Jump to content

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్

వికీపీడియా నుండి
(Saint Kitts and Nevis నుండి దారిమార్పు చెందింది)
ఫెడరేషన్ ఆఫ్ సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవిస్
Motto: "Country Above Self"
Anthem: "O Land of Beauty!"
Location of సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
Capital
and largest city
బాస్సెటెర్రె
Official languages ఇంగ్లీషు
Ethnic groups (2001)
  • 92.5% ఆఫ్రో కరిబియన్
  • 3% బహుళజాతీయులు
  • 2.1% ఐరోపావాసులు
  • 1.5% భారతీయులు
  • 0.6% ఇతరులు
  • 0.3% వెల్లడికానివారు
Demonym
  • Kittitian
  • Nevisian
Government Federal parliamentary
constitutional monarchy
 -  రాచరికం చార్లెస్ 3
 -  Governor-General
Legislature జాతీయ అసెంబ్లీ
స్వాతంత్ర్యం
 -  అనుబంధ రాజ్యం 1967 ఫిబ్రవరి 27 
 -  స్వాతంత్ర్య ప్రకటన 1983 సెప్టెంబరు 19 
Area
 -  Total 261 km2 (188th)
104 sq mi 
 -  Water (%) బహుస్వల్పం
Population
 -  2016 estimate 54,821[1] (213th)
 -  2011 census 46,204
 -  Density 164/km2 (64th)
424/sq mi
GDP (PPP) 2019 estimate
 -  Total $1.758 billion
 -  Per capita $31,095[2]
GDP (nominal) 2019 estimate
 -  Total $1.058 billion
 -  Per capita $18,714[2]
HDI (2019)0.779[3]
high · 74th
Currency ఈస్ట్ కరిబియన్ డాలర్ (EC$) (XCD)
Time zone AST (UTC-4)
Drives on the left
Calling code +1 869
Internet TLD .kn
a. Or "Saint Kitts and Nevis".

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ (అధికారికంగా ఫెడరేషన్ ఆఫ్ సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవిస్), [4] వెస్ట్ ఇండీస్‌లోని ఒక ద్వీప దేశం. ఇది లెస్సర్ యాంటిల్లెస్ లోని లీవార్డ్ దీవుల గొలుసులో ఉంది. విస్తీర్ణం పరంగాను, జనాభా పరంగానూ ఇది పశ్చిమార్ధగోళంలో అతి చిన్న సార్వభౌమిక దేశం. అలాగే ప్రపంచంలోని అతి చిన్న సార్వభౌమిక సమాఖ్య కూడా. [5] కామన్వెల్త్‌లో భాగమైన ఈ దేశానికి, చార్లెస్ III రాజుగా, దేశాధిపతిగా ఉన్నాడు. [6] [7] ఇది కరీబియన్‌లోని ఏకైక సార్వభౌమ సమాఖ్య.

దేశ రాజధాని నగరం బాస్సెటెర్రే. ఇది సెయింట్ కిట్స్ ద్వీపంలో ఉంది. [8] ప్రయాణీకుల ప్రవేశానికి (క్రూయిజ్ షిప్‌ల ద్వారా), కార్గోకీ బాస్సెటెర్రే ప్రధాన ఓడరేవు. చిన్న ద్వీపమైన నెవిస్, సెయింట్ కిట్స్‌కు ఆగ్నేయంలో, ది నారోస్ అనే లోతులేని ఛానెల్‌కు అవతల సుమారు 3 కి.మీ. (2 మై.) దూరంలో ఉంది. [9]

బ్రిటిషు డిపెండెన్సీ అయిన యాంగిల్లా, ఒకప్పుడు ఈ యూనియన్‌లో భాగంగా ఉండేది. దీనిని అప్పుడు సమిష్టిగా సెయింట్ క్రిస్టోఫర్-నెవిస్-యాంగిల్లా అనేవారు. అయితే, యాంగిల్లా యూనియన్ నుండి విడిపోయి, బ్రిటిషు విదేశీ భూభాగంగా మిగిలిపోయింది. [10] దేశానికి ఉత్తర-వాయువ్య దిశలో సింట్ యుస్టాటియస్, సబా, సెయింట్ బార్తెలెమీ, సెయింట్-మార్టిన్/సింట్ మార్టెన్, యాంగిల్లా ద్వీపాలు ఉన్నాయి. తూర్పు, ఈశాన్యంలో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఉన్నాయి. ఆగ్నేయంలో రెడోండా (ఆంటిగ్వా అండ్ బార్బుడాలో భాగం), మోంట్‌సెరాట్ ద్వీపాలు ఉన్నాయి.

