స్వేచ్ఛా సాఫ్టువేరు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
సాఫ్టువేరు రెండు రకాల స్థితులలో ఉంటుంది, ఒకటి సోర్స్ కోడ్ కాగా రెండవది బైనరీ . సోర్స్ కోడ్ (మూల రూపకరణాలు) అంటే ప్రోగ్రామర్లు రాసేది, బైనరీ అంటే కంప్యూటర్‌లో ఎక్సిక్యూట్ చేయటానికి ఒకటి సున్నాల రూపంలో ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే స్క్రూలూ నట్లతో ఉన్న బండిని సోర్స్ కోడ్ అంటే, స్క్రూలూ నట్లూ లేకుండా వెల్డింగ్ చేసి యిచ్చిన బండిని బైనరీకి సమానం అనుకోవచ్చు. మనం ఎంత మంచి బండి అయినా సరే స్క్రూలు నట్లు లేనిదయితే కచ్చితంగా కొనము. మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు మనకి అమ్ముతున్నది మాత్రం ఈ రకమైనవే. మనకి మెకానిక్ పని రాకపోయినా, మెకానిక్ వద్దకెళ్ళి రిపెయిర్ చేయించుకుంటాము, సాఫ్ట్వేర్ రంగంలో ఈ రకమైన గుత్తధిపత్యానిని నిరసిస్తూ ‘source code’తో కూడిన సాఫ్టువేరుని అందించినది మాత్రమే స్వేచ్ఛా సాఫ్టువేరు. సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులోకి రావటం మూలంగా దీని అభివృద్ధి వేగంగానూ అత్యంత నాణ్యంగానూ జరిగింది. వైరస్‌లు సైతం సోకలేని సాఫ్టువేరు ఇదంటే దీని నాణ్యతేమిటో మనకర్ధమవుతుంది. స్వేచ్ఛా సాఫ్టువేర్ల తయారీలో ప్రపంచ వ్యాపితంగా రమారమీ 20లక్షల మంది పనిచేస్తున్నారు. ఇది ఒక ఉద్యమంలా సాగుతున్నది. స్వేచ్ఛా సాఫ్టువేరుతో తయారయిన ఆపరేటింగ్ సిస్టాలు సుమారు 5 వందల రకాలు వాడకంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో తెలుగులో తయారయిన ‘స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టం’ కూడా ఈ కోవకు చెందిందే. సోర్స్ కోడ్ అందుబాటులో ఉండటాన ఇది ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదింపబడుతున్నది. మాతృభాషలో విద్యనభ్యసించటంతో ఎన్ని ఉపయోగాలున్నాయో, కంప్యూటర్ విద్యను సైతం మాతృ భాషలో అభ్యసించటంలో అన్ని ఉపయోగాలుంటాయి.
నిర్వచనం, నాలుగు సూత్రాలు
[మార్చు]ఏ సాఫ్టువేరునైనా స్వేచ్ఛా సాఫ్టువేరు అనాలంటే అది నాలుగు సూత్రాలకు నిలబడాలి
- 0. సాఫ్టువేరుని ఏ అవసరానికైనా స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కుండాలి.
- 1. దానిని తమ అవసరాలకనుగుణంగా మలచుకునే అవకాశం ఉండాలి అంటే సోర్స్ కోడ్ ఇచ్చి తీరాలి.
- 2. దానిని అభివృద్ధి చేసి ఇతరులకు రొక్కానికి గాని ఉచితంగా గానీ ఇచ్చే హక్కు ఉండాలి.
- 3. జత చేసిన, మలచిన, అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్నికూడా ఫ్రీసాఫ్ట్ వేర్‌గా ఇవ్వాలి.
లైసెన్సులు
[మార్చు]- The MIT License
- The GNU General Public License v2
- The Apache License
- The GNU General Public License v3
- The BSD License
- The GNU Lesser General Public License
- The Mozilla Public License (MPL)
- The Eclipse Public License
ఇవి కూడా చూడండి
[మార్చు]- స్వేచ్ఛ (సంస్థ): ద్వేచ్ఛా సాఫ్ట్వేరు కోసం పనిచేస్తున్న హైదరాబాదు సంస్థ