1025
Jump to navigation
Jump to search
1025 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంవత్సరాలు: | 1022 1023 1024 - 1025 - 1026 1027 1028 |
దశాబ్దాలు: | 1000లు 1010లు - 1020లు - 1030లు 1040లు |
శతాబ్దాలు: | 10 వ శతాబ్దం - 11 వ శతాబ్దం - 12 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 8: సుల్తాన్ మహ్మద్ ఘజనీ సోమనాథ్ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
- ఏప్రిల్ 18: పోలండు మొదటి రాజుగా బోలెస్లావ్-I గద్దెనెక్కాడు. తన పట్టాభిషేకానికి పోప్ జాన్ XIX నుండి అనుమతి పొందాడు; కానీ, జూన్ 17 న చనిపోయాడు
- డిసెంబరు 15: బైజాంటైన్ చక్రవర్తి బాసిల్ II, 50 యేళ్ళ పరిపాలన తరువాత కాన్‌స్టంటినోపుల్‌లో మరణించాడు. అతడు పెళ్ళి చేసుకోలేదు. అతడి తరువాత అతడి సోదరుడు కాన్‌స్టంటైన్ VIII బైజాఅంటైన్ చక్రవర్తి అయ్యాడు.
- డిసెంబరు 25: బోలెస్లావ్-I కుమారుడు మీజ్కోII లాంబెర్ట్ పోలండుకు రాజుగా ఆర్చిబిషప్ హిప్పోలిటస్ అభిషేకం చేసాడు.
- సుమత్రా లోని శ్రీవిజయ అనే బౌద్ధ రాజ్యంపై మొదటి రాజేంద్ర చోళుడు దాడి చేసాడు. ఆగ్నేయాసియాలో వాణిజ్య హక్కుల విషయంలో వచ్చిన వివాదమే ఈ దాడికి కారణం. ఈ దాడిని శ్రీవిజయ రాజ్యం తట్తుకుంది గానీ దాని ప్రాముఖ్యత తగ్గిపోయింది.
జననాలు
[మార్చు]- అన్నా దలాసెనే బైజాంటైన్ రాణి, రాజప్రతినిధి
- జాన్ ఇటాలస్, బైజాంటైన్ తత్వవేత్త (మ. 1090)
మరణాలు
[మార్చు]- జూన్ 17: బోలెస్లావ్ I, పోలండు రాజు (జ. 967)
- డిసెంబరు 15: బైజాంటైన్ చక్రవర్తి బాసిల్ II (జ. 958)