Jump to content

కె . వసంత్ కుమార్

వికీపీడియా నుండి
(K.Vasanth Kumar నుండి దారిమార్పు చెందింది)

కె . వసంత్ కుమార్ కరీంనగర్ కు చెందిన ప్రముఖ "కరాటే", మార్షల్ ఆర్ట్స్ విద్యలలో ప్రముఖుడు.

Vasanth-Kumar

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన కరీంనగర్ జిల్లా లోని సుల్తానాబాద్ మండలానికి చెందిన గట్టేపల్లి గ్రామానికి చెందినవారు. ఈయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధులు సామాజిక సేవే తత్పరలు, కళా రసజ్ఞులు కొండకింది పురుషోత్తం రావు తల్లి మృదుభాషి శ్రీమతి రత్నమాల గార్లు. ఈయన కరీంనగర్ ఎస్ అర్ అర్ . కళాశాలలో బి.కాం. ఉత్తీర్ణులైరి. వారి పెద్దనాన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు రజాకర్లను గడగదలాడించిన గడ్డేపల్లి మురళీధర్ రావు గారి నుండి స్ఫూర్తిని పొంది వారివద్ద కర్రసాము, కత్తి సాము, బాక్సింగ్, మల్ల యుద్ధము నేర్చుకున్నారు. ఆ విద్యల పట్ల ఆకర్షణతో జై భారత అకాడమి శిక్షుకుడైన సోమిది కొమురయ్య వద్ద శిక్షణ పొందారు. ఈయన 1997 లో వరంగల్ లోణి శ్రీ ప్రతాప్ జాకబ్ గారి వద్ద కరాటేలో శిక్షణ పొందారు.

మొదటి ప్రశంస

[మార్చు]

ఈయన ఖాజీపేట రైల్వే స్టేషన్లో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కరాటే పోటీలలో పాల్గొని స్టేట్ లెవెల్ గోల్డ్‌ మెడల్ సాధించిన సందర్భంగా జాతీయ స్థాయి పోటీలలో మహారాష్ట్రలో పాల్గొని, జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ పొందారు.

కరాటే మాస్టర్ గా

[మార్చు]

మాస్టర్ శ్రీ ఎ.శ్రీనివాసన్ గారి శిక్షణలో 1983 లో బ్లాక్ బెల్ట్ సాధించడం ఒకినోవ కరాటే స్కూల్ ని జిల్లలో స్థాపించి, జిల్లాలోని మారుమూల తాలూకాలు, గ్రామాలలో యువతకు కరాటే నేర్పించడం, జిల్లాలోని, అనేక విద్యా సంస్థలలోని విద్యార్థినీ, విద్యార్థులకు కరాటే నేర్పించి, కరాటేను కరీంనగర్ జిల్లాకు పరిచయం చేసిన వ్యక్తిగా పేదల అభినందనలు అందుకున్నారు.

జిల్లాలోని అన్ని ప్రముఖ పట్టణాలలో కరాటే ప్రదర్శనలు నిర్వహించి, ప్రజలకు, యువతకు మార్షల్ ఆర్ట్స్ పట్ల అవగాహన కలిగించడంలోనూ, 1985 లో 1వ ప్రప్రథమ స్టేట్ లెవెల్ ఓపెన్ టు అల్ స్టైల్స్ కరాటే పోటీలు జిల్లలో నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించారు.

పొందిన సత్కారాలు

[మార్చు]
  • కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, భిహర్, గుజరాత్, వెస్ట్ బెంగాల్ లో నిర్వహించిన పలు పోటీల్లో పాల్గొని, కథాస, వెపన్ అంశాలలో ఛాంపియన్ గా నిలవడం.
  • హైదరాబాదు రవీంద్రభారతిలో మరియి ఏలూరులో విజేతగా నిలువడం.
  • 1988 లో జిల్లలో ప్రప్రథమ జాతీయ స్థాయి పోటీల్లో మూడు రోజులో అనగా డిసెంబరు 7,8, &9 తేదీలలో స్థానిక వైష్యభావన్ లో నిర్వహించడం.
  • తదుపరి అరడజను సార్లు జాతీయ స్థాయి పోటీలు, డజనుకు పైగా రాష్ట్ర స్థాయి పోటీలు, 15 జిల్లలో నిర్వహించిన ఘనత ఆయనదే.

