Jump to content

అమృతం కురిసిన రాత్రి

వికీపీడియా నుండి
పుస్తక ముఖచిత్రం
తిలక్

అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర తిలక్ చే రచించబడిన ఒక ప్రసిద్ధ తెలుగు కవితా సంపుటి. ఈ రచన ఎందరో పాఠకులకు, పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితా సంకలనం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన ఈ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.

కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపథ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు.[1]

ఇందులో ఉన్న కవితా ఖండికల పేర్లు
ఆర్తగీతం, సి.ఐ.డి., రిపోర్ట్, వెళ్ళిపొండి - వెళ్ళిపొండి, టులాన్ మాగ్నకార్టా, గొంగళి పురుగులు, శిఖరారోహణ, భూలోకం, ప్రకటన, నిన్నరాత్రి, లయగీతం, యుద్ధంలో రేవు పట్టణం, కఠినోపనిషత్, శిక్షాపత్రం, ముసలివాడు, వేసవి, ప్రార్థన, మైనస్ ఇంటూ ప్లస్

కొన్ని వ్యాఖ్యలు

[మార్చు]
  • ఆధునిక వచన కవిత్వంలో ఇదొక గొప్ప ఖండిక. .. కవిత్వంలో అత్యంత కారుణ్య భావపూరితాలూ, ప్రజాశక్తిని పరిదీప్తం చేసే చైతన్య శిఖలూ, రసార్ద్ర భావనోద్దీప్తి కలిగిన సుందర దుమధుర రసగుళికల సమాహారమే తెలుగు కవిత్వ ప్రియులకు త్రిల్ అందించిన "అమృతం కురిసిన రాత్రి" [1]

“ఒక నిశార్ధ బాగంలో నక్షత్ర నివహగగనం
ఓరగా భూమ్మీదకు ఒంగి ఎదో రహస్యం చెప్తున్న వేళ
ఒంటరిగా నా గదిలో నేను మేల్కుని రాసుకుంటుంటాను”

  • ముందే తెలిసి ఉంటే ఆ అమృతం కురిసిన రాత్రి నేనూ మేల్కుని ఉండును కదా అనిపిస్తుంది ఈ వాక్యాలు చదివితే. ఇంత మంచి పుస్తకం తెలుగులో ఉన్నందుకు మనందరికి కూసింత గర్వంగా కూడా అనిపించనూ వచ్చు.[2]
  • కనురెప్పల మాటున మెరుపువీణలు మీటిన - 'అమృతం కురిసిన రాత్రి - ఆధునిక కవితారంగంలో ముగ్గురిని ప్రముఖంగా పేర్కొనాలి. వారి కవితా సంపుటాలు రాకుండానే వారికి దేశం పట్టనంత పేరొచ్చింది. ఆ ముగ్గురు- తిలక్‌, శ్రీశ్రీ, అజంతాలు. . తిలక్‌ శైలీ రమ్యత, తీసుకున్న వస్తువులు అన్నీ కూడా కవితాప్రియుల మన్ననలు పొందాయి. ఆయన వచనకవితా ప్రక్రియను పరిపుష్ఠం చేశారు. ఆయన శైలి రమ్యత పద్యకవితాభిమానులను సైతం ఆకట్టుకుంది. అంతేకాదు కవిత్వం అంటే ఇష్టంలేని వారికి కూడా అది చేరువైంది. ఆయన తన కవిత్వాన్ని నిర్వచించే కర్తవ్యంలో భాగంగానే ఈ సంపుటిలోని తొలికవిత రాశారు. తన కవిత్వానికి వెనుక ఏతత్వం లేదని అంటారు. ప్రత్యేకించి ఏ వాదాన్ని సమర్థించనంటారు. అలాగే అయోమయం సృష్టించడం తన అభిమతం కాదంటారు. ఇక తన కవిత్వంలోని సుందర చిత్ర విచిత్రాలేమిటో చెబుతూ 'గాజుకెరటాల వెన్నెల సముద్రాలూ, జాజిపువ్వుల అత్తరుదీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలూ'... ఇవన్నీ ఆయన కవితా చంద్రశాలలోని విశేషాలే. ... అమృతం కురిసిన రాత్రి'లో అందరూ నిద్రపోతుంటే ఆయన జీవితాన్ని హసన్మందార మాలగా భరించారు..... అమృతం కురిసిన రాత్రి' చదివితే ఎవరికైనా కవితామృతం గ్రోలినంతానందం కలుగుతుంది. ఉత్తేజంతో కొత్త వెలుగుతో జీవితాన్ని సరికొత్తగా చూడగల నేర్పు అలవడుతుంది.[3]

'అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నాకళా కరవాల ధగద్ధగ రవాలు'

ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన 'నా కళా 'కరవాల' ధగద్ధగరవాలు' అన్నారు. ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అన్న అంశాన్ని ఇందులో చాలా స్పష్టం చేశారు. ఆ కవితలోనే ఇంకా అంటారు -

'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'

ఈ మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు.[3]

రచననుండి ఉదాహరణలు

[మార్చు]

ధాత్రి జనని గుండెలమీద
యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు
మీరెవరైనా చూశారా? కన్నీరైనా విడిచారా?


నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, కాదు సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం


జ్వలత్కాష్ఠమిలాతలం
శప్తధాత్రి నిర్జనమై, స్మశానమై పరచుకొనెను
సుప్తదేవ హృదయ సృజ్ఞాళము లెగిరిపడెను
 
అక్కయ్యకు రెండో కానుపు
తమ్ముడికి మోకాలి వాపు
చింతపండు ధర హెచ్చింది
చిన్నాన్నకు మతి భ్రమించింది
లేచిన మరుక్షణం ఎన్నో ప్రశ్నలు
గోరుచుట్టలా సలిపే లక్షల సమస్యలు

గతమంతా తోలు బొమ్మలాడిన ఒక తెర
వర్తమానం నీ కన్నులగప్పిన ఒక పొర

విశిష్టతలు

[మార్చు]

చీకటి లోకి దీపాన్ని తీసుకురాగలం, కానీ చీకటిని వెలుతురుగా చేయలేము .
దీపానికి దగ్గరగా ఉంటే, వెలుగును అధికంగా పొందగలం.
అలాకాక దూరంగా ఉండి, వెలుతురు చాలదని నిందించటంలో అర్థం లేదు.
కవిత్వం కూడా, చీకటిలోకి తీసుకురాబడిన దీపం లాంటిది.
ఆ దీపానికి దగ్గరగా చేరి, అందులోని సారాంశాన్ని, అందుకోగలగాలి, ఆనందించాలి .
చీకటిని చీల్చుకుంటూ వచ్చే ప్రభాత కిరణం లాంటిది తిలక్ కవిత్వం.

అమృతం కురిసిన రాత్రిలో కవిత్వం గురించి ఇలా చెబుతాడు తిలక్.
కవిత్వం అంతరాతర సీమలను బహిర్గతం చేయాలి, విస్తరించాలి, చైతన్య పరచాలి,
అగ్నిజల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి అని.
అలానే అంత్యప్రాసలు వేసినంతమాత్రాన, ప్రొసైక్ భావం కవిత్వం అవదు అంటూ,
కవిత్వం ఒక అరెక్మీ , దానిరహస్యం కవికే తెలుసు

ఆశ ఉత్తరధ్రువం విధి దక్షిణ ధ్రువం
మనిషి రెండీటీ మధ్యా బంతిలా ఎగిసిపడే ప్రహసనం
ఇజంలో ఇప్రిజన్ అయితే ఇంగితజ్ణానం నశిస్తుంది
ప్రిజం లాంటీది జీవితం వేర్యెరు కోణాలు ప్రదర్సిస్తుంది
ప్రస్తుత సమాజం లొ జరుగుతున్న పరిణామాలకు దర్పణం లాంటిది
ఆల్‌ఖేదా నుండీ ఆర్ యస్ యస్ వరకు వారి వారి విధి విధానాలవల్ల
ఇంగిత జ్ఞానం కోల్పొవటం మనం చూస్తున్నాం వాటి పరాణామాలు చూస్తున్నాం
"త్రిబుజాకారంలో బిగించబడీన మూడూ అధం ముక్కల ప్ర్రిజం మధ్య, ఏ వస్తువు అయినా
వేరువేరు రకాలుగా కనిపిస్తుంది.
జీవితం కూడా త్రిబుజాకార గాజు గొట్టమ్ లాటీదీ" అని చెబుతాడూ తిలక్
ఇదే కవితలో

గజానికొక గాంధారి పుత్రుడూ గాంధీ గారి దెశ మ్ లొ అంటాడూ దీని లొని నిజమెం తొ మనం సూస్తున్నాం

మరొ ఉదాహరణ = కాస్మాపాలిటన్ అన్న కవితలో

సకలసిధాంతాలు, మతాలు ,ఇజాలు, సైటీఫీక్ నిజాలు
అన్ని కలబొసి రగరిం చి ఒకెఒక రహస్యం కను కొన్నారు
దెవుడూ, మానవుడూ వీరు ఇద్దరె ఈ అనంత విస్వమ్ లొ మూర్గులు
ఏ కోణం నుండి చూచినా వీరు మిజరబుల్ ఫైల్యూరర్స్
పురాణపురుషుల నుండి చరిత్ర మహానీయుల వరకు ఎవరు ఏ నిజాన్ని ప్రవేశపెటిన
ఏదీ సంపూర్ణ సాధించలేకపొయారు

