34వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
34వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 19 అక్టోబరు 2003 |
Highlights | |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "ఎట్ ఫైవ్ ఇన్ ది ఆఫ్టర్ నూన్" |
Lifetime achievement | "లివ్ ఉల్మాన్" |
34వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2003 అక్టోబరు 9 నుండి 19 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] ఫెస్టివల్ డైరెక్టర్ నీలమ్ కపూర్ ఆధ్వర్యంతో ఆసియా డైరెక్టర్లు తీసిన సినిమాలతోనే ఈ ఫెస్టివల్ జరిగింది.[2] ఈ కార్యక్రమాలనికి నటుడు కమల్ హసన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు.[3][4]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]
విజేతలు
[మార్చు]- జీవన సాఫల్య పురస్కారం: "లివ్ ఉల్మాన్"
- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "సమీరా మఖ్మల్‌బాఫ్" దర్శకత్వం వహించిన "ఎట్ ఫైవ్ ఇన్ ది ఆఫ్టర్ నూన్" (ఇరానియన్ సినిమా)
- మోస్ట్ ప్రామిసింగ్ ఆసియా దర్శకుడికి సిల్వర్ పీకాక్ అవార్డు: "జేమ్స్ జర్నీ టు జెరూసలేం" ఇజ్రాయెల్ సినిమా దర్శకుడు "రానన్ అలెగ్జాండ్రోవిచ్"
- స్పెషల్ జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్: "సుభద్రో చౌదరి" దర్శకత్వం వహించిన "ప్రోహోర్" (బెంగాలీ సినిమా)[8]
మూలాలు
[మార్చు]- ↑ "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 2017-12-23. Retrieved 2021-07-02.
- ↑ "Premieres save the day for IFFI". 14 October 2003. Retrieved 2021-07-02.
- ↑ https://timesofindia.indiatimes.com/india/New-films-to-premiere-at-34th-IFFI/articleshow/222173.cms Deepak Sandhu served as the director for the festival.
- ↑ "...But It's IFFI". Retrieved 2021-07-02.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
- ↑ "Iranian film gets Golden Peacock at IFFI 2003". 19 October 2003. Retrieved 2021-07-02.