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కరేబియన్‌లో యూరోపియన్లకు వలసరాజ్యంగా మారిన తొలి దీవులలో ఒకటి. సెయింట్ కిట్స్ మొదటి బ్రిటిషు, ఫ్రెంచి కరేబియన్ వలసలకు నిలయంగా ఉండేది. దీనిని "ది మదర్ కాలనీ ఆఫ్ ది వెస్ట్ ఇండీస్" అని కూడా పిలుస్తారు. 1983లో స్వాతంత్ర్యం పొందిన ఈ దేశం, కరేబియన్‌లో చిట్టచివరిగా స్వతంత్రంగా మారిన బ్రిటిష్ భూభాగం.

చరిత్ర

[మార్చు]
1629లో విల్లానువా డి వాల్డ్యూజా యొక్క 1వ మార్క్విస్ ఫాడ్రిక్ డి టోలెడోచే సెయింట్ కిట్స్‌ను స్పానిష్ స్వాధీనం

వలసల ముందు కాలం

[మార్చు]

బహుశా 3000 సంవత్సరాల క్రితం దీవులలో స్థిరపడిన అరవాకన్ పూర్వపు ప్రజల మొదటి నివాసుల పేరు తెలియదు. [11] వీరి తరువాత అరవాక్ ప్రజలు లేదా టైనో, సుమారు సా.పూ. 1000 లో నివసించారు. సా.శ. 800 లో కారిబ్స్ ద్వీపం దీన్ని ఆక్రమించుకుంది. : 10 

యూరోపియన్ల రాక, ప్రారంభ వలస కాలం

[మార్చు]

క్రిస్టోఫర్ కొలంబస్ 1493లో దీవులను చూసిన మొదటి యూరోపియన్. [12] [13] 1623లో థామస్ వార్నర్ నేతృత్వంలో వచ్చిన ఆంగ్లేయులు, ఇక్కడి మొదటి వలసనివాసులు. ఇతను సెయింట్ కిట్స్ యొక్క పశ్చిమ తీరంలో ఓల్డ్ రోడ్ టౌన్‌లో కారీబ్ చీఫ్ ఔబౌటౌ టెగ్రెమంటేతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఒక స్థిరనివాసాన్ని స్థాపించాడు. : 15–18 [14] తరువాత ఫ్రెంచి వారు కూడా 1625లో పియరీ బెలైన్ డి'ఎస్నాంబక్ ఆధ్వర్యంలో సెయింట్ కిట్స్‌లో స్థిరపడ్డారు. [15] ఫలితంగా, రెండు పార్టీలు ద్వీపాన్ని ఫ్రెంచి, ఇంగ్లీషు విభాగాలుగా విభజించుకున్నాయి. 1628 నుండి ఆంగ్లేయులు నెవిస్‌లో కూడా స్థిరపడటం ప్రారంభించారు. [16]

ద్వీపం లోని వనరులను దోచుకోవాలనే ప్రయత్నంలో ఫ్రెంచివారు, ఆంగ్లేయులు, స్థానిక కారిబ్స్ (కలినాగో) నుండి ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. మొదటి మూడు సంవత్సరాలలో వారు యుద్ధాలు చేశారు. [17] [18] యూరోపియన్లు ఈ సమస్య నుండి బయటపడాలని నిర్ణయించుకున్నారు. 1626లో ఆంగ్లో-ఫ్రెంచ్ సెటిలర్లు సంయుక్తంగా స్థానిక కలీనాగోను ఊచకోత కోసారు. ఈ ఊచకోత జరిగిన ప్రదేశాన్ని బ్లడీ పాయింట్ అని అంటారు. యూరోపియన్ సెటిలర్లందరినీ బహిష్కరించడానికి లేదా చంపడానికి కారిబ్‌లు వేసిన ప్రణాళికను పూర్వపక్షం చేయడానికే ఈ ఊచకోత అని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత, ఇంగ్లీషు, ఫ్రెంచి వారు దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ బానిసలతో పెద్ద చెరకు తోటలను స్థాపించారు. అయితే నల్లజాతి బానిసలు త్వరలో యూరోపియన్ల కంటే ఎక్కువ సంఖ్యలో రావడంతో ద్వీపాల జనాభా పెద్దయెత్తున మారింది. [19] : 26–31 

