Jump to content

2022 ఆసియా క్రీడలు

వికీపీడియా నుండి
హాంగ్‌జౌలో 19వ ఆసియా క్రీడల సైన్ బోర్డు

2022 ఆసియా క్రీడలు, లేక అధికారికంగా 19వ ఆసియా క్రీడలు 23 సెప్టెంబర్ నుండి 8 అక్టోబర్ 2023 వరకు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా వ్యాప్త బహుళ-క్రీడా ఈవెంట్. దీన్ని హౌజౌన్ 2022 అని కూడా పిలుస్తున్నారు.

వాస్తవానికి 2022 సెప్టెంబర్ 10 నుండి 25 వరకు జరగాల్సి ఉంది, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆటలు 2023కి వాయిదా పడ్డాయి. [1] 2023లో జరిగే తేదీలు 19 జూలై 2022న ప్రకటించబడ్డాయి.[2] 1990లో బీజింగ్, 2010లో గ్వాంగ్‌జౌ తర్వాత ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన మూడో చైనా నగరంగా హాంగ్‌జౌ నిలుస్తోంది. 19వ ఆసియా క్రీడల నినాదం : హార్ట్ టు హార్ట్. 19వ ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాలు పాల్గొన్నాయి. 19వ ఆసియా క్రీడల్లో చైనా 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యం మొత్తం 383 పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది. 188 పథకాలతో జపాన్ రెండో స్థానంలోనూ, 190 పథకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచాయి. భారతదేశం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యలు మొత్తం 107 పథకాలతో నాలుగు స్థానంలో నిలిచింది[3].

బిడ్డింగ్ ప్రక్రియ

[మార్చు]

జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌ నగరం కార్యక్రమం నిర్వహిస్తామని ఒక ప్రతిపాదనను సమర్పించిందని, పాల్గొనడానికి అవసరమైన అన్ని చర్యలను పూర్తి చేసిన ఏకైక నగరం అని చైనీస్ ఒలింపిక్ కమిటీ ధృవీకరించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ 2015 ఆగస్టులో ముగిసింది. తుర్క్‌మెనిస్తాన్‌లోని అష్గాబాత్‌లో 16 సెప్టెంబర్ 2015న జరిగిన 34వ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా జనరల్ అసెంబ్లీలో హాంగ్‌జౌ అధికారికంగా ఆతిథ్య నగరంగా అవార్డు పొందింది.[4]

ఏర్పాట్లు

[మార్చు]

మార్కెటింగ్

[మార్చు]

చిహ్నం

[మార్చు]

2018 ఆగస్టు 6న హాంగ్‌జౌ కల్చర్ రేడియో టెలివిజన్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకలో ఈ క్రీడల చిహ్నం "సర్జింగ్ టైడ్స్" ఆవిష్కరించబడింది; ఇది ఝీజంగ్ సంప్రదాయ చేతి ఫ్యాన్, రన్నింగ్ ట్రాక్, కియాంటాంగ్ నది టైడల్ బోర్, రేడియో తరంగాలను (వైర్‌లెస్ కనెక్టివిటీకి ప్రతీక) పోలి ఉండేలా రూపొందించబడింది. ఈ చిహ్నం "కొత్త యుగంలో ఊపందుకుంటున్న చైనీస్ లక్షణాలతో కూడిన సోషలిజపు ఉన్నతాదర్శాన్ని", "ఒలింపిక్స్ కమిటీ ఆఫ్ ఏషియా యొక్క ఐక్యత, సంఘీభావం, అభివృద్ధిలని" ప్రతిబింబించేలా ఉందని నిర్వహణ కమిటీ పేర్కొంది. [5] [6]

క్రీడలు

[మార్చు]

2022 ఆసియా క్రీడలలో 40 ఆటలలో 61 విభాగాలలో పోటీ నిర్వహించారు.

