Jump to content

27వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
27వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on10-20 జనవరి 1996
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"బ్లష్"

27వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1996 జనవరి 10 నుండి జనవరి 20 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1][2] ఆసియా మహిళా దర్శకులు తీసిన సినిమాలతోనే ఈ ఫెస్టివల్ జరిగింది.[3] మదన్ లాల్ ఖురానా ఈ చిత్రోత్సవ డైరెక్టర్‌గా నియమించబడ్డాడు. సినీ నిర్మాత బిఆర్ చోప్రా చిత్రోత్సవాన్ని ప్రారంభించాడు.[4]

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]

విజేతలు

[మార్చు]
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "లి షాహోంగ్" దర్శకత్వం వహించిన "బ్లష్" సినిమా.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 3 July 2021.
  2. 2.0 2.1 "Power can`t be Neglected in China`s". studylib.net.
  3. 3.0 3.1 "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 2018-01-12. Retrieved 3 July 2021.
  4. Joshua, Anita (11 January 1996). "Fanfare Marks Film Fete Take Off". The Hindu. Archived from the original on 12 May 1997. Retrieved 3 July 2021.
  5. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  6. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  7. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.