స్పానిష్ క్లెయిమ్‌లను బలోపేతం చేయడానికి వచ్చిన 1629 నాటి స్పానిష్ దళం, ఇంగ్లీష్ ఫ్రెంచ్ కాలనీలను నాశనం చేసి, అక్కడ స్థిరపడిన వారిని వారి దేశాలకు తరిమేసింది. 1630 లో యుద్ధ పరిష్కారంలో భాగంగా, ఇంగ్లీషు, ఫ్రెంచి వలసల పునఃస్థాపనకు స్పానిష్ వారు అనుమతించారు. : 19–23 సముద్రపు దొంగలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో బ్రిటిషు వారు చేసిన సహకారానికి ప్రతిగా, మాడ్రిడ్ ఒప్పందం (1670) తో స్పెయిన్, సెయింట్ కిట్స్‌కు బ్రిటన్‌కు అధికారికంగా అప్పగించింది. [20]

స్పానిష్ శక్తి క్షీణించడంతో, సెయింట్ కిట్స్ కరేబియన్‌లో ఇంగ్లీషు, ఫ్రెంచి వారి విస్తరణలకు కీలక స్థావరంగా మారింది. సెయింట్ కిట్స్ నుండి బ్రిటిషు వారు ఆంటిగ్వా, మోంట్‌సెరాట్, యాంగిల్లా, టోర్టోలా ద్వీపాలలో స్థిరపడ్డారు. ఫ్రెంచి వారు మార్టినిక్, గ్వాడెలోప్ ద్వీపసమూహం, సెయింట్ బార్తెలెమీలలో స్థిరపడ్డారు. 17వ శతాబ్దం చివరలో, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌లు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లపై నియంత్రణ కోసం పోరాడారు. 1667, : 41–50 1689–90 [21] : 51–55 1701-13 లలో యుద్ధాలు చేశారు. ఫ్రెంచ్ వారు 1713లో ఉట్రెచ్ట్ ఒప్పందంతో ద్వీపాలపై తమ దావాను వదులుకున్నారు. [22] : 55–60 [23] అప్పటికే యుద్ధం కారణంగా ధ్వంసమైన ద్వీపాల ఆర్థిక వ్యవస్థ ప్రకృతి వైపరీత్యాల వల్ల మరింతగా దెబ్బతింది: 1690లో వచ్చిన భూకంపంలో నెవిస్ రాజధాని జేమ్స్‌టౌన్‌ను నాశనం కావడంతో, చార్లెస్‌టౌన్‌లో కొత్త రాజధానిని నిర్మించవలసి వచ్చింది; 1707లో వచ్చిన తుపాను కారణంగా మరింత నష్టం జరిగింది. : 105–108 

బ్రిటిష్ వలస కాలం

[మార్చు]

18వ శతాబ్దం నాటికి వలస రాజ్యం కోలుకుంది. 1700ల ముగింపు నాటికి సెయింట్ కిట్స్ బానిస-ఆధారిత చక్కెర పరిశ్రమ ఫలితంగా కరేబియన్‌లో తలసరి ఆదాయం పరంగా ధనిక వలస రాజ్యంగా మారింది. [24] 18వ శతాబ్దంలో ధనవంతమైన నెవిస్, క్రమేణా ఆర్థిక ప్రాముఖ్యతలో కలిగిన సెయింట్ కిట్స్‌ కంటే వెనకబడింది. : 75  : 126, 137 

బ్రిమ్‌స్టోన్ హిల్‌పై ఉన్న కోట, 1782లో ఫ్రెంచ్ దండయాత్ర విజయవంతమైంది

బ్రిటన్, దాని అమెరికన్ కాలనీలతో యుద్ధంలో చిక్కుకున్నందున, ఫ్రెంచ్ వారు ఆ సదవకాశాన్ని ఉపయోగించుకుని 1782లో సెయింట్ కిట్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే పారిస్ ఒప్పందం (1783) లో భాగంగా వారు సెయింట్ కిట్స్ ను తిరిగి బ్రిటిషువారికి అప్పగించి దాన్ని బ్రిటిషు భూభాగంగా గుర్తించారు. [25] [26]

