original on 2015-09-10. Retrieved 2015-10-13.
  99. "KFOR Contingent: Armenia". Official Web Site of the Kosovo Force. 23 March 2007. Retrieved 2008-10-27.
  100. "Last shift of Armenian peacekeepers in Iraq returns home". Ministry of Defence. 7 October 2008. Archived from the original on 15 మే 2011. Retrieved 2008-10-29.
  101. "Regional Administration Bodies". The Government of the Republic of Armenia. Retrieved 11 September 2008.
  102. Armstat:Provinces, area and population
  103. Demourian, Avet (19 October 2007). "Armenian Eyes, Ears on US Genocide Vote". The Washington Post. Retrieved 2009-07-07.
  104. "Intel center to open in Armenia". Panarmenian.Net. 1990-01-20. Retrieved 2013-03-12.
  105. 105.0 105.1 Z. Lerman and A. Mirzakhanian, Private Agriculture in Armenia, Lexington Books, Lanham, MD, 2001.
  106. Statistical Yearbook 2007, Armenia National Statistical Service, Yerevan
  107. "HDI 2010 Index" (PDF). HDRO (Human Development Report Office) United Nations Development Programme. pp. 1–3. Archived from the original (PDF) on 15 నవంబరు 2011. Retrieved 10 June 2010.
  108. "Corruption Perceptions Index 2007". Archived from the original on 28 ఏప్రిల్ 2008. Retrieved 2008-04-25.
  109. "Statistical Yearbook of Armenia, 2009: Population" (PDF). ArmStat. Retrieved 2010-02-09.
  110. Paul, Amanda. "Armenia's disappearing population". Archived from the original on 27 జూలై 2011. Retrieved 27 July 2011.
  111. Turay, Anna. "Tarihte Ermeniler". Bolsohays:Istanbul Armenians Like many other ethnicities Armenians in India too have played a role historically and had an impact historically. Today however the community has been reduced to about a hundred living in Calcutta. Archived from the original on 9 ఫిబ్రవరి 2008. Retrieved 2007-01-04.
  112. "Jerusalem – The Old City: The Armenian Quarter". Jewish Virtual Library. Archived from the original on 2008-11-21. Retrieved 2009-07-22.
  113. "San Lazzaro degli Armeni – Venice for Visitors". Europeforvisitors.com. Archived from the original on 22 నవంబరు 2010. Retrieved 2010-12-30.
  114. "Population in Nagorno-Karabakh 2007" (PDF). National Statistical Service of Nagorno-Karabakh Republic. Archived from the original (PDF) on 2008-12-17. Retrieved 2015-11-05.
  115. Asatryan, Garnik; Arakelova, Victoria (2002). "The Ethnic Minorities of Armenia". Routledge. {{cite journal}}: Cite journal requires |journal= (help), part of the OSCE
  116. (in Russian) The All-Union Population Census of 1989. Demoscope.ru
  117. "The South Caucasus Between The EU And The Eurasian Union" (PDF). Caucasus Analytical Digest #51-52. Forschungsstelle Osteuropa, Bremen and Center for Security Studies, Zürich. 17 June 2013. pp. 22–23. ISSN 1867-9323. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2013. Retrieved 3 July 2013.
  118. 118.0 118.1 118.2 "Microsoft Word - cjl - ARM_MPSEURO_countryprofile.doc" (PDF). Archived from the original (PDF) on 2009-11-16. Retrieved 2010-01-25.
  119. "Human Development Report 2009 – Armenia". Hdrstats.undp.org. Archived from the original on 2013-07-27. Retrieved 2015-11-05.
  120. Knapp, Caprice; Madden, Vanessa; Fowler-Kerry, Susan (2011). Pediatric palliative care : global perspectives. Dordrecht: Springer. p. 84. ISBN 9400725698.
  121. "Armenia – Which Nation First Adopted Christianity?". Ancienthistory.about.com. 29 October 2009. Archived from the original on 2012-09-18. Retrieved 2010-01-25.
  122. "Visit Armenia, It is Beautiful". Visitarmenia.org. Retrieved 2010-01-25.
  123. "Armenia Information – Welcome to Armenia". Welcomearmenia.com. Archived from the original on 2010-02-06. Retrieved 2015-11-05.
  124. "Blog Archive " Which is the first country to adopt Christianity?". Did You Know it. Archived from the original on 2009-07-19. Retrieved 2010-01-25.
  125. "The Armenian Apostolic Church (World Council of Churches)".
  126. "Armenian Brotherhood Church of Yerevan".
  127. "Armenian Evangelical Christian Baptist". Armbaplife.am. Archived from the original on 2007-08-25. Retrieved 2012-08-28.
  128. "Despite poverty, Baptists prosper in Armenia" (PDF). Biblical Recorder. Baptist State convention of North Carolina. 17 July 2004. Archived from the original (PDF) on 19 నవంబరు 2008. Retrieved 2010-06-28.
  129. "Armenian Presbyterian Church to Commemorate 1700th Anniversary of Christianity in Armenia with Concert and Khachkar Dedication". The Armenian Reporter. 20 October 2001. Archived from the original on 10 మే 2011. Retrieved 2011-05-21.
  130. Lane, Christel (1978). Christian religion in the Soviet Union : a sociological study. Albany: State univ. of New York P. p. 107. ISBN 0873953274.
  131. 131.00 131.01 131.02 131.03 131.04 131.05 131.06 131.07 131.08 131.09 131.10 131.11 131.12 131.13 131.14 131.15 131.16 "About this Collection | Country Studies | Digital Collections | Library of Congress". Library of Congress, Washington, D.C. 20540 USA. Retrieved 2023-02-20.
  132. Nagorno Karabakh and Armenia | One Laptop per Child
  133. "Legislation: National Assembly of RA". Parliament.am. Retrieved 2013-04-26.
  134. "Ambassadors in Sport?: Independent Armenia far below the glory of Soviet times on the pitch, mat – Features". ArmeniaNow.com. Archived from the original on 2007-09-29. Retrieved 2010-01-25.
  135. Green, Thomas A. (2001). Martial arts of the world : en encyclopedia. Santa Barbara, Calif.: ABC-CLIO. p. 718. ISBN 9781576071502.
  136. 136.0 136.1 "Ambassadors in Sport?: Independent Armenia far below the glory of Soviet times on the pitch, mat – Features". ArmeniaNow.com. Archived from the original on 2007-09-29. Retrieved 2012-08-28.
  137. "Chess News – BBC lecture: Armenia, the cleverest nation on earth". ChessBase.com. Retrieved 2010-12-30.