2013 కుంభమేళా తొక్కిసలాట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2013 కుంభమేళా తొక్కిసలాట
తేదీ10 ఫిబ్రవరి 2013 (2013-02-10)
ప్రదేశంఅలహాబాదు, ఉత్తరప్రదేశ్, భారతదేశము
మరణాలు36
గాయపడినవారు39

2013 కుంభమేళా తొక్కిసలాట ఫిబ్రవరి 10 2013 న అలహాబాదులో జరిగిన కుంభమేళా సందర్భంగా జరిగింది. అలహాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 36 మంది మరణించారు. 39 మంది గాయపడ్డారు.[1]

నేపథ్యం

[మార్చు]
త్రివేణీ సంగమంలో భక్తులు తమ మత సంస్కారాలూ చేస్తున్న ప్రదేశం వద్ద కుంభమేళాలో మహా స్నానాలు జరిగే ప్రదేశం

హిందూ మతంలో కుంభమేళా అనేది ప్రతి మూడు సంవత్సరాలకొకసారి జరిగే ముఖ్య మతపరమైన పండుగ. 2013 లో జరిగిన కుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకొకసారి వచ్చే విశిష్ట పండుగగా గుర్తించబడింది. 55 రోజులుగా కొనసాగుతున్న ఈ కుంభమేళాకు సుమారు 100 మిలియన్ల యాత్రికలు వస్తారని అంచనా వేయబడింది. ఈ కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుండి కూడా అధిక సంఖ్యలో యాత్రికులు వస్తూంటారు. ఈ యాత్రికుల జన సంఖ్య ఒక ఏధెన్స్ నగరంలోని ప్రజల కన్నా ఎక్కువగా ఉండి ఒక తాత్కాలిక పట్టణాన్ని తలపిస్తుంది.[2] ఫిబ్రవరి 10 ఆదివారం నాడు అతి ముఖ్యమైన దినం అయినందున 30 మిలియన్ల ప్రజలు అలహాబాదుకు వచ్చి గంగా, యమునా నదుల సంగమం వద్ద స్నానమాచరించుటకు వచ్చారు.[2][3]

తొక్కిసలాట

[మార్చు]

ప్రారంభ నివేదికల ప్రకారం అలహాబాదు రైల్వే స్టేషనులో గల పాద వంతెన కూలిపోవుట వలన తొక్కిసలాట జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రైల్వే స్టేషనులో అధికంగా వస్తున్న ప్రజలను అదుపు చేయడానికి రైల్వే పోలీసులు జరిపిన లాఠీ చార్జిలో యాత్రికుల తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 36 మంది ప్రజలు మరణించారు. వారిలో 26 మంది మహిలలు, 9 మంది పురుషులు, 8 సంవత్సరాల బాలిక ఉన్నారు.[4] సుమారు 39 మంది ప్రజలు గాయపడ్డారు.[1]

అంతకు ముందు రోజు కూడా ముగ్గురు ప్రజలు మరొక తొక్కిసలాటలో మరణించారు.[5]

స్పందనలు

[మార్చు]

ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ బాధితులకు సంతాపం ప్రకటించారు.[6] ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ తొక్కిసలాటపై విచారణకు ఒక కమిటీని నియమించారు.[7] ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి బలరాం యాదవ్ ఒక నెల లోపుగా ఈ తొక్కిసలాటపై విచారన పూర్తి చేస్తామని ప్రకటించారు.[8]

2013 ఫిబ్రవరి 11 న స్వరాజ్ పార్టీ నాయకుడు, ఈ కుంభమేళా యొక్క ఇన్‌చార్జ్ అయిన అజం ఖాన్ ఈ తొక్కిసలాటకు పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారు.[1][9] ఆయన నిజాయితీగా కుంభమేళా కోసం చేసిన కృషికి అభినందిస్తూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన రాజీనామా లేఖను తిరస్కరించారు.

సహాయం

[మార్చు]

తొక్కిసలాట జరిగిన 2 గంటల వరకు వైద్య సహాయం అందలేదని ప్రజలు ఆరోపించారు. భద్రతా బలగాలు రెండు గంటలు ఆలస్యంగా స్టేషన్ వద్దకు చేరుకున్నారనీ, వారు వచ్చిన తర్వాతే శవాలను, గాయపడిన వారినీ ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ భారీగా ఉండడం వల్ల భద్రతా బలగాల రాక ఆలస్యం అయిందని అధికారులు కారణం చెబుతున్నారు. సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చనిపోయినవారికి 5 లక్షలు పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వం కూడా చనిపోయినవారికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష సహాయం ప్రకటించింది.[10]

ఇతర తొక్కిసలాటలు

[మార్చు]

కుంభమేళా పండుగల సందర్భంగా తొక్కిసలాటలు అనేక సందర్భాలలో జరిగాయి. 1954లో జరిగిన కుంభమేళా తొక్కిసలాటలో సుమారు 1000 మంది మరణించారు. 2003 నాశిక్ కుంభమేళాలో 39 మంది మరణించారు. 2010 హరిద్వార్ కుంభమేళాలో 10 మంది మరణించారు..[11]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 "Kumbh Mela chief Azam Khan resigns over stampede". BBC. 2013-02-11. Retrieved 2013-02-12.
 2. 2.0 2.1 "Allahabad stampede kills 36 Kumbh Mela pilgrims". Reuters. 2013-02-11. Archived from the original on 2013-02-12. Retrieved 2013-02-12.
 3. "India's Kumbh Mela festival holds most auspicious day". BBC. 2013-02-11. Retrieved 2013-02-12.
 4. "Police blamed for Kumbh Mela deaths". Bangkok Post. 2013-02-12. Retrieved 2013-02-12.
 5. "Two killed in stampede at Kumbh Mela". NDTV. 2013-02-10. Retrieved 2013-02-12.
 6. "Over 10 people killed in stampede at Allahabad railway station- Uttar Pradesh". IBN Live. 2013-02-10. Archived from the original on 2013-02-13. Retrieved 2013-02-12.
 7. "Stampede at Allahabad Railway station: several feared dead; PM announces help". Hindustan Times. 2013-02-11. Archived from the original on 2013-02-13. Retrieved 2013-02-12.
 8. "Allahabad tragedy Live: No idea why crowds surged, says Rail official". First Post. 2013-02-11. Retrieved 2013-02-12.
 9. "Azam Khan resigns as in charge of Kumbh over Allahabad stampede". Times of India. 2013-02-11. Retrieved 2013-02-12.
 10. కుంభమేళా తొక్కిసలాట, 36 మంది దుర్మరణం -ఫొటోలు
 11. "Why We Shouldn't Be Surprised by the Kumbh Mela Stampede". Wall Street Journal. 2013-02-11. Retrieved 2013-02-12.

ఇతర లింకులు

[మార్చు]