2022 ఆసియా క్రీడలలో క్రీడా కార్యక్రమాలు[7]

పతకాల పట్టిక

[మార్చు]
ర్యాంకు దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం పతకాలు
1 China చైనా 201 111 71 383
2 Japan జపాన్ 52 62 69 188
3 South Korea దక్షిణ కొరియా 42 59 89 190
4 భారతదేశం భారతదేశం 28 38 40 106
5 ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 22 18 31 71
6 చైనీస్ తైపీచైనీస్ తైపీ 19 20 28 67
7 Iran ఇరాన్ 13 21 20 54
8 థాయిలాండ్ థాయిలాండ్ 12 14 32 58
9 బహ్రెయిన్ బహ్రయిన్ 12 3 5 20
10 ఉత్తర కొరియా ఉత్తర కొరియా 11 18 10 39
11-41 తక్కిన దేశాలు 70 110 235 415
మొత్తం 482 479 630 1591

పాల్గొన్న దేశాలు

[మార్చు]

ఈ క్రీడలలో మొత్తం 45 జాతీయ ఒలింపిక్ కమిటీ (ఎన్ఓసి)లు పాల్గొన్నాయి.

పాల్గొన్న జాతీయ ఒలింపిక్ కమిటీలు

మూలాలు

[మార్చు]
  1. Chakraborty, Amlan (2022-05-06). "Games Hangzhou Asian Games postponed until 2023 over COVID". Reuters (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2022. Retrieved 2023-07-25.
  2. "OCA Press Release: OCA announces new dates for the 19th Asian Games - Hangzhou". Olympic Council of Asia. 19 July 2022. Archived from the original on 23 July 2022. Retrieved 19 July 2022.
  3. "Reasons Behind the 107 Medal Win at 19th Asian Games 2023". IISM Mumbai (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-10-17. Retrieved 2023-11-17.
  4. Butler, Nick (16 September 2015). "Hangzhou confirmed as host of 2022 Asian Games". Inside the Games. Archived from the original on 19 September 2015. Retrieved 16 September 2015.
  5. "Hangzhou Launches 2022 Asian Games Emblem". Infobae. 12 July 2021. Archived from the original on 2 March 2023. Retrieved 2 March 2023.
  6. "Hangzhou 2022 launch official emblem as prepare to succeed Jakarta Palembang 2018 as Asian Games hosts". Inside the Games. 2018-08-07. Archived from the original on 23 December 2019. Retrieved 2022-02-19.
  7. "2022 19th Asian Games General Competition Schedule (Version 1.1)". hangzhou2022.cn. Hangzhou Asian Games Organising Committee. 24 February 2022. Archived from the original on 29 July 2023. Retrieved 29 July 2023.
  8. "Afghanistan Hangzhou 2022 delegation to include 17 women despite Taliban rule". www.insidethegames.biz. 2023-09-22.
  9. "Asian Games 2023 men's football: Results, scores, points table and medal winners - full list".
  10. "Bahrain". Archived from the original on 2 October 2023. Retrieved 30 September 2023.
  11. "Bangladesh's journey at 2023 Asian Games: All you need to know". Dhaka Tribune (in ఇంగ్లీష్). 10 September 2023. Archived from the original on 13 September 2023. Retrieved 11 September 2023.
  12. "Bhutan to send highest-ever contingent to Asian Games". The Bhutan Live (in ఇంగ్లీష్). 25 July 2023. Archived from the original on 5 August 2023. Retrieved 6 August 2023.
  13. "Asian Games 2023: can Hong Kong deliver medals? That is HK$1 million question as city reveals cash bonus for gold". South China Morning Post (in ఇంగ్లీష్). 26 July 2023. Archived from the original on 13 September 2023. Retrieved 6 August 2023.
  14. "NOC Entries - Team INDEPENDENT ATHLETE PARTICIPATING UNDER OCA FLAG". Asian Games 2022. Hangzhou Asian Games Organising Committee. Archived from the original on 1 October 2023. Retrieved 24 September 2023.
  15. "Asian Games in Hangzhou, Indonesia to Send 415 Athletes". Tempo (in ఇంగ్లీష్). 3 September 2023. Archived from the original on 4 September 2023. Retrieved 11 September 2023.
  16. "ثبت‌نام ۲۱۱ ورزشکار مرد و ۷۸ زن در بازی‌های آسیایی". Iranian Students' News Agency (in పర్షియన్). 13 September 2023. Retrieved 13 September 2023.
