2020 కరాక్ ఆలయ దాడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్‌టుంట్వా రాష్ట్రం, కరాక్ జిల్లాలో ఉన్న పురాతన హిందూ దేవాలయాన్ని, పరమహంస మహారాజ్ సమాధిని స్థానిక ముస్లిం అల్లరి మూకలు 2020 డిసెంబరు నెలలో ధ్వంసం చేశాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రం కలకలం సృష్టించింది. అక్కడి హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించారు.

చరిత్ర[మార్చు]

గురు పరంహంస్ దయాళ్ హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు.పరంహంస్ దయాళ్ మరణం అనంతరం 1919 జూలై న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కారక్ జిల్లా పూడ్చిపెట్టారు. భారతదేశం, పాకిస్తాన్ విభజన తరువాత 947లో ఆలయం మూసివేయబడింది.1997లో, ఆలయంపై దాడి జరిగింది కూల్చివేయబడింది. 2015లో, శ్రీ పరమహంస్ జీ మహారాజ్ సమాధి, కృష్ణ ద్వారా ఆలయాన్ని పునరుద్ధరించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది.

గురు పరమహంస్ దయాళ్

దాడి[మార్చు]

2020 డిసెంబరులో దాదాపు 1500 మంది స్థానిక ముస్లింల గుడిని చుట్టుముట్టి, ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు.[1] హిందువులు తమ పూజా స్థలాన్ని విస్తరించాలనుకోవడమే అందుకు కారణం. ఇది నచ్చని స్థానిక ముస్లిముల్లో కొందరు తమ పలుకుబడిని, బలాన్ని ఉపయోగించి హిందువుల మందిరంపై దాడి చేశారు.నిందితులకు జరిమానా విధించడమే కాకుండా హిందువులకు భూమి ఇవ్వాలని కూడా పాక్ చీఫ్ జస్టిస్ ఆదేశించారు. కావాలనుకుంటే తమ పూజా స్థలాన్ని హిందువులు విస్తరించుకోవచ్చని కూడా చెప్పారు. అందుకు అవసరమైన సాయం ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ ప్రభుత్వం నుంచి అందుతుందని కూడా తెలిపారు.[2][3][4]

ప్రతిస్పందన[మార్చు]

పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారీ, మానవ హక్కుల ఫెడరల్ పార్లమెంటరీ సెక్రటరీ లాల్ చంద్ మల్హి, మత వ్యవహారాల మంత్రి నూర్-ఉల్-హక్ ఖాద్రీ ఆలయ దాడిని ఖండించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దాడిని ఖండిస్తూ పాకిస్తాన్‌లో ఎవరైనా మన ముస్లిమేతర పౌరులను లేదా వారి ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని వ్యాఖ్యానించాడు.విదేశీ వ్యవహారాల భారతీయ మంత్రిత్వ ఆలయం దాడి పై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేసారు. తగు చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కోరారు.సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. మైనారిటీలకు పాకిస్తాన్ చాలా సురక్షితమైన ప్రాంతమని మరికొందరు అంటుండగా పాక్‌లో మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారనే వాస్తవాన్ని అంగీకరిస్తూనే పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టీ ముస్లింల సమస్యలను ముందుగా పరిష్కరించి, ఆ తరువాతే మైనారిటీల సమస్యలను పట్టించుకోవాలని ఇంకొందరు వాదిస్తున్నారు.

చట్టపరమైన ప్రతిస్పందన[మార్చు]

స్థానిక మతపెద్ద సహా 26 మందిని అరెస్టు చేశారు తరువాత మరో 45 మందిని అరెస్టు చేశారు. 350 మందికిపైగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.ఎనిమిది మంది పోలీసు అధికారులు సస్పెండ్ చేయబడ్డారు. 2021 జనవరి 5న, ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ సంఘటన తర్వాత, పాకిస్తాన్ సెనేట్‌లో మత మైనారిటీల హక్కుల పరిరక్షణ బిల్లు అనే కొత్త బిల్లును ప్రవేశపెట్టారు కానీ దీనిని తిరస్కరించింది.

పాక్ సుప్రీంకోర్టు తీర్పు[మార్చు]

పాకిస్తాన్ ససుప్రీంకోర్టు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన చోటనే నూతన ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించింది. ఆలయాన్ని ధ్వంస చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ పాక్ సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా. సుప్రీంకోర్టు ఆదేశాలతో వంద మందికి పైగా అల్లరి మూకలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ధ్వంసానికి గురైన పురాతన ఆలయం ఉన్న చోటనే కొత్త ఆలయ నిర్మాణానికి అక్కడి హిందూ సంఘాలు శంకుస్థాపన చేశారు.

నిందితులకు క్షమాభిక్ష[మార్చు]

ఆలయం ధ్వంసానికి సంబంధించి ముస్లిం మత పెద్దలతో హిందూ సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఆలయ ధ్వంసం తప్పేనని ముస్లిం మత పెద్దలు అంగీకరించినట్లు వారు చెప్పారు. ఈ ఘటనపై ముస్లిం మత పెద్దలు క్షమాపణలు చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయ ధ్వంసానికి పాల్పడిన ఘటనలో నిందితులందరినీ క్షమిస్తున్నట్లు హిందూ సంఘాల నేతలు ప్రకటించారు.

మూలాలు[మార్చు]

  1. Imtiaz Ahmad (31 December 2020). "Hindu temple in Pakistan vandalised, set on fire". Hindustan Times. Retrieved 20 January 2021.
  2. "26 Arrested After Hindu Temple Torched By Mob In Pakistan: Report". NDTV. 31 December 2020. Retrieved 20 January 2021.[permanent dead link]
  3. "Pakistan arrests more than a dozen over Hindu temple attack". Aljazeera. 31 December 2020. Retrieved 20 January 2021.
  4. "Senate panel 'turns down' bill on minorities rights". The Tribune. 2 February 2021. Retrieved 2 February 2021.

వెలుపలి లింకులు[మార్చు]