2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్
2023 ICC Men's Cricket World Cup Qualifier Play-off | |
---|---|
తేదీలు | మార్చి 26 – 5 April 2023 |
నిర్వాహకులు | International Cricket Council |
క్రికెట్ రకం | One Day International |
టోర్నమెంటు ఫార్మాట్లు | Round-robin |
ఆతిథ్యం ఇచ్చేవారు | Namibia |
ఛాంపియన్లు | యు.ఎస్.ఏ |
పాల్గొన్నవారు | 6 |
ఆడిన మ్యాచ్‌లు | 15 |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | Gerhard Erasmus |
అత్యధిక పరుగులు | Asif Khan (296) |
అత్యధిక వికెట్లు | Ali Khan (16) |
2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్ అనేది 2023 క్రికెట్ ప్రపంచ కప్ అర్హత ప్రక్రియలో భాగంగా ఏర్పరచిన క్రికెట్ టోర్నమెంటు.[1][2] ఇది 2023 మార్చి, ఏప్రిల్‌లలో జరిగింది.[3] ఇందులో పాల్గొనే జట్టుకు వన్‌డే హోదా ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ఇందులో జరిగే మ్యాచ్‌లన్నిటికీ వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) హోదా ఉంటుంది.[4] ఫలితంగా, జెర్సీ, వన్‌డే హోదాతో తమ మొట్టమొదటి మ్యాచ్‌లను ఆడింది.[5]
ఆరు జట్లు ఈ టోర్నమెంటుకు అర్హత సాధించాయి. అవి, 2019–2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2లో దిగువన ఉన్న నాలుగు జట్లతో పాటు 2019–2022 ICC క్రికెట్ ప్రపంచ కప్ ఛాలెంజ్ లీగ్‌లోని A, B గ్రూప్‌లలో అగ్రశ్రేణి జట్లు.[6] 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో పాల్గొనే అవకాశం కోసం ఈ టోర్నమెంటు నుండి మొదటి రెండు జట్లు 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌కు చేరుకున్నాయి. మిగిలిన జట్లు అర్హత పొందే అవకాశాలను కోల్పోయాయి.[7]
ఈవెంట్‌లో అంతర్గతంగా జరిగిన మరొక చిన్న ఈవెంట్‌లో, దిగువన ఉన్న రెండు లీగ్ 2 జట్లు (పాపువా న్యూ గినియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), ఛాలెంజ్ లీగ్ విజేతలైన కెనడా, జెర్సీలు లీగ్ 2లో రెండు స్థానాల కోసం, తద్వారా వచ్చేసారికి వన్‌డే హోదా కోసం పోటీ పడ్డాయి.[8] ఫలితంగా కెనడా లీగ్ 2 కి పదోన్నతి పొందగా, పాపువా న్యూ గినియా ది ఛాలెంజ్ లీగ్‌కు దిగజారింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంటు షెడ్యూలును 2023 మార్చి 20 న ప్రకటించింది.[9]
జట్లు, అర్హత
[మార్చు]అర్హత సాధనాలు | తేదీ | వేదిక | బెర్త్‌లు | అర్హత సాధించారు |
---|---|---|---|---|
లీగ్ 2 (దిగువ 4) | ఆగస్టు 2019 - మార్చి 2023 | వివిధ | 4 | నమీబియా పపువా న్యూగినియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యు.ఎస్.ఏ |
ఛాలెంజ్ లీగ్ (ప్రతి సమూహంలో అగ్రస్థానం) | సెప్టెంబర్ 2019 - డిసెంబర్ 2022 | వివిధ | 2 | కెనడా జెర్సీ |
మొత్తం | 6 |
స్క్వాడ్స్
[మార్చు]టోర్నమెంటు కోసం క్రింది స్క్వాడ్‌లను నియమించారు. [10]
కెనడా[11][12] | జెర్సీ[13] | నమీబియా[14] | పపువా న్యూగినియా | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్[15] | యు.ఎస్.ఏ[16] |
---|---|---|---|---|---|
|
|
|
- 2023 ఫిబ్రవరి 9 న, శ్రీలంకలో సన్నాహక పర్యటన కోసం కెనడా తాత్కాలికంగా 16 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది, నమీబియాకు వెళ్లిన తర్వాత జట్టును తగ్గించారు. [17]
- 2023 మార్చి 16 న, యునైటెడ్ స్టేట్స్ వికెట్ కీపర్ సాయిదీప్ గణేష్ బెంగళూరులో శిక్షణా శిబిరంలో గాయం కారణంగా టోర్నమెంటు నుండి వైదొలిగాడు. అతని స్థానంలో సాయితేజ ముక్కమల్ల ఎంపికయ్యాడు. [18]
పాయింట్ల పట్టిక
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ "New qualification pathway for ICC Men's Cricket World Cup approved". International Cricket Council. Retrieved 20 October 2018.
- ↑ "Associates pathway to 2023 World Cup undergoes major revamp". ESPN Cricinfo. Retrieved 20 October 2018.
- ↑ "Men's Cricket World Cup 2023 qualifying matches rescheduled". International Cricket Council. Retrieved 16 December 2020.
- ↑ "Explainer: The path to Cricket World Cup 2023". International Cricket Council. Retrieved 19 March 2023.
- ↑ "Everything you need to know about the Cricket World Cup Qualifier Play-off". International Cricket Council. Retrieved 25 March 2023.
- ↑ "The road to World Cup 2023: how teams can secure qualification, from rank No. 1 to 32". ESPN Cricinfo. Retrieved 14 August 2019.
- ↑ "All to play for in last ever World Cricket League tournament". International Cricket Council. Retrieved 11 April 2019.
- ↑ "Everything you need to know about the Cricket World Cup Qualifier Play-off". International Cricket Council. Retrieved 25 March 2023.
- ↑ "Schedule released for Cricket World Cup Qualifier Playoff". International Cricket Council. Retrieved 20 March 2023.
- ↑ "All the squads for ICC Men's Cricket World Cup Qualifier Playoff". International Cricket Council. Retrieved 21 March 2023.
- ↑ "Canada To Tour Sri Lanka In Preparation For ICC Namibia 2023 World Cup Qualifier!". Cricket Canada. Retrieved 9 February 2023.
- ↑ @canadiancricket (24 March 2023). "Team Canada Squad for @cricketworldcup Qualifier Play-Offs which will start in Namibia on Monday, March 27" (Tweet) – via Twitter.
- ↑ @cricketinjersey (15 March 2023). "Chuggy leads an experienced Mens Squad to the ICC 50 Over World Cup Qualifier Play-off Tournament in Namibia 24 March-5 April" (Tweet) – via Twitter.
- ↑ @CricketNamibia1 (23 March 2023). "ICC Men's Cricket World Cup Qualifier Playoff Namibian squad" (Tweet) – via Twitter.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Team UAE squad named for Men's CWC Qualifier Playoff in Namibia announced". Emirates Cricket Board. Retrieved 21 March 2023.
- ↑ "Team USA Men's squad named for the 2023 ICC CWC Qualifier Playoff". USA Cricket. Retrieved 11 March 2023.
- ↑ "Canada squad leaves for Sri Lanka - Namibia". Cricket Canada. Retrieved 3 March 2023.
- ↑ "Saideep Ganesh ruled out of the 2023 ICC CWC Qualifier Play-off due to injury; Saiteja Mukkamalla named as replacement". USA Cricket. Retrieved 16 March 2023.