అత్తిలి కృష్ణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తిలి కృష్ణారావు
అత్తిలి కృష్ణారావు
జననంఅత్తిలి కృష్ణారావు
1938 ఏప్రిల్ 18
విశాఖపట్నం
మరణం1998
ఇతర పేర్లుఅత్తిలి కృష్ణారావు
వృత్తిరంగస్థల కళాకారులు
ప్రసిద్ధిప్రముఖ వీధి నాటక ప్రముఖులు.
మతంహిందూ
తండ్రినాగన్న
తల్లిమహాలక్ష్మి

అత్తిలి కృష్ణారావు (1938 - 1998) ప్రముఖ వీధి నాటక ప్రముఖులు.

వీరు విశాఖపట్నంలో నాగన్న, మహాలక్ష్మి దంపతులకు 1938 ఏప్రిల్ 18 తేదీన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే నాటక ప్రదర్శనలో నటించడం మొదలుపెట్టారు. వీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్న్ లో పట్టభద్రులై తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి నటన, నాటిక రచనల్లో డిప్లమో పొందారు. జానపద, రంగస్థల కళలు అంశం మీద పి.హెచ్.డి. చేశారు. విశాఖ నాటక మండలి అధ్యక్షులు గణపతిరాజు అచ్యుతరామరాజు దర్శకత్వంలో వీరు అనేక పాత్రలు పోషించారు.

వీరు మనస్తత్వాలు, దొంగ మొదలైన నాటకాలను దర్శకత్వం వహించి నటించి ఎన్నో సన్మానాలు బహుమతులు పొందారు. 1969 లో "యుగసంధ్య" అనే నాటకాన్ని రచించి, నటించి దర్శకత్వం వహించారు. ఈ నాటకం 14 భాషలలోకి అనువాదితమవడం గమనార్హం.