  17. "杭州アジア大会2022TEAM JAPAN選手団". Japanese Olympic Committee. Retrieved 2023-10-18.
  18. "Jordan participates in the Asian Games "Hangzhou" with 16 sports". 7eNEWS (in ఇంగ్లీష్). 7 August 2023. Archived from the original on 11 August 2023. Retrieved 10 August 2023.
  19. "Head of Cabinet of Ministers sends off Kyrgyz athletes to Asian Games". Kabar.kg. Retrieved 2023-09-15.
  20. "Macau to send 183 athletes to Hangzhou Asian Games". Macau Business (in ఇంగ్లీష్). 12 September 2023. Archived from the original on 13 September 2023. Retrieved 13 September 2023.
  21. "Press Release Malaysian Contingent Bound for the 19th Asian Games Hangzhou 2022". Olympic Council of Malaysia (in ఇంగ్లీష్). 8 August 2023. Archived from the original on 8 August 2023. Retrieved 8 August 2023.
  22. "19th Asian Games Hangzhou 2022 – Courtesy Visit to the Ambassador of China to Malaysia". Olympic Council of Malaysia (in ఇంగ్లీష్). 1 September 2023. Archived from the original on 13 September 2023. Retrieved 3 September 2023.
  23. Berkeley, Geoff (19 September 2023). "Mongolia targeting wrestling medals after naming largest Asian Games delegation". Inside the Games. Retrieved 19 September 2023.
  24. "Nepal to send 253 athletes to take part in Asian Games". Onlinekhabar English. Retrieved 17 September 2023.
  25. 峰云峰雨 (30 July 2023). "杭州亚运会朝鲜军团轮廓正浮出水面,时隔5年重返国际综合性赛事". baidu. Archived from the original on 28 August 2023. Retrieved 28 August 2023.
  26. "Oman gears up for Asian Games in China". Muscat Daily (in ఇంగ్లీష్). 9 September 2023. Archived from the original on 10 September 2023. Retrieved 11 September 2023.
  27. "222 Pakistani athletes set to participate in Asian Games 2023". Geo Super (in ఇంగ్లీష్). 23 July 2023. Archived from the original on 5 August 2023. Retrieved 6 August 2023.
  28. Galvez, Waylon (23 May 2023). "PH to send 400-plus athletes in Asian Games". The Manila Times (in ఇంగ్లీష్). Archived from the original on 13 September 2023. Retrieved 28 July 2023.
  29. "QOC Announces Team Qatar Participation in Hangzhou Asian Games". Qatar Olympic Committee (in ఇంగ్లీష్). 11 September 2023. Archived from the original on 13 September 2023. Retrieved 11 September 2023.
  30. "193 Saudi athletes prepare to compete in 19 sports at Asian Games". Arab News (in ఇంగ్లీష్). 29 August 2023. Archived from the original on 30 August 2023. Retrieved 11 September 2023.
  31. "Team Singapore to field its largest Asian Games contingent in Hangzhou Games". Singapore National Olympic Council (in ఇంగ్లీష్). 5 August 2023. Archived from the original on 5 August 2023. Retrieved 5 August 2023.
  32. Lloyd, Owen (17 September 2023). "South Korea aiming for Hangzhou 2022 medals table podium with record delegation". Inside the games. Retrieved 18 September 2023.
  33. "NOC Entries - Team Sri Lanka". Asian Games 2022. Hangzhou Asian Games Organising Committee. Archived from the original on 1 October 2023. Retrieved 24 September 2023.
  34. "Asian Games 2023 men's football: Results, scores, points table and medal winners - full list".
  35. "140 athletes to represent UAE in 19th Asian Games Hangzhou". Emirates 247 (in ఇంగ్లీష్). 30 August 2023. Archived from the original on 1 September 2023. Retrieved 11 September 2023.
  36. "Vietnam aims for golds in 7 sports at ASIAD 19". Vietnam Plus (in ఇంగ్లీష్). 3 August 2023. Archived from the original on 5 August 2023. Retrieved 6 August 2023.