అభోవ్యన్ వీధి
అభోవ్యన్ వీధి | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 1.8 కి.మీ. (1.1 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
నుండి | సెంట్రల్ రెపబ్లిక్ స్క్వ్యేర్ |
వరకు | ఖచాతూర్ అబోవియన్ విగ్రహం |
ప్రదేశము | |
States | ఆర్మేనియా |
అభోవ్యన్ వీధి, ఆర్మేనియా రాజధానయిన యెరెవాన్ లోని కెంట్రాన్ జిల్లా కేంద్రంలో ఉంది. దీనిని 1868 నుండి 1920 వరకు అస్తఫ్యాన్ వీధి అని పిలిచేవారు.
ఈ వీధి సెంట్రల్ రెపబ్లిక్ స్క్వ్యేర్ నుండి ప్రముఖ ఆర్మేనియన్ రచయిత ఖచాతూర్ అబోవియన్ (1809–1848) విగ్రహం వరకు ఉంటుంది, ఆయన పేరున ఈ వీధికి అభోవ్యన్ అను పేరు వచ్చింది. ఆర్మేనియా రాజధానిలో అభోవ్యన్ మొదటి ప్రణాళికబద్ధంగా నిర్మించిన వీధి.
యెరెవాన్ డౌన్టౌన్ లో ఉన్న ఈ వీధిలో ప్రధానంగా సాంస్కృతిక, విద్యా సంస్థలు, విలాసవంతమైన నివాస భవనాలు, ఉన్నత బ్రాండెడ్ దుకాణాలు, వాణిజ్య కార్యాలయాలు, కాఫీ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రాత్రి క్లబ్బులు ఉన్నవి.
చరిత్ర
[మార్చు]1855లో రష్యన్ వైస్రాయ్ కాకసస్ యెరెవాన్ నగర వీధుల ప్రణాళిక ధ్రువీకరించారు. వీధుల సగటు వెడల్పును 6 నుండి 20 మీటర్లగా పరిగణించారు. అస్తఫయాన్ వీధిని 20 మీటర్లు వెడల్పుగా నిర్ణయించారు. యెరెవాన్ లో ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నిర్మించిన మొదటి వీధి అస్తఫయాన్. 1860-1862లో యెరివాన్ గవర్నేటుకు చిందిన గవర్నరు మిఖైల్ పేరిట 1863లో ప్రారంభించారు.[1]
ఈ వీధి అధికారికంగా అస్తఫ్యేస్కయాన్ అని పిలుస్తారు, కానీ నివాసితులు పేరులోని "యెవ్స్కాన్"కు బదులుగా "యన్" అని పిలుస్తారు.ఇందువలనే అస్తఫ్యేస్కయాన్ బదులుగా అస్తఫ్యాన్ అని పిలుస్తారు. 1904లో ఈ వీధిపై హార్స్కార్ వ్యవస్థ పనులను మొదలుపెట్టి రెండు సంవత్సరాలలో పూర్తిచేశారు. కానీ ఇది 1918 వరకు అనగా పన్నెండు సంవత్సరాలు మాత్రమే పనిచేసింది. యెరెవాన్ లోని మొదటి ట్రామ్ అభోవ్యాన్ వీధిలో 1933వ సంవత్సరంలో నడిచింది.
ముఖ్యమైన భవనాలు
[మార్చు]- ఆర్నో బబజాన్యన్ కచేరీ హాల్,
- యెరెవాన్ గ్రాంద్ హోటల్,
- అలెగ్జాండర్, ఒక లగ్జరీ కలెక్షన్ హోటల్,
- యెరెవాన్ కంకణాలు సెంటర్,
- ఆర్మేనియా కళాకారులు యూనియన్,
- మాస్కో సినిమా,
- స్టానిస్లవ్స్కి రష్యన్ థియేటరు,
- కతొగికే, సర్ప్ అన్నా చర్చిలు,
- యెరెవాన్ రాష్ట్ర మెడికల్ విశ్వవిద్యాలయం,
దుకాణాలు
[మార్చు]అభోవ్యాన్ వీధి ఎన్నో లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్లు అనగా: కాప్-కపైన్, ఇటామ్, మాంగో, మెక్స్, మోటివి, నౌగట్ లండన్, ఒకైడి, ఒల్సేన్, ప్రొమోద్, సైన్క్వూనోన్ ఉన్నాయి.[2]
గ్యాలరీ
[మార్చు]-
1933లో శిథిలమైన సెయింట్ పాల్, పీటర్ చర్చిలు
-
కటగికో, సర్ప్ అన్నా చర్చిలు
-
అభోవ్యన్ వీధిపై ఉన్న 19వ-శతాబ్దపు భవనము
-
52 అభోవ్యన్ వీధిపై ఉన్న 19వ శతాబ్దపు పై.ఎస్.యు భవనము, ఇది వేదాంత, చరిత్ర, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీలకు నిలయం
-
అభోవ్యన్ వీధిలోని ఆర్నో బబజానియన్ కచేరీల హాలు
సూచనలు
[మార్చు]- ↑ (in Armenian)మూస:Hy icon Avetisyan, Kamsar. (The History of Abovyan Street), Sovetakan Grogh publishing house, Yerevan, Armenian SSR, 1979.
- ↑ "Topshop.am". Archived from the original on 2018-09-15. Retrieved 2018-06-20.