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ప్రశంసా పత్రము


“కరాటే" అంటే తన ఆరో ప్రాణంగా భావించి సమాజంలోని మహిళలు, విద్యార్థినులు, వేలాదిమంది యువత, పోలీసులకు గత 30 సంవత్సరాలుగా కరాటేలో శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు మానసికంగా, శారీరకంగా సంసిద్దంగా ఉంటూ ఉల్లాసవంతమైన జీవనాన్ని కొనసాగించేందుకు కరాటే శిక్షకులు, ఒకినోవా కరాటే సంస్థ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కొండకింది వసంత్ కుమార్ గారు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవి.

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో 2019 డిసెంబరు 10న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 10వేల మంది అమ్మాయిలకు ఆత్మరక్షణ మెలకువలు, ఒకరోజు శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన క్రమంలో ఈ కార్యక్రమం సందర్భంగా అత్యున్నత ప్రతిభ కనబరిచిన 50మంది విదార్థునులను ఎంపిక చేసుకొని పోలీస్ శాఖ కమీషనరేట్ కేంద్రంలో శిక్షణ ఇప్పించింది.

గత 20 సంవత్సరాలుగా కరీంనగర్ పోలీస్ శాఖలోని వివిధ స్థాయిలకు చెందిన పోలీసులకు ఆత్మరక్షణ కళలు, కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. 2017 జనవరిలో షీ టీంలో పనిచేసే మహిళా పోలీసులకు కరాటేలో శిక్షణ ఇచ్చారు. దీంతో వారు ఆయుధాలు లేకుండా ఏదైనా దాడి జరిగినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దారు. 2019 జనవరిలో కమీషనరేట్ లోని వివిధ స్థాయిలకు చెందిన మహిళా పోలీసులకు వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వసంత కుమార్ గారు మహిళలకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురుదాడికి దిగడం.

నివారించుకోవడంలో పరిపూర్ణమైన శిక్షణను అందించారు. ఈ శిక్షణ ప్రభావంతో పోలీస్ శాఖ లోని వివిధ స్థాయిలకు చెందిన పోలీసులు, విద్యార్థినులు, మహిళల్లో ఆత్మస్థైర్యం నెలకొని, ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యే విధంగా తీర్చిదిద్దారు. పైన పేర్కొన్న శిక్షణల ముగింపు సందర్భంగా వారు ప్రదర్శించిన సాహసోపేతమైన విన్యాసాలు అందర్ని ఆకట్టుకున్నాయి. సాహసోపేతమైన సేవలందించడంలో మహిళా పోలీసులు ఈ కరాటే శిక్షణతో పురుషులతో సమానంగా పోటిపడుతున్నారు.

వసంత కుమార్ గారు ఆయురారోగ్యాలతో ఉంటూ సుఖసంతోషాలతో జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన అందించిన సేవలు అమూల్యమైనవి. మా సత్కారాన్ని స్వీకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

సామాజిక సేవ

[మార్చు]
  • 1987 లో తొలిసారి కరాటే ప్రదర్శన నిర్వహించి, తద్వారా వచ్చిన డబ్బును వికలాంగుల పాఠశాలకు 10,000 రూపాయల విరాళాలను డి.ఐ.జి. వెంకటరమణ రెడ్డి గారి చేతుల మీదుగా అందించడం,
  • తుఫాన్ బాధితులకు సహాయార్ధం విరాళాలు పంపడం,
  • అక్షర ఉజ్వల లాంటి కార్యక్రమంలో తనవంతు పాత్ర.
  • ఈనాడు వారు నిర్వహిఒంచిన దోమల నివారణ కార్యక్రమంలో భాగస్వాములు కావడం,
  • నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత కరాటే శిక్షణ ఇవ్వడం,

సినీ ప్రస్థానం

[మార్చు]

వీరి ప్రతిభ ప్రజా ఆమోదితమయిన సినీమా రంగంలో కూడా ఉంది అనడంలో సందేహం లేదు. 1976 లో నిర్మించిన సామాజిక డాక్యుమెంటరి చిత్రంలో హీరోగా నటించడం. అనేక నాటకాలలో పాల్గొనడం, చిత్రాలు ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, ఏంటి బావ మరీను, చిరునవ్వుల వరమిస్తా, శ్రీవారు అంటే మావారే మొదలగు చిత్రాలలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ జాతీయ స్థాయి హీరో వక్రం ( అపరిచితుడు ), హీరో నరేష్ లతో నటించి మెప్పించిన ఘనత.

