Jump to content

వాడుకరి:Sampangishnkr03

వికీపీడియా నుండి
శీర్షిక పాఠ్యం
[మార్చు]

'మాదిగ దండోర' మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యం.ఆర్.పి.ఎస్) మాదిగ మరియు మాదిగ అనుబంద కులాలు తేది జూలై 7,1994 రోజున (ఇదుముడి గ్రామం ,, ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లో 20 మంది యువకులతో ఏర్పడిన)ఎస్సి రిజర్వేషన్స్ ఎస్సి కులాల జనాభా నిస్పతి ప్రకారం విభజించి,దళితుల్లో అత్యదికంగా వెనుకబడిన కులాలకు న్యాయం చెయ్యాలనే డిమాండ్ తో దండోరా ఉద్యమం,( మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి-యం,అర్,పి, ఎస్) మంద కృష్ణ మాదిగ నాయకత్వం లో ముందుకు వచ్చింది. అణగారిన కులాల ఆత్మగౌరవం, సమన్యాయం పంపిణి విలువల కేంద్రంగా బయలుదేరిన దండోరా ఉద్యమం అనతికాలం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లొ బలమైన ఉద్యమం సంస్థ గా ఎదిగి, అణగారిన కులాల గొంతుకగా నిలిచింది. ఒక ప్రవాహంగా ప్రజాక్షేత్రంలో దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త చైతన్యం అనేక ప్రజా ఉద్యమాలకు ఆదర్శంగా నిల్చింది. ఉదాహరణకు రాష్ట్రం లో వచ్చిన దోలుదెబ్బ, నంగరబెరి, చాకిరేవు దెబ్బ, తుడుందెబ్బ మొదలైన దళిత బహుజన కులాల ఆత్మ గౌరవం, హక్కుల పోరాటాలు దండోరా స్ఫూర్తి తో వచ్చాయి. దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త ప్రశ్నలు, పోరాట రూపాలు, విలువలు అప్పటికే నిర్మాణమైన దళిత ఉద్యమ అవగాహనా పరిదిని తాత్వికంగా విసృత పరిచింది. ప్రభుత్వాలను సైతం దిగివచ్చేవిదంగా నిర్మాణమైన దండోరా ఉద్యమం ఇతర రాష్ట్రాలలో వచ్చిన మాంగ్ (మహారాష్ట్ర), అరుందతియ (తమిళనాడు) మాదిగల (కర్ణాటక) ఎస్సి వర్గీకరణ ఉద్యమానికి చైతన్యాన్ని అందించింది. మొత్తం పైన దేశంలో సరికొత్త చర్చను పెట్టి కులనిర్ములన, ఫులే-అంబేద్కర్ ఉద్యమాలు నేడు దళితుల్లో అత్యదికంగా వెనుకబడిన ఎస్సి కులాల అనుభవం, హక్కులు, వాటాల పునాదిగా నిర్మాణం కావాల్సిన అవసరాన్ని నొక్కిచేప్పింది. అంతేకాకుండా దండోరా ఉద్యమం మాదిగ కులాల కేంద్రంగా ప్రరంబమైనప్పటికి విశాల సర్వజనిన సమస్యలపైన మానవీయ కోణం లో, కుల మతాలకు అతీతంగా సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, అసమానతలకు, నిరాదరణకు గురైన 1. వికలాంగులు 2. వృద్దులు 3. వితంతువుల 4. చిన్న పిల్లల గుండె ఆపరేషన్ ఉద్యమాలకు మాతృక గా నిలిచి అస్తిత్వా లేదా గుర్తింపు రాజకీయాల పరిదిని దాటి పోరాటాలను నిర్మించడం ద్వార ఒక కొత్త ఒరవడిని ఆదర్శాలను ప్రజా ఉద్యమాలకు అందించింది.అంతేకాకుండా ఈ బాదితసమూహాలకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి కారణమైంది. ఐతే ఈ మానవీయ ఉద్యమాల నేపధ్యంలో వస్తున్నా అనేక చర్చనీయ అంశాలను, ప్రభుత్వ పాలసీ విదానాలను, సవాళ్ళను సంక్లిష్టతలను విసృతంగా చర్చించాల్సిన అవసరం కొత్త గా ఏర్పడిన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎంతైనా ఉంది.Sampangishnkr03 (చర్చ) 09:59, 13 సెప్టెంబర్ 2013 (UTC)

హైదరాబాదు