1807లో బ్రిటిషు సామ్రాజ్యంలో ఆఫ్రికన్ బానిస వ్యాపారాన్ని రద్దు చేసారు. 1834లో బానిసత్వాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రతి బానిసకు నాలుగు సంవత్సరాల "అప్రెంటిస్‌షిప్" వ్యవధి ఉండాలనే వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థలో వారు తమ పూర్వ యజమానుల వద్దనే వేతనాలు పొందుతూ పనిచేశారు. నెవిస్‌లో 8,815 మంది బానిసలను విడుదల చేయగా, సెయింట్ కిట్స్‌లో 19,780 మందిని విడిపించారు. : 110, 114–117 

(1958–62)లో కొంతకాలం పాటు వెస్టిండీస్ ఫెడరేషన్‌లో భాగంగా ఉన్న తర్వాత సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, 1967 లో [15] పూర్తి అంతర్గత స్వయంప్రతిపత్తితో అనుబంధ రాజ్యంగా మారింది. నెవిస్, యాంగిల్లా వాసులు ఫెడరేషనులో సెయింట్ కిట్స్ ఆధిపత్యం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. 1967లో యాంగిల్లా ఏకపక్షంగా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. [27] [28] 1971లో బ్రిటన్ మళ్ళీ యాంగిల్లాపై పూర్తి నియంత్రణను తెచ్చుకుంది. అయితే అది 1980లో అధికారికంగా వేరు పడింది. : 147–149 [29] తర్వాత నెవిస్‌పై దృష్టి కేంద్రీకరించారు. నెవిస్ రిఫార్మేషన్ పార్టీ భవిష్యత్తులో ఏదైనా స్వతంత్ర దేశం ఏర్పడితే ఆ చిన్న ద్వీపపు ప్రయోజనాలను కాపాడాలని కోరింది. చివరికి ద్వీపం దాని స్వంత ప్రధాని, స్వంత అసెంబ్లీతో స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుందని అంగీకరించబడింది. అలాగే స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణలో మూడింట రెండు వంతుల మెజారిటీ అనుకూలంగా వస్తే ఏకపక్షంగా విడిపోవడానికి రాజ్యాంగపరంగా రక్షిత హక్కు కూడా ఇచ్చారు. [30] [31] సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ 1983 సెప్టెంబరు 19 న పూర్తి స్వాతంత్ర్యం పొందింది. [32] [33] 1980 నుండి ప్రధానిగా ఉన్న కెన్నెడీ సిమండ్స్, దేశానికి మొదటి ప్రధాన మంత్రి అయ్యాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ బ్రిటిషు కామన్వెల్త్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంది. తద్వారా క్వీన్ ఎలిజబెత్‌ను మోనార్క్‌గా నిలుపుకున్నారు, స్థానికంగా గవర్నర్-జనరల్ పరిపాలిస్తారు.

స్వాతంత్ర్యం తరువాత కాలం

[మార్చు]

1984, 1989, 1993 ఎన్నికలలో కెన్నెడీ సిమండ్స్ విజయం సాధించాడు. 1995లో డెంజిల్ డగ్లస్ ఆధ్వర్యంలో SKNLP తిరిగి అధికారంలోకి రావడంతో అతను పదవిని కోల్పోయాడు. [34] [35]

సమాఖ్యలో తాము నిర్లక్ష్యానికి గురయ్యామని అసంతృప్తి చెందిన నెవిస్‌ ప్రజలు [36] 1998లో సెయింట్ కిట్స్ నుండి విడిపోవడానికి ప్రజాభిప్రాయ సేకరణలో వోట్లు వేసారు. విడిపోవడానికి 62% ఓట్లు వచ్చినప్పటికీ, అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రానందున విడిపోయే ప్రతిపాదన వీగిపోయింది. [37] [38] [39]

2015 సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సాధారణ ఎన్నికలలో తిమోతీ హారిస్, అతని పీపుల్స్ లేబర్ పార్టీ, ' టీమ్ యూనిటీ ' బ్యానర్‌లో PAM, నెవిస్ ఆధారిత కన్సర్న్డ్ సిటిజన్స్ మూవ్‌మెంట్ మద్దతుతో గెలుపొందారు. [40]

జూన్ 2020లో, తిమోతీ హారిస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి చెందిన టీమ్ యూనిటీ సంకీర్ణం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ లేబర్ పార్టీ (SKNLP)ని ఓడించి సాధారణ ఎన్నికలలో విజయం సాధించింది. [41]

2022 ఆగస్టు 5 న జరిగిన సాధారణ ఎన్నికలలో, సెయింట్ కిట్స్-నెవిస్ లేబర్ పార్టీ (SKNLP) సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టెరెన్స్ డ్రూ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌కు నాల్గవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. [42]

పరిపాలనా విభాగాలు

[మార్చు]

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సమాఖ్యను పద్నాలుగు పారిష్‌లుగా విభజించారు: వీటిలో సెయింట్ కిట్స్‌లో తొమ్మిది విభాగాలు, నెవిస్‌లో ఐదూ ఉంటాయి.