ప్రముఖ ప్రశంసలు

[మార్చు]
  • దర్శక రత్న దాసరి గారి చేతుల మీదుగా తిరుపతిలో ఇద్దరు పెళ్ళాల "ముద్దుల పోలీస్" సినిమా అర్థ శత దినోత్సావం సందర్భంగా అవార్డు, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్, చక్కటి ప్రదర్శన మెప్పించిన సందర్భంగా చంద్రబాబునాయుడు, అక్కినేని నాగేశ్వరరావు, మద్రాసు తెలుగు అకాడమీ గవర్నర్ వై.రామారావు లచే తమ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రశంసలు పొందారు.
  • 2000 సంవత్సరం నుండి పోలీస్ కరాటే శిక్షకునిగా పలు జిల్లలో అనగా కృష్ణా జిల్లా, విజయనగరం జిల్లా. వరంగల్ జిల్లా, కలెక్టర్, ఎస్.పీ ల చే ప్రత్యేక ప్రశంసలు.
  • 2009 లో జిల్లా నుండి ప్రప్రథమంగా ప్రపంచంలో అగ్రగామి రాజ్యమై, అమెరికాలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో తన వద్ద శిక్షణ పొందిన కె సాయి తేజ బ్రాండ్ మెడల్ సాధించిన సందర్భంగా మంత్రివర్యులు డి.శ్రీధర్ బాబు గారిచే ప్రశంస.
  • 2010 సం||లో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అకాడమీ ప్రత్యెక ప్రదర్శనలు ఇప్పించి, డీ, జీ, పీ దినేష్ రెడ్డి, హోం మినిస్టర్ సభితా ఇంద్రారెడ్డి లచే ప్రశంసలు.
  • 2011 సం||లో సికింద్రాబాద్ జింఖాన గ్రౌండ్ లో 300 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లచే మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక ప్రదర్శన ఇప్పించిన సందర్భంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ డీ, జీ, పీ దినేష్ రెడ్డి, ట్రైనింగ్ అడిషినల్ డీ, జీ తేజ్ దీప్ కౌర్ గార్ల సమక్షంలో ప్రశంసలు పొందడం జీవితంలో మరిచిపోలేనివి.
  • మార్షల్ ఆర్ట్స్ రంగంలో చేస్తున్న కృషికి గాను అమెరికాలో "తానా" నుండి 2001 లో ఆహ్వానము.
  • 2013 లో అమెరికాలోని "ఆటా" నుండి ఆహ్వానం. డిల్లీ తెలుగు అకాడెమి నుండి విశిష్ట సేవ పురస్కారం. పలు కళా సంస్థల నుండి ఉగాది పురస్కారం అందుకోవడం, అన్నమయ్య కల్లజీవన పురస్కారం అందుకోవడం .

సహజీవనం

[మార్చు]

శ్రీమతి కొండకింది విద్యారాని సహనశేలి పొందటం ద్వారా వారి నుండి నిరంతరం ప్రోత్సాహంతో కరాటేలో ముందంజ.

పదవి సత్కారాలు

[మార్చు]
  • వైస్ ప్రెసిడెంట్ అల్ ఇండియా సుటోకాయ్ ఫెడరేషన్,
  • ఫౌండర్ & చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ ఒకినోవా ఇన్స్టిట్యూట్ షన్స్ తెలంగాణా.
  • ఆన్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ అర్గనైజర్ లో వైస్ చైర్మెన్ గా, ప్రస్తుతం డైరెక్టర్ పదవిలో కొనసాగడం.
  • జీత్ కేండో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గా.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]