Jump to content

వాడుకరి:Kottodu

వికీపీడియా నుండి

నా పూర్తి పేరు అక్కపెద్ది వంశీ బాల మురళీ కృష్ణ. పుట్టింది చీరాల. పెరిగింది చిలకలూరిపేట. ఉద్యోగ రీత్యా కడపలో 9 సంవత్సరాలు ఉన్నాను. ప్రస్తుతం విజయవాడ. ఉద్యోగం గవర్నమెంటు మెడికల్ రిప్రజెంటేటివ్.2006 దాకా నాకు కంప్యూటర్ తో అవసరమే రాలేదు. 2007లో వికిపీడియా గురించి తెలిసింది. 2008లో యాధృచ్చికంగా తెవికి ఉన్నదని, దానికి అందరి సహాయము కావాలని తెలిసింది. అప్పటి నుండి నాకు తోచిన పనులు చేస్తున్నాను. ఇందులో లాగిన్ కావాలని కూడా చాలాకాలం తెలియదు. avbmk అనే పేరు మీద అనేక వ్యాసాలు తర్జుమా చెయ్యటం జరిగింది. కొన్ని మొలకలు కూడా తయారు చేశాను. అయ్యలరాజు రామభద్రుడు అనేది నేను చేసిన వ్యాసాలలో నాకిష్ఠమైనది. అసలు నాగుపాము అనే వ్యాసం తో తర్జుమా మొదలు పెట్టాను. ఇప్పుడు కొత్తోడు అనే పేరుతో అనువాదాలు చేస్తున్నాను. నాకు ఇష్టమైన, అవగాహన ఉన్న సబ్జెక్టులు పురాణాలు, వైద్యం, చరిత్ర, ఆయుధాలు మరియు అనువాదం (హింది, ఇంగ్లీషు). ఈ విషయాల గురించి ఎటువంటి సహాయము కావాలన్నా నన్ను నిర్మొహమాటంగా అడగవచ్చు.