భౌగోళికం

[మార్చు]
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ మ్యాప్
సెయింట్ కిట్స్ లోని ఆగ్నేయ ద్వీపకల్పం నుండి నెవిస్ ద్వీపం యొక్క దృశ్యం

దేశం రెండు ప్రధాన ద్వీపాలున్నాయి: సెయింట్ కిట్స్, నెవిస్. ఈ రెంటి మధ్య 3 కి.మీ. వెడల్పున్న నారోస్ జలసంధి ఉంటుంది. [43] రెండూ అగ్నిపర్వతాల నుండి ఏర్పడినవే. మధ్యలో ఉన్న శిఖరాలు ఉష్ణమండల వర్షారణ్యంతో కప్పబడి ఉన్నాయి. [44] జనాభాలో ఎక్కువ మంది చదునైన తీర ప్రాంతాలలో నివసిస్తున్నారు. [45] సెయింట్ కిట్స్‌లో అనేక పర్వత శ్రేణులు (నార్త్ వెస్ట్ రేంజ్, సెంట్రల్ రేంజ్, సౌత్-వెస్ట్ రేంజ్) ఉన్నాయి. ఇక్కడే దేశంలోని ఎత్తైన లియముయిగా శిఖరం 1,156 మీటర్లు (3,793 అ.) ఉంది. [46] తూర్పు తీరం వెంబడి కెనడా కొండలు, కోనరీ కొండలు కనిపిస్తాయి. భూమి ఆగ్నేయంలో గణనీయంగా సన్నబడిపోతూ, చాలా చదునైన ద్వీపకల్పాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ అతిపెద్ద ఉప్పు చెరువును ఉంది. ఆగ్నేయంలో, ది నారోస్‌లో, బూబీ ద్వీపం అనే చిన్న ద్వీపం ఉంది. రెండు ద్వీపాల లోని పర్వతాల నుండి ప్రవహించే అనేక నదులు స్థానిక జనాభాకు మంచినీటిని అందిస్తాయి. నెవిస్, రెండు ప్రధాన ద్వీపాలలో చిన్నది. ఇది సుమారుగా వృత్తాకారంలో ఉంటుంది. ఇక్కడున్న నెవిస్ శిఖరం 985 మీటర్లు (3,232 అ.) ఎత్తు ఉంటుంది. [47]

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో రెండు భూసంబంధమైన పర్యావరణ ప్రాంతాలు ఉన్నాయి: లీవార్డ్ దీవుల తేమతో కూడిన అడవులు, లీవార్డ్ దీవుల పొడి అడవులు. 2019 లో దేశపు ఫారెస్ట్ ల్యాండ్‌స్కేప్ ఇంటిగ్రిటీ ఇండెక్స్ సగటు స్కోరు 4.55/10ని. ఇది ప్రపంచవ్యాప్తంగా 172 దేశాలలో 121వ స్థానం.

వాతావరణం

[మార్చు]

కొప్పెన్ వాతావరణ వర్గీకరణ ప్రకారం, సెయింట్ కిట్స్‌లో ఉష్ణమండల సవన్నా వాతావరణం ( కొప్పెన్ ఆవ్ ), నెవిస్‌లో ఉష్ణమండల రుతుపవన వాతావరణం ( కొప్పెన్ ఆమ్ ) ఉంది. [48] బాస్సెటెర్రెలో సగటు నెలవారీ ఉష్ణోగ్రతలు 23.9 °C (75.0 °F), 26.6 °C (79.9 °F) మధ్య కొద్దిగా మారుతూ ఉంటాయి. వార్షిక వర్షపాతం సుమారుగా 2,400 మిల్లీమీటర్లు (90 అం.), అయితే ఇది 1901-2015 కాలంలో 1,356 మిల్లీమీటర్లు (53.4 అం.) నుండి 3,183 మిల్లీమీటర్లు (125.3 అం.) మారుతూ ఉంది.

