2015 పారిస్ బాంబు దాడులు
2015 పారిస్ బాంబు దాడులు నవంబరు 27, 2015 న ప్యారిస్, దాని ఉత్తర సబర్బన్ ప్రాంతమైన సెయింట్ డెనిస్ లో ఉగ్రవాదులు ప్రణాళికతో జరిపిన వరుస బాంబు పేలుళ్ళు. [1] 21:20 ప్రాంతంలో ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు సెయింట్ డెనిస్ లోని స్టేట్ డి ఫ్రాన్స్ లో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీని తరువాత పలు కెఫేలు, రెస్టారెంట్లు, ప్యారిస్ మధ్య భాగంలోని ఓ సంగీత వేదిక మీద [2] ఆత్మాహుతి దాడులతో బాంబులతో దాడి చేశారు.
ఈ దాడిలో సుమారు 130 మంది [3] మరణించారు. ఇందులో బాటాక్లాన్ థియేటర్లోనే 89 మంది [4]మరణించారు. ఉగ్రవాదులు ఈ థియేటర్లోనే దాక్కుని పోలీసులతో పోరాడారు. మరో 368 మంది గాయపడ్డారు.[5] వీరిలో 80–99 మంది తీవ్రంగా గాయపడ్డారు.[6][7] అధికారులు దాడి చేసిన ఏడు మందిలో ఒకరిని వెంటనే మట్టుబెట్టారు. వెంటనే మిగతా వారికోసం అన్వేషణ మొదలుపెట్టారు.[8] ఈ దాడులు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్సు మీద జరిగిన అత్యంత దారుణమైనవి,[9][10] అంతే కాకుండా 2004 లో మాడ్రిడ్ లో జరిగిన రైలు బాంబు పేలుళ్ళ తరువాత యూరోపియన్ యూనియన్ మీద జరిగిన దాడుల్లో అత్యంత దారుణమైనది.[11] జనవరి 2015 లో చార్లీ హెబ్డో కార్యాలయం మీద దాడి, ప్యారిస్ లోని ఒక యూదుల సూపర్ మార్కెట్ మీద దాడి జరిగిన తరువాత ఫ్రాన్సు జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోంది.[12]
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లీవెంట్ (ISIL) అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు బాధ్యత ప్రకటించుకున్నది. [13] [14] సిరియా, ఇరాక్ దేశాల్లోని ISIL స్థావరాలపై ఫ్రాన్సు చేపట్టిన ఆపరేషన్ చమ్మా కు వ్యతిరేకంగా తాము ఈ దాడులకు పాల్పడ్డట్లు తెలిపింది.[15] [16] ఫ్రాన్సు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఈ దాడులను ISIL తమపై యుద్ధం ప్రకటనకు నాందిగా పేర్కొన్నాడు.[17] [18] [19] ఈ దాడులు ప్రణాళిక సిరియా, బెల్జియం దేశాలలో జరిగిందనీ ఇందుకు కొంతమంది ఫ్రెంచి పౌరుల సహకారం ఉందని పేర్కొన్నాడు. [20] దాడిలో పాల్గొన్న అందరూ సిరియా యుద్ధంలో పాల్గొని యూరోపియన్ యూనియన్ పౌరసత్వం కలిగియున్నవారే. [21] [22] వారిలో కొంతమంది యుద్ధ భాదితుల్లాగా యూరప్ లోకి ప్రవేశించారు.[23] [24]
ఈ దాడులకు ప్రతిస్పందనగా ఫ్రాన్సు ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా దేశంలో మూడు నెలలు అత్యవసర పరిస్థితి విధించింది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదర్శనలు నిషేధించారు. పోలీసులను వారంటు లేకుండా తనిఖీ చేసే వీలు కల్పించారు. అనుమతి లేకుండా ఎవరినైనా గృహనిర్భందం చేసి విచారించే సౌలభ్యాన్ని కల్పించింది. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వెబ్ సైట్లును మూసివేయడానికి అనుమతినిచ్చింది.[25] నవంబరు 15 తేదీన ISIL వ్యతిరేక దాడులకు సంఘీభావంగా అల్ రఖా లోని ISIL స్థావరాలపై ఆపరేషన్ చమ్మాల్ పేరుతో వైమానిక దాడులు నిర్వహించింది.[26] నవంబరు 18 న ఈ దాడులకు సూత్రధారిగా భావిస్తున్న అబ్దుల్ హమీద్ అబూద్ మరో ఇద్దరితో పాటు పోలీసులు సెయింట్ డెనిస్ లో జరిపిన దాడిలో మరణించారు.[27]
మూలాలు
[మార్చు]- ↑ Jason Chow; Nick Kostov (27 November 2015). "France honors victims of Paris terrorist attacks". The Wall Street Journal. Retrieved 21 January 2016.
- ↑ de la Hamaide, Sybille (14 November 2015). "Timeline of Paris attacks according to public prosecutor". Reuters. Archived from the original on 28 ఏప్రిల్ 2020. Retrieved 15 November 2015.
- ↑ "Paris attacks death toll rises to 130". RTE News. 20 November 2015. Retrieved 21 November 2015.
