2019 పుల్వామా దాడి
Jump to navigation
Jump to search
2019 పుల్వామా దాడి | |
---|---|
ప్రదేశం | లేథిపురా, పుల్వామా జిల్లా, జమ్ము కాశ్మీర్, భారతదేశం |
భౌగోళికాంశాలు | 33°57′53″N 74°57′52″E / 33.96472°N 74.96444°E |
తేదీ | 14 ఫిబ్రవరి 2019 15:15 ఇండియన్ స్టాండర్డ్ టైం (యూటీసీ+05:30) |
లక్ష్యం | సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన రక్షణ దళ సైనికులు |
దాడి రకం | ఆత్మాహుతి దాడి, కారు బాంబు |
మరణాలు | 41 (40 సీఆర్పీఎఫ్ దళ సభ్యులు, 1 ఆత్మాహుతి బాంబర్) |
ప్రాణాపాయ గాయాలు | 35 |
నేరస్తులు | జైష్-ఎ-మహమ్మద్ |
2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)[a] సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్ లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది. దాడిచేసినది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్ అని గుర్తించారు.[2][3][4]
నోట్స్
[మార్చు]- ↑ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వరంలోని పారా మిలటరీ దళాలు అన్నిటిలోకీ అతిపెద్దది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అనిశ్చిత పరిస్థితుల్లో స్థానిక పోలీలసు బలగాలకు మద్దతునివ్వడానికి, తిరుబాట్లను అణచివేయడానికి పనిచేస్తుంది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కు చెందిన రాజేశ్వరీ పిళ్ళై రాజగోపాలన్ ప్రకారం సైనిక బలగాల కన్నా ఈ పారామిలటరీ బలగాలకు శిక్షణ, ఆయుధాలు తక్కువే అందుతాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ Rajeswari Pillai Rajagopalan, New Terror Attack Exposes India’s Limited Options, The Diplomat, 15 February 2019
- ↑ "Pulwama attack: India will 'completely isolate' Pakistan". BBC (in ఇంగ్లీష్). 16 February 2019. Retrieved 16 February 2019.
- ↑ "Jaish terrorists attack CRPF convoy in Kashmir, kill at least 38 personnel". The Times of India. 15 February 2019. Retrieved 15 February 2019.
- ↑ Pulwama Attack 2019, everything about J&K terror attack on CRPF by terrorist Adil Ahmed Dar, Jaish-eMohammad, India Today, 16 February 2019.