శీతోష్ణస్థితి డేటా - Saint Kitts and Nevis (1991–2015)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
రోజువారీ సగటు °C (°F) 23.9
(75.0)
23.8
(74.8)
24.0
(75.2)
24.7
(76.5)
25.5
(77.9)
26.2
(79.2)
26.3
(79.3)
26.6
(79.9)
26.4
(79.5)
26.0
(78.8)
25.4
(77.7)
24.4
(75.9)
25.3
(77.5)
సగటు అవపాతం mm (inches) 150
(5.9)
102
(4.0)
99
(3.9)
153
(6.0)
219
(8.6)
181
(7.1)
214
(8.4)
232
(9.1)
222
(8.7)
289
(11.4)
286
(11.3)
225
(8.9)
2,372
(93.3)
Source: Climate Change Knowledge Portal[49]

జనాభా వివరాలు

[మార్చు]
డౌన్‌టౌన్ బస్సెటెర్రే, సెయింట్ కిట్స్

జనాభా

[మార్చు]

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ జనాభా దాదాపు 53,000 (జూలై 2019 అంచనా.) [50] జానాభా చాలా సంవత్సరాలుగా స్థిరంగా ఉంది. [51] పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో 42,600 మంది నివాసితులు ఉండగా ఇరవయ్యవ శతాబ్దం మధ్య నాటికి ఈ సంఖ్య నెమ్మదిగా 50,000కి పెరిగింది. [52] 1960, 1990 ల మధ్య, జనాభా 50,000 నుండి 40,000కి పడిపోయి, మళ్లీ ప్రస్తుత స్థాయికి చేరుకుంది. జనాభాలో దాదాపు మూడు వంతుల మంది సెయింట్ కిట్స్‌లో నివసిస్తున్నారు. వీరిలో 15,500 మంది రాజధాని బాస్సెటెర్రేలో నివసిస్తున్నారు. ఇతర పెద్ద స్థావరాలు సెయింట్ కిట్స్‌లోని కాయోన్ (జనాభా 3,000), శాండీ పాయింట్ టౌన్ (3,000), నెవిస్‌లోని జింజర్‌ల్యాండ్ (2,500), చార్లెస్‌టౌన్ (1,900).

జాతి సమూహాలు

[మార్చు]

జనాభా ప్రధానంగా ఆఫ్రో-కరేబియన్లు (92.5%) కాగా, ఐరోపా (2.1%), భారతీయ (1.5%) సంతతికి చెందిన మైనారిటీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో (2001 అంచనా) ఉన్నారు. [53]

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో మతం(2011)[54][55]

  క్రైస్తవం (87.6%)
  ఏ మతమూ లేదు (8.7%)
  హిందూమతం (1.82%)
  రాస్టా (1.3%)
  ఇస్లాం (0.52%)
  ఇతరాలు (5.6%)

ప్రజల్లో ఎక్కువ మంది (82%) క్రైస్తవులు. ప్రధానంగా ఆంగ్లికన్లు, మెథడిస్ట్, ఇతర ప్రొటెస్టంట్ తెగలు. [56] సెయింట్ జాన్స్-బాసెటెర్రే యొక్క రోమన్ కాథలిక్ డియోసెస్ ద్వారా రోమన్ కాథలిక్కులకు మతసంబంధం సేవలు అందుతాయి.

హిందూ మతం అతిపెద్ద క్రైస్తవేతర మతం, జనాభాలో 1.82% మంది హిందువులు. దీనిని ప్రధానంగా ఇండో-కిట్టిషియన్లు, ఇండో-నెవిసియన్లు అనుసరిస్తారు.