- ↑ "Paris attacks: What we know so far". France 24. 15 November 2015. Retrieved 17 November 2015.
- ↑ M. Marcus (19 November 2015). "Injuries from Paris attacks will take long to heal". CBS. Retrieved 20 November 2015.
- ↑ "Search goes on for missing". BBC News. 16 November 2015. Retrieved 17 November 2015.
- ↑ "Paris attacks: Everything we know on Wednesday evening". The Telegraph. 18 November 2015. Archived from the original on 19 నవంబరు 2015. Retrieved 19 November 2015.
- ↑ Claire Phipps (15 November 2015). "Paris attacker named as Ismaïl Omar Mostefai as investigation continues – live updates". The Guardian. Retrieved 15 November 2015.
- ↑ "Parisians throw open doors in wake of attacks, but Muslims fear repercussions". The Guardian. 14 November 2015. Retrieved 19 November 2015.
- ↑ Syeed, Nafeesa (15 November 2015). "Yes, Parisians are traumatised, but the spirit of resistance still lingers". The Irish Independent. Retrieved 19 November 2015.
- ↑ "Europe's open-border policy may become latest victim of terrorism". The Irish Times. 19 November 2015. Retrieved 19 November 2015.
- ↑ Randolph, Eric; Simon Valmary (13 November 2015). "More than 120 people killed in Paris 'terror' attacks". Yahoo! News. Agence France-Presse. Archived from the original on 14 November 2015. Retrieved 14 November 2015.
- ↑ "ISIS claims responsibility of Paris attacks". CNN. Retrieved 14 November 2015.
- ↑ "L'organisation État islamique revendique les attentats de Paris" (in French). France 24. 14 November 2015. Archived from the original on 14 నవంబరు 2015. Retrieved 3 మే 2016.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Elgot, Jessica; Phipps, Claire; Bucks, Jonathan (14 November 2015). "Paris attacks: Islamic State says killings were response to Syria strikes". The Guardian. Retrieved 14 November 2015.
The group says the killings were in response to airstrikes against its militants in Syria, adding France would remain a "key target".
- ↑ Dalton, Matthew; Varela, Thomas; Landauro, Inti (14 November 2015). "Paris Attacks Were an 'Act of War' by Islamic State, French President François Hollande Says". The Wall Street Journal. Retrieved 14 November 2015.
Islamic State claimed responsibility for the attacks on a social media account, but didn't provide specific information that would allow the claim to be verified. It said that the attacks were retaliation for French airstrikes against the group in Syria and Iraq.
- ↑ "Paris attacks: Hollande blames Islamic State for 'act of war'". BBC News. 14 November 2015. Retrieved 14 November 2015.
- ↑ Nossiter, Adam; Breeden, Aurelien; Bennhold, Katrin (14 November 2015). "Three Teams of Coordinated Attackers Carried Out Assault on Paris, Officials Say; Hollande Blames ISIS". The New York Times. Retrieved 14 November 2015.
- ↑ "Hollande says Paris attacks 'an act of war' by Islamic State". Thomson Reuters Foundation. 14 November 2015. Archived from the original on 14 నవంబరు 2015. Retrieved 14 November 2015.
- ↑ Alicia Parlapiano; Wilson Andrews; Haeyoun Park; Larry Buchanan (17 November 2015). "Finding the Links Among the Paris Attackers". The New York Times. Retrieved 17 November 2015.
- ↑ Traynor, Ian (20 November 2015). "EU ministers order tighter border checks in response to Paris attacks". The Guardian. London. Retrieved 20 November 2015.
- ↑ "Movements of Isis extremist prior to Paris attack raise EU security questions". The Guardian. 19 November 2015. Retrieved 22 March 2016.
- ↑
"Paris attacks: EU in emergency talks on border crackdown". The Guardian. 20 November 2015. Retrieved 22 November 2015.
The French prime minister, Manuel Valls, said some of the killers had taken advantage of Europe's migrant crisis to "slip in" unnoticed.
- ↑
McDonnell, Patrick J; Zavis, Alexandra (19 November 2015). "Suspected Paris attack mastermind's Europe ties facilitated travel from Syria". Los Angeles Times, in the Sacramento Bee. Los Angeles, USA. Retrieved 20 November 2015.
As waves of refugees from Syria converged on Europe this summer, law enforcement authorities feared this scenario: That terrorist operatives would slip in among the multitudes [...] Last week's attacks on France may have validated some of those fears. At least three of the seven known attackers and the suspected ringleader, Abdelhamid Abaaoud [...] are thought to have crossed clandestinely from Syria into Europe.
- ↑ Andrew Griffin (19 November 2015). "France state of emergency declared for three months, allowing authorities to shut down websites and giving police sweeping new powers". The Independent. Retrieved 21 January 2016.
- ↑ Rubin, Alissa. "France Strikes ISIS Targets in Syria in Retaliation for Attacks". The New York Times. Retrieved 16 November 2015.
- ↑ Aurelien Breeden; Kimiko de Freytas-Tamura (19 November 2015). "Chief Suspect in Paris Attacks Died in Raid, France Says". The New York Times. Retrieved 19 November 2015.