అని తిలక్ వ్యక్తపరుస్తాడూ కెవలం తిలక్ మాత్రామె రాయగల కవితలు [ప్రార్థన] [ఆర్తగీతం] ఆచరణ లేకుండా సుభాషితాలను వల్లె వెస్తూఉండే పెద్దంమనుసులు, పవిత్రులు, పతివ్రతలు, భక్తులు, సిద్ధాంతకర్తలు మొదలగువారి వల్ల దేశానికి జరిగే కిడూ గురించి తిలక్ ఆక్రొశమే ఈ ప్రార్థనా గీతమ్

దెవుడా రక్షిం చు నా దెశాన్ని
పవిత్రుల నుండి పతివ్రతల నుండి
నీతులు రెడూ నాల్కలచాచి బుసలు కొట్టే
నిర్హెతుక క్రుపా సర్పాల నుండి
లక్ష లాది దెవుల్ల నుండి వారివారి పూజారులనుండి
దెవుడా
కత్తి వాదరకు తెగిన కంటమ్ లొ హటాత్ గా
ఆగి పొయిన సంగీతాన్ని వినిపిం చు
మానవ చెరిత్ర పుటలలొ నెత్తురొలికి
మాసిపొయిన అక్ష రాలను వివరించు
రహస్య స్సష్ట్టీ సానువుల నుండి జారిపడే
కాంతి జలపాతాన్ని చుపించు

అంటూ ఛావూపూట్టూ కల మధ్య సందేహం లాటీ ది జీవితం


ఆని ప్రార్దిం చటమే ఈప్రార్థనాగీతం ఆలాగే తనెంత, మానవతా వాదొ, ఈఆర్తగీతంలో తెలుస్తుంది.

నెను చుశాను నిజంగా మూర్తిభవించిన దైన్న్యాన్ని, హైన్న్యాన్ని
క్షుభితాస్రు కల్లొల నిరధుల్ని గచ్చత్ శవాకారవికారుల్ని
ఇది ఏనాగరికతకు ఫలస్రుతి ఏవిజ్ఞాన ప్రకర్హకు ప్రకృతి
ఏ బుద్దదేవుని జన్మభూమికి గర్వస్రుతి

అంటూ ఈ నాగరికతారణ్ణ్య వాసాన్ని భరించలెను అంటాడూ తిలక్ తనకవితద్యారా మరొ కవిత [శీఖరారొహన] లో

కాలానికి ఒక రూపం లేదు దానికిపాపం కుడా లేదు
కాలం అద్దం లాంటీ ది
అంధయుగమైనా, స్వర్ణాయుగమైనా, అది మన ప్రతిబింబమ్ అంటూ
సంప్రదాయభిరువుకి , అస్యొతత్ర వితంతువుకి , వసంతం లేదు
సాహసి కాని వాడూ జివనసమరానికి, స్వర్గానికికుడా పనికిరాడూ
హిమసుందర స్రుగమైన ఎవరెస్ట్టూ నుఒక్క టేన్సిగె ఎక్కగలడూ
సుమన సుందరమైన వసంతగీతం తొ ఉగాది ని ఆవ్వ్హానించ గలడూ

ఇలాం టీ మధురమైన, మరపు రాని కవితలు ఎన్నొ తిలక్ ఆమ్రుతంకురిసినరాత్రిలో చుడవచ్చు

గతమంతా, తొలుబొమ్మలాడీన, ఒకతెర.
వర్తమానం నీ కన్నులు కప్పిన పొర
పాము కొరా, డేగరెక్కా, ఈకాలానికి చిహ్నం
పూలతెనా, నెమలిరెక్కా, ఒకమిధ్యాప్రమాణమ్
అందుకె నెస్తం జివితమె ఒక జూధం
ఖెదానికి మొదానికి లేదులె బేదం

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు, మూలాలు

[మార్చు]
  • శత వసంత సాహితీ మంజీరాలు - వంద పుస్తకాలపై విశ్లేషణ - రేడియో ఉపన్యాసాల సంకలనం - ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, విజయవాడ వారి ప్రచురణ - ఇందులో "అమృతం కురిసిన రాత్రి" పుస్తకంపై ఉపన్యాసం ఇచ్చినవారు జి. గిరిజా మనోహర్ బాబు, హన్మకొండ
  1. 1.0 1.1 "శత వసంత సాహితీ మంజీరాలు" లో జి. గిరిజా మనోహర్ బాబు
  2. "కల్హార - స్వాతి బ్లాగు". Archived from the original on 2007-09-23. Retrieved 2008-09-24.
  3. 3.0 3.1 ఈవాడులో చీకోలు సుందరయ్య వ్యాసం[permanent dead link]


బయటి లింకులు

[మార్చు]