Jump to content

జియో (మైక్రోఫార్మాట్)

వికీపీడియా నుండి
(Geo (microformat) నుండి దారిమార్పు చెందింది)

జియో అనేది (X)HTML లో WGS84 భౌగోళిక నిర్దేశాంకాలను (అక్షాంశ, రేఖాంశాలు) గుర్తించడానికి ఉపయోగించే మైక్రోఫార్మాట్. [1] "డ్రాఫ్ట్" స్పెసిఫికేషన్‌గా పేర్కొనబడినప్పటికీ, ఇది విస్తృతంగా వాడుకలో ఉంది; [2] ఇప్పటికే ప్రచురించబడిన hCalendar [3] hCard [4] మైక్రోఫార్మాట్ స్పెసిఫికేషన్‌ల కు ఉప-సమితి లాంటిది కాదు. [3] [4]

జియో మైక్రోఫార్మాటు, వివిధ వెబ్‌సైట్‌లు లేదా ఫైర్‌ఫాక్స్ పొడిగింపు ల లాంటి పార్సింగ్ పరికరాలు భౌగోళిక స్థానాలను సంగ్రహించడానికీ, వాటిని ఇతర వెబ్‌సైట్లలో లేదా మ్యాపింగ్ సాధనాన్ని ఉపయోగించి ప్రదర్శించడానికీ లేదా వాటిని GPS పరికరంలో లోడ్ చేయడానికీ, సూచిక తయారుచేయడానికీ, సమగ్రపరచడానికి లేదా వాటిని ప్రత్యామ్నాయ ఆకృతిలోకి మార్చడానికీ వీలు కలిగిస్తుంది.

వాడుక

[మార్చు]
  • అక్షాంశం ఉన్నట్లయితే, రేఖాంశం తప్పనిసరిగా ఉండాలి లేదా రేఖాంశం ఉంటే అక్షాంశం తప్పనిసరిగా ఉండాలి.
  • రెండూ విలువల్లోనూ చివర్లో ఉండే సున్నాలతో సహా ఒకే సంఖ్యలో దశాంశ స్థానాలు ఉండాలి.

జియో మైక్రోఫార్మాట్ మూడు HTML తరగతులను ఉపయోగించి వర్తిస్తుంది. ఉదాహరణకు, మార్కప్ పాఠ్యం కింది విధంగా ఉంటే:

<div>నాగార్జున సాగర్: 16.567476; 79.303317</div>

దానికి తరగతి-లక్షణ విలువలైన "geo", "latitude", "longitude" లను చేర్చి కింది విధంగా మారుస్తుంది:

<div class="geo">నాగార్జున సాగర్: <span class="latitude">16.567476</span>; <span class="longitude">79.303317</span></div>


దాన్ని ఇలా ప్రదర్శిస్తుంది

నాగార్జున సాగర్: 16.567476; 79.303317

మైక్రోఫార్మాట్‌ను పార్సింగ్ చేసే పరికరాలు జియో మైక్రోఫార్మాటును బట్టి ఆ స్థానం నాగార్జున సాగర్ అని గుర్తిస్తాయి.

జియో మైక్రోఫార్మాటును hCard మైక్రోఫార్మాట్‌లో ఇముడ్చవచ్చు. తద్వారా వ్యక్తిగత, సంస్థాగత, వేదిక పేర్లు, పోస్టల్ చిరునామాలు, టెలిఫోన్ పరిచయాలు, URLలు, చిత్రాలు మొదలైనవాటిలో చేర్చడానికి వీలు కలిగిస్తుంది

పొడిగింతలు

[మార్చు]

జియో మైక్రోఫార్మాట్‌ను విస్తరించడానికి మూడు ప్రతిపాదనలు ఉన్నాయి:

వినియోగదారులు

[మార్చు]

జియోను ఉపయోగించే సంస్థలు, వెబ్‌సైట్‌లు:

  • Flickr - మూడు మిలియన్లకు పైగా ఫోటో పేజీలలో
  • జియోగ్రాఫ్ - ఒక మిలియన్ ఫోటో పేజీలలో
  • Google [5]
  • మల్టీపటం - అన్ని పటం పేజీలు
  • OpenStreetMap - స్థలాలు, GPS జాడలు, డైరీ ఎంట్రీల గురించిన వికీ పేజీలు
  • వికీపీడియా - మ్యాప్-లింక్ పేజీల జియో టెంప్లేట్‌లలో పొందుపరచబడింది
    • జర్మన్ వికీపీడియా
    • డచ్ వికీపీడియా
    • స్వీడిష్ వికీపీడియా
    • ఇటాలియన్ వికీపీడియా
  • వికీవాయేజ్

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Geo Spec". microformats community. Retrieved 17 August 2010.
  2. "Extending HTML5 — Microformats". HTML5 Doctor. Retrieved 19 August 2010.
  3. 3.0 3.1 "hCalendar 1.0 Spec". Microformats community. Retrieved 17 August 2010.
  4. 4.0 4.1 "hCard 1.0 Spec". Microformats Community. Retrieved 17 August 2010.
  5. "Microformats in Google Maps". Retrieved 30 April 2016.