2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 17 శాతం మంది ఆంగ్లికన్; 16 శాతం మెథడిస్ట్ ; 11 శాతం పెంటెకోస్టల్ ; 7 శాతం చర్చ్ ఆఫ్ గాడ్ ; 6 శాతం రోమన్ కాథలిక్; 5 శాతం ప్రతి బాప్టిస్ట్, మొరావియన్, సెవెంత్-డే అడ్వెంటిస్ట్, వెస్లియన్ హోలీనెస్; 4 శాతం ఇతర; 2 శాతం బ్రదర్న్, ఎవాంజెలికల్ క్రిస్టియన్, హిందూ మతావలంబికులు. [57]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
రాజధాని, బస్సెటెర్రే

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ఒక జంట-ద్వీప సమాఖ్య, దీని ఆర్థిక వ్యవస్థ పర్యాటకం, వ్యవసాయం, తేలికపాటి తయారీ పరిశ్రమలపై ఆధారపడి ఉంది. [58] 1940ల నుండి చక్కెర ప్రాథమిక ఎగుమతి రంగంగా ఉండేది. కానీ పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, తగ్గిన ప్రపంచ మార్కెట్ ధరల వలన దానిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల కారణంగా వ్యవసాయ రంగంలో వైవిధ్యత పెరిగింది. నష్టాలను చవిచూస్తూ, ఆర్థిక లోటుకు గణనీయంగా కారణమైన ప్రభుత్వరంగ చక్కెర కంపెనీని మూసివేయాలని 2005లో ప్రభుత్వం నిర్ణయించింది. [59] [60]

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ఆర్థిక వ్యవస్థ పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడి ఉంది, ఈ రంగం 1970ల నుండి గణనీయంగా విస్తరించింది. [61] [62] 2007లో 3,79,473తో పోలిస్తే 2009లో సెయింట్ కిట్స్‌కు 5,87,479 మంది పర్యాటకులు వచ్చారు. రెండేళ్ల కాలంలో దాదాపు 40% పెరుగుదల చూసింది. అయితే ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో పర్యాటక రంగం క్షీణించి, తిరిగి ఇటీవలే సంక్షోభం ముందు స్థాయిలకు చేరుకుంది. [63] ఇటీవలి సంవత్సరాలలో ప్రభుత్వం వ్యవసాయం, పర్యాటకం, ఎగుమతి ఆధారిత తయారీ, ఆఫ్‌షోర్ బ్యాంకింగ్ రంగాల ద్వారా ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి ప్రయత్నించింది. [64]

2015 జూలైలో సెయింట్ కిట్స్ & నెవిస్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లు "సమాచార మార్పిడి ద్వారా పన్ను విషయాలలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి" పన్ను ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందాన్ని OECD గ్లోబల్ ఫోరమ్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అభివృద్ధి చేసింది. ఇందులో OECD సభ్య దేశాలు, కరేబియన్, 11 ఇతర దేశాల ప్రతినిధులు భాగస్తులు. [65]

రవాణా

[మార్చు]
సెయింట్ కిట్స్‌లోని రాబర్ట్ ఎల్. బ్రాడ్‌షా అంతర్జాతీయ విమానాశ్రయం
నెవిస్‌లోని వాన్స్ W. అమోరీ అంతర్జాతీయ విమానాశ్రయం

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ లో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. సెయింట్ కిట్స్ ద్వీపంలో ఉన్న రాబర్ట్ ఎల్. బ్రాడ్‌షా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కరేబియన్, ఉత్తర అమెరికా, యూరప్‌లకు సేవలు అందిస్తోంది. రెండవ విమానాశ్రయం, వాన్స్ W. అమోరీ అంతర్జాతీయ విమానాశ్రయం, నెవిస్ ద్వీపంలో ఉంది. ఇక్కడి నుండి కరేబియన్‌లోని ఇతర ప్రాంతాలకు విమానాలు ఉన్నాయి.

సెయింట్ కిట్స్ సీనిక్ రైల్వే అనేది లెస్సర్ యాంటిల్లెస్‌లో నడుస్తున్న ఏకైక రైలుమార్గం.

