అక్షాంశ రేఖాంశాలు: 27°40′01″N 78°24′32″E / 27.667°N 78.409°E / 27.667; 78.409

2024 హాత్‌రస్ విషాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2024 హాత్‌రస్ విషాదం
తేదీ2 జూలై 2024; 3 రోజుల క్రితం (2024-07-02)
ప్రదేశంమొఘల్ గర్హి, హాత్‌రస్ జిల్లా, భారతదేశం
భౌగోళికాంశాలు27°40′01″N 78°24′32″E / 27.667°N 78.409°E / 27.667; 78.409
కారణంతొక్కిసలాట
మరణాలు120+[1]
గాయపడినవారు150+

2024 జూలై 2న, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హాత్‌రస్ జిల్లాలో హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 120 మంది మరణించారు, వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.[1][2][3] కనీసం 150 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చేరారు.[4] మొఘల్ గర్హి గ్రామంలో సత్సంగం సందర్భంగా ఈ ఘటన జరిగింది.[5] 5,000 మంది మాత్రమే పాల్గొనగలిగే ఈ కార్యక్రమానికి 15,000 మందికి పైగా ప్రజలు తరలివచ్చారని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి.[6]

భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్ హరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాడు.[7]

సంఘటన

[మార్చు]

మొఘల్ గర్హి గ్రామంలో భోలే బాబా సత్సంగం అనేది హిందూ దేవుడైన శివునికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం.[5] ఇది ఒక తాత్కాలిక డేరాలో నిర్వహించారు.[8][9] కార్యక్రమం ముగిసిన తర్వాత హాజరైనవారు బయలుదేరుతుండగా ఈ విపత్తు సంభవించింది.[9] సత్సంగాన్ని నారాయణ్ సాకర్ హరి అనే స్థానిక బోధకుడు నిర్వహించాడు. [10] 5,000 మంది మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమానికి 15,000 మందికి పైగా ప్రజలు తరలివచ్చారని ప్రాథమిక నివేదికలు చెప్తున్నాయి.[6] బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకోవడానికి భక్తులు ఒక్కసారిగా పోటీ పడ్డ సమయంలో తొక్కిసలాట జరిగింది.[2][6] ఈ విషాదంలో కొందరు బాధితులు రోడ్డు పక్కన ఉన్న డ్రెయిన్‌లో కూడా పడి ఉంటారని భావిస్తున్నారు.[6][11] సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఎటా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎటా ఆసుపత్రిలో భీతావాహ పరిస్థితిన చూసిన ఒక పోలీసు అధికారి గుండెపోటుతో మరణించాడు.[12]

నష్టపరిహారం

[మార్చు]

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని, గాయపడిన వారికి 50,000 రూపాయలు అందిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించాడు.[13] ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించాడు.[14] ఈ దుర్ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Who is Bhole Baba, during whose 'satsang' 120 people died in a stampede?". The Statesman. 2 July 2024. Retrieved 2 July 2024.
  2. 2.0 2.1 Yasir, Sameer (2 July 2024). "Stampede at Religious Gathering in Northern India Kills at Least 50". The New York Times.
  3. "107 people killed in stampede at religious event in Uttar Pradesh's Hathras". Hindustan Times. Retrieved 2024-07-02.
  4. "Dozens killed during stampede at religious gathering in India". ABC News (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). 2024-07-02. Retrieved 2024-07-02.
  5. 5.0 5.1 Iyer, Aishwarya S. (2024-07-02). "At least 87 people killed in stampede at religious event in India, say local police". CNN (in ఇంగ్లీష్). Retrieved 2024-07-02.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 "Death toll from India stampede rises to at least 97, says official". Al Jazeera (in ఇంగ్లీష్). Retrieved 2024-07-02.
  7. "Stampede: మట్టి రాసిన మరణ శాసనం.. 116 మంది దుర్మరణం". ఈనాడు. Retrieved 2024-07-03.
  8. Bannerjee, Biswajeet (2 July 2024). "A stampede at a religious event in India has killed at least 60 peoplet". Associated Press (in ఇంగ్లీష్). Retrieved 2024-07-02.
  9. 9.0 9.1 Hrishikesh, Sharanya (2 July 2024). "Dozens killed in stampede at India religious event". BBC (in ఇంగ్లీష్). Retrieved 2024-07-02.
  10. "Hathras: Who is Sakar Hari alias Bhole Baba and what led to stampede that killed several in UP?". India TV. Retrieved 2024-07-02.
  11. "Devotees wanted to collect soil from around Bhole Baba's feet': The unfolding of UP's Hathras tragedy". moneycontrol. Retrieved 2024-07-02.
  12. "UP Hathras Stampede: Policeman dies of heart attack after seeing piles of bodies". India TV. Retrieved 2024-07-02.
  13. "107 dead in stampede at religious preacher's congregation in UP's Hathras". Hindustan Times. Retrieved 2024-07-02.
  14. "UP Hathras Stampede Live Updates: At least 50 persons killed during 'satsang', CM Adityanath announces Rs 2 lakh ex gratia for families of deceased". Indian Express. Retrieved 2024-07-02.