సెర్గై పరజనోవ్ సంగ్రహాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Coordinates: 40°10′44″N 44°30′00″E / 40.178773°N 44.500124°E / 40.178773; 44.500124

సెర్గై పరజనోవ్ సంగ్రహాలయం
Սերգեյ Փարաջանովի թանգարան
Sergei Parajanov in Yerevan.JPG
హ్రజ్డాన్ నది దగ్గరలోని గార్గేపై సెర్గై పరజనోవ్ సంగ్రహాలయం
స్థాపితం1988
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
డైరక్టరుజవెన్ సర్గస్యాన్
సంగ్రహాలయం లోపలి భాగం

సెర్గై పరజనోవ్ సంగ్రహాలయం (అర్మేనియన్:Սերգեյ Փարաջանովի թանգարան), సోవియట్ ఆర్మేనియన్ డైరెక్టరు, కళాకారుడు సెర్గై పరజనోవ్ కు నివాళిగా నిర్మించారు. ఇది ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని ముఖ్యమైన సంగ్రహాలయాలలో ఒకటి.[1] ఇది పరజనోవ్ యొక్క విభిన్న కళాత్మక, సాహిత్య వారసత్వాన్ని సూచిస్తుంది.

చరిత్ర[మార్చు]

ఈ సంగ్రహాలయాన్ని 1988లో పరజనోవ్ యెరెవాన్ కు తరలివచ్చినప్పుడు కనుగొన్నారు. పరజనోవ్ స్వయంగా (యెరెవాన్ లోని డ్జోరగ్యుగ్ ఎథ్నోగ్రాఫిక్ సెంటరు) స్థాలాన్ని సంగ్రహాలయ ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశంగా ఎంచుకున్నాడు. 1988లో సంభవించిన ఆర్మేనియన్ భూకంపం, సామాజిక-ఆర్థిక సమస్యల వలన, ఈ సంగ్రహాలయాన్ని జూన్ 1991లో పరజనోవ్ మరణానంతరం ప్రారంభించారు.

ఈ సంగ్రహాలయం యొక్క వ్యవస్థాపక డైరెక్టరు జవెన్ సర్గస్యాన్. ఈ సంగ్రహాలయం యెరెవాన్ లోని సాంస్కృతిక కేంద్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్న ప్రదర్శనలు, ప్రచురణలు, గౌరవ విందులు ( యెరెవాన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అతిథుల వార్షిక సమావేశాలు). పాలో కోయెల్హో, విమ్ వెండెర్స్, మిఖాయిల్ వర్టనోవ్, టోనినో గుయెర్ర, ఎంరికా ఆంటోనియాని, ఆటమ్ ఎగోయాన్, నికితా మిఖల్కోవ్, వ్లాదిమిర్ పుతిన్, అలెగ్జాండర్ లుకాషెంకొ, యెవ్గెని యెవ్తిషంకో, ఆర్నాల్డ్ రూటెల్, హోల్డింగ్స్ అడాంకుస్, టర్జా హలోనెన్, డొనాల్డ్ నూత్, అనేకమంది ప్రసిద్ధ  చెందిన వ్యక్తులు ఈ మ్యూజియాన్ని సందర్శించారు.

ప్రదర్శన[మార్చు]

ఈ సంగ్రహాలయ భవనం సాంప్రదాయ కాకేసియన్-శైలిలో ఉండి రెండు అంతస్తులలో ఉంటుంది. 1,400 ప్రదర్శనలో కూడిన ఈ సంగ్రహాలయంలో, కోల్లెజ్, అస్సెంబ్లేగ్స్, చిత్రలేఖనాలు, బొమ్మలు, టోపీలు ఉన్నాయి. ఇక్కడ బయట ప్రచురింపబడని నాటకాలను, లిబ్రెట్టోలను, పరజనోవ్ కారాగారంలో ఉన్నప్పుడు రూపొందించిన అనేక కళాఖండాలు ప్రదర్శిస్తారు. ఇక్కడ రెండు పునర్ణిర్మించిన మెమోరియల్ గదులు, నిజమైన పోస్టర్లు, పండుగ బహుమతులు, ఫెడెరికో ఫెలినీ, లిల్యా బ్రిక్, ఆండ్రీ టార్కోవ్స్కీ, మిఖాయిల్ వర్టనోవ్, యూరి నికులిన్ లు సంతకాలు పెట్టిన ఉత్తరాలు, ప్రసిద్ధ సందర్శకులు టోనినో గుయెర్ర, వ్లాదిమిర్ పుతిన్,  "ఎ నైట్ ఎట్ పరగనోవ్ మ్యూజియం" చిత్ర రచయిత రోమన్ బలయాన్ బహుకరించిన బహుమతులు. సంగ్రహాలయంలో పరజనోవ్ యొక్క కళ, వైభవ సూత్రాలు ఉపయోగిస్తారు.[2]

ఈ సంగ్రహాలయంలో దాదాపుగా 50 ప్రదర్శనలు నిర్వహించారు. వాటిలో కన్నెస్, ఏథెన్స్, టోక్యో, మాస్కో, రోమ్, టెహ్రాన్, హాలీవుడ్ మొదలగునవి.

"ఆర్మేనియాను మళ్ళీ కనిపెట్టు" అనే పుస్తకం ప్రకారం, "యెరెవాన్ లోని గొప్ప సంగ్రహాలయం చిన్నది, వ్యక్తిగతమైనది, ఇది సోవియంట్ ఛిత్రనిర్మాత సెర్గై పరజనోవ్ యొక్క గృహం", అని అన్నారు.[3]

మ్యూజియం గురించి వ్యాఖ్యలు[మార్చు]

"సెర్గై పరజనోవ్ సంగ్రహాలయంలో ఏ ప్రపంచమైనా దాగుందా? అతని కళాఖండాల యొక్క సంగ్రహాలయం - అతని గ్రాఫిక్కులు, బొమ్మలు, కలాజులు, ఫోటోలు, 23 ఛిత్రాలు, ప్రపంచానికి తెలియని లిబ్రెట్టోలు, సినిమాలు, థియేటర్లు ఉన్నవి....ఇది నగరానికి ఎంతో గర్వకారణం. నాకు తెలిసి త్వరలో పరజనోవ్ యొక్క రచనలను పుస్తకాలలో ప్రచూరిస్తారు అంతే కాకుండా అటువంటి సంగ్రహాలయం ఉన్నటువంటి నగరం యెరెవాన్ అవుతుంది." అని మిఖైల్ వార్తనోవ్ 1985లో అన్నారు.[4]

సూచనలు[మార్చు]

  1. "Parajanov Museum". Archived from the original on 2016-12-29. Retrieved 2018-07-01.
  2. Parajanov Museum
  3. Rediscovering Armenia: An Archaeological/touristic Gazetteer and Map Set, by Brady Kiesling, Raffi Kojian, 2001, p. 11
  4. Parajanov-Vartanov Institute

బయటి లింకులు[మార్చు]