అయనీకరణం
Jump to navigation
Jump to search
అయనీకరణం అంటే ఒక పరమాణువు లేదా అణువు ఎలక్ట్రాన్లను కోల్పోవడం లేదా చేర్చుకోవడం వలన ధనావేశం లేదా ఋణావేశాన్ని పొందడం.[1] ఇందులో భాగంగా అవి చాలా సార్లు రసాయనిక మార్పుకు కూడా లోనవుతాయి. దీని ఫలితంగా ఏర్పడే విద్యుదావేశం కలిగిన పరమాణువు లేదా అణువులను అయాన్లు అంటారు. సాధారణంగా పరమాణువు లోపలి కణాలు ఒకదానితో ఒకటి గుద్దుకోవడం వలన, పరమాణువులు మరో పరమాణువు, అణువు లేదా అయాన్లతో ఢీకొనడం, లేదా విద్యుదయస్కాంత వికిరణానికి లోనవడం లాంటి వాటి వల్ల అయనీకరణం జరగవచ్చు. రేడియో ధార్మిక క్షీణతలో భాగంగా అంతర్గతంగా జరిగే చర్యల వల్ల కేంద్రకం తన శక్తిని దగ్గర్లో ఉన్న ఎలక్ట్రాన్ కి ఇచ్చి బయటికి వెళ్ళేలా చేసి అయనీకరణానికి కారణమవుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "ionization | Definition, Examples, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-01.