అక్షాంశ రేఖాంశాలు: 17°43′01″N 83°18′33″E / 17.71708°N 83.30921°E / 17.71708; 83.30921

అపోలో హాస్పిటల్స్ (విశాఖపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపోలో హాస్పిటల్స్ (విశాఖపట్నం)
పటం
భౌగోళికం
స్థానంఆరిలోవ, విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నిర్దేశాంకాలు17°43′01″N 83°18′33″E / 17.71708°N 83.30921°E / 17.71708; 83.30921
వ్యవస్థ
రకాలుసూపర్ స్పెషాలిటీ
[యూనివర్సిటీ అనుబంధంఆంధ్ర వైద్య కళాశాల
Services
అత్యవసర విభాగంఉంది
చరిత్ర
ప్రారంభమైనది2016
లింకులు
వెబ్‌సైటుapollovizag

అపోలో హాస్పిటల్స్ (విశాఖపట్నం) అనేది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ శాఖ.[1] ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తాతోపాటు ప్రక్కనే ఉన్న ఒడిశా రాష్ట్ర ప్రజల ఆరోగ్య అవసరాలకు ఈ ఆసుపత్రి సేవలు అందిస్తుంది.[2]

చరిత్ర

[మార్చు]

విశాఖపట్నంలోని ఆరిలోవ హెల్త్ సిటీలో 2016 నుండి 350 పడకల మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది.[3]

సదుపాయాలు

[మార్చు]

ఆసుపత్రిలో ట్రామా కేర్ టీమ్, రెస్పిరేటరీ రిహాబిలిటేషన్ యూనిట్ ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్ న్యూరోసైన్సెస్, ఆర్థోపెడిక్స్, కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, లివర్ క్లినిక్‌లతో సహా వివిధ ఆరోగ్య సంరక్షణ శాఖలను కలిగివుంది. విభాగాలలో కార్డియాలజీ, కార్డియోవాస్కులర్ సర్జరీ, థ్రోంబెక్టమీ, బారియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, క్రిటికల్ కేర్, ప్రసూతి, గైనకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, ఈఎన్టీ, అవయవ మార్పిడితో సహా న్యూరో సర్జరీ ఉన్నాయి.

సేవలు

[మార్చు]

ఔట్ పేషెంట్ క్లినిక్

[మార్చు]

సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 వరకు అవుట్ పేషెంట్ క్లినిక్‌లు అందుబాటులో ఉంటాయి.

అపోలో ఫార్మసీ

[మార్చు]

ప్రధాన ఆసుపత్రికి అనుబంధంగా ఒక అపోలో ఫార్మసీ అవుట్‌లెట్ ఉంది. ఇది అపోలో హాస్పిటల్స్‌లో ఒక భాగంగా ఉంటుంది.

విద్య, పరిశోధన

[మార్చు]

ఇది ఆరోగ్య సంరక్షణ రంగంలో పరిశోధనతోపాటు అకడమిక్ కోర్సులను నిర్వహిస్తుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. "List of recognized Hospitals" (PDF). www.dme.ap.nic.in. Retrieved 16 November 2016.
  2. "Apollo Hospitals to open three centres in Seemandhra this year". The Hindubusiness. 30 May 2016. Retrieved 10 November 2016.
  3. "Shri Nara Chandrababu Naidu inaugurates the world class Apollo Hospitals, Visakhaptnam, at Healthcity, Arilova". www.apollohealthcity.com. Retrieved 12 June 2017.[permanent dead link]
  4. "Apollo Hospitals Educational and Research Foundation, DNB education in Radiology, Anesthesia and Cardiology". www.aherf.org/. Archived from the original on 12 September 2017. Retrieved 11 September 2017.