మూలాలు

[మార్చు]
  1. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  2. 2.0 2.1 "Report for Selected Countries and Subjects". www.imf.org.
  3. Human Development Report 2020 The Next Frontier: Human Development and the Anthropocene (PDF). United Nations Development Programme. 15 December 2020. pp. 343–346. ISBN 978-92-1-126442-5. Retrieved 16 December 2020.
  4. "1983 Saint Kitts and Nevis Constitution". pdba.georgetown.edu. Retrieved 30 August 2017.
  5. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  6. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  7. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  8. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  9. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  10. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  11. See for example Nevis Heritage excavation reports, 2000–2002 Archived 2006-07-08 at the Wayback Machine, Department of Archaeology, University of Southampton. Retrieved 8 August 2006.
  12. "Commonwealth – History of St Kitts and Nevis". Archived from the original on 21 March 2019. Retrieved 10 July 2019.
  13. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  14. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  15. 15.0 15.1 "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  16. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  17. Cobley, 1994, p. 28.
  18. Cobley, 1994, p. 27.
  19. "Commonwealth – History of St Kitts and Nevis". Archived from the original on 21 March 2019. Retrieved 10 July 2019.
  20. "Treaty between Great Britain and Spain for the settlement of all disputes in America". The National Archives. gov.uk.
  21. Hubbard, Vincent (2002). A History of St. Kitts. Macmillan Caribbean. ISBN 9780333747605.
  22. Hubbard, Vincent (2002). A History of St. Kitts. Macmillan Caribbean. ISBN 9780333747605.
  23. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  24. "St Kitts History". Beyondships Cruise Destinations.
  25. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  26. "Commonwealth – History of St Kitts and Nevis". Archived from the original on 21 March 2019. Retrieved 10 July 2019.
  27. "Commonwealth – History of St Kitts and Nevis". Archived from the original on 21 March 2019. Retrieved 10 July 2019.
  28. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  29. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  30. See section 3 and 4 about Nevis Island Legislature and Administration in The Saint Christopher and Nevis Constitution Order 1983. Published online by Georgetown University and also by University of the West Indies. Retrieved 8 August 2006.
  31. Nevis (St Kitts and Nevis), 18 August 1977: Separation from St Kitts Direct Democracy (in German)
  32. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  33. "Commonwealth – History of St Kitts and Nevis". Archived from the original on 21 March 2019. Retrieved 10 July 2019.
  34. "Commonwealth – History of St Kitts and Nevis". Archived from the original on 21 March 2019. Retrieved 10 July 2019.
  35. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  36. General Election in St Kitts and Nevis 3 July 1995: The Report of the Commonwealth Observer Group. Commonwealth Observer Group, Commonwealth Secretariat, 1995. ISBN 0-85092-466-9, p.3.
  37. "Nevis islanders apparently vote not to break away". Milwaukee Journal Sentinel. Associated Press. 11 August 1998.[permanent dead link]
  38. "Commonwealth – History of St Kitts and Nevis". Archived from the original on 21 March 2019. Retrieved 10 July 2019.
  39. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  40. Team Unity wins St Kitts and Nevis 2015 general election Archived 23 సెప్టెంబరు 2015 at the Wayback Machine Caribbean Elections, 17 February 2015
  41. Reporter, WIC News (6 June 2020). "Election 2020 - Landslide victory for Team Unity in St Kitts and Nevis". WIC News.
  42. Salmon, Santana (8 August 2022). "St. Kitts Nevis new PM sworn into office". CNW Network.
  43. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  44. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  45. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  46. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  47. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  48. "Climate of Saint Kitts and Nevis: Temperature, Climograph, Climate table for Saint Kitts and Nevis – Climate-Data.org". Climate-data.org. Alexander Merkel. Retrieved 15 March 2018.
  49. "Country Historical Climate – St. Kitts & Nevis". Climate Change Knowledge Portal. The World Bank Group. Archived from the original on 6 November 2018. Retrieved 15 March 2018.
  50. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  51. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  52. "Data on St. Kitts and Nevis | Reconstructing Global Inequality". clio-infra.eu. Retrieved 2021-01-26.
  53. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  54. "Population by Religious Belief, 2011". Department of Statistics, Ministry of Sustainable Development. Retrieved 18 June 2021.
  55. "CARICOM CAPACITY DEVELOPMENT PROGRAMME (CCDP) : 2000 ROUND OF POPULATION AND HOUSING CENSUS SUB-PROJECT NATIONAL CENSUS REPORT : ST. KITTS AND NEVIS" (PDF). Caricomstats.org. Archived from the original (PDF) on 5 ఫిబ్రవరి 2018. Retrieved 30 August 2017.
  56. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  57. "Section I. Religious Demography 2020 Report on International Religious Freedom: Saint Kitts and Nevis".{{cite web}}: CS1 maint: url-status (link)
  58. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  59. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  60. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  61. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  62. "Enclopedia Britannica – St Kitts and Nevis". Retrieved 10 July 2019.
  63. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  64. "CIA World Factbook- St Kitts and Nevis". www.cia.gov. Retrieved 10 July 2019.
  65. "St.Kitts-Nevis and the Republic of Ireland sign Tax Agreement". Ntltrust.com. Archived from the original on 31 August 2017. Retrieved 30 August 2017.