ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
Statistics | |
---|---|
GDP | ₹12.02 లక్ష కోట్లు (US$150 billion) (2021–22)[1] |
GDP growth | 18.47% (2021-22)[1] |
GDP per capita | ₹2,00,771 (US$2,500) (2021-22)[1] |
GDP by sector | వ్యవసాయం 34% పరిశ్రమలు 23% సేవలు 43% (2018–19)[2] |
Population below poverty line | పేదరికం తరుగుదల 9.2% (2017–18)[3] |
0.650 medium (2018) (27th)[4] | |
Labour force by occupation | వ్యవసాయం 55% పరిశ్రమలు 10% సేవలు 35% (2015)[5] |
Unemployment | 6.0% (Nov 2020)[6] |
Public finances | |
27% of GSDP (2019–20 est.)[2] | |
₹−35,261 crore (US$−4.4 billion) (3.26% of GSDP) (2019-20 est.)[2] | |
Revenues | ₹1.79 లక్ష కోట్లు (US$22 billion) (2019–20 est.)[2] |
Expenses | ₹2.28 లక్ష కోట్లు (US$29 billion) (2019–20 est.)[2] |
2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ఆధారంగా, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ₹12,01,736 కోట్లు. గత సంవత్సరపు విలువ ₹10,14,374 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిగా ఏడాదిలో ₹ 1,87,362 కోట్ల పెరుగుదల నమోదైంది. వార్షిక వృద్ధి రేటు 18.47%, దేశపు వృద్ధి రేటు 17 శాతం కంటే ఎక్కువ. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ప్రాతిపదికన, తలసరి ఆదాయం ₹2,00,771. అంతకు ముందు సంవత్సరంలో తలసరి ఆదాయం ₹176,000. ఏడాదిలో రాష్ట్రంలో ₹31 వేలు తలసరి ఆదాయం పెరగగా, దేశంలో తలసరి ఆదాయం ₹23 వేలు పెరిగింది.
ఆంధ్ర ప్రదేశ్లో సుమారు 62% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు కావున వ్యవసాయం రంగం ఆర్థిక వ్యవస్థ ప్రధాన ప్రభావం చూపుతుంది.[7] 2016 లో వెలువడిన వ్యాపార సౌలభ్య సూచికలో రాష్ట్రం తెలంగాణాతో పాటు అత్యుత్తమంగా నిలబడింది.[8]
కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2020-21లో తీవ్రంగా దెబ్బతిని[9] 2021-2022 లో కోలుకుంది.
రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి
[మార్చు]2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ఆధారంగా, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ₹12,01,736 కోట్లు. గత సంవత్సరపు విలువ ₹10,14,374 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిగా ఏడాదిలో ₹ 1,87,362 కోట్ల పెరుగుదల నమోదైంది. వార్షిక వృద్ధి రేటు 18.47% దేశపు వృద్ధి రేటు 17 శాతం కంటే ఎక్కువ.[1][10]
- వ్యవసాయరంగం : ₹3.9 లక్షల కోట్లు (+14.5%)
- పారిశ్రామిక రంగం : ₹2.5 లక్షల కోట్లు (+25.5% )
- సేవా రంగం : ₹4.67 లక్షల కోట్లు (+18.9% )
Year | GSDP/GDP-AP at Current Prices | Growth (%) -AP | GSDP/GDP-India at Current Prices | Growth (%) -India | GSDP/GDP-AP at Constant Prices | Growth (%) -AP | GSDP/GDP -India at Constant Prices - | Growth (%) -India |
---|---|---|---|---|---|---|---|---|
2017-18 | 7,86,135 | 14.86 | 1,70,90,042 | 11.00 | 5,94,737 | 10.09 | 1,31,44,582 | 6.80 |
2018-19 (TRE) | 8,73,721 | 11.14 | 1,88,99,688 | 10.60 | 6,26,614 | 5.36 | 1,39,92,914 | 6.50 |
2019-20 (SRE) | 9,66,099 | 10.57 | 2,00,74,856 | 6.20 | 6,69,783 | 6.89 | 1,45,15,958 | 3.70 |
2020-21 (FRE) | 10,14,374 | 5.00 | 1,98,00,914 | -1.40 | 6,70,321 | 0.08 | 1,35,58,473 | -6.60 |
2021-22 (AE) | 12,01,736 | 18.47 | 2,36,43,875 | 19.40 | 7,46,913 | 11.43 | 1,47,71,681 | 8.90 |
తలసరి ఆదాయం
[మార్చు]ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ప్రాతిపదికన, తలసరి ఆదాయం ₹2,00,771. అంతకు ముందు సంవత్సరంలో తలసరి ఆదాయం ₹176,000. ఏడాదిలో రాష్ట్రంలో ₹31 వేలు తలసరి ఆదాయం పెరగగా, దేశంలో తలసరి ఆదాయం ₹23 వేలు పెరిగింది.
సంవత్సరం | Per Capita Income (PCI) -AP | PCI-india |
---|---|---|
2017-18 | 1,38,299 | 1,15,224 |
2018-19 (TRE) | 1,54,031 | 1,25,946 |
2019-20 (SRE) | 1,69,320 | 1,32,115 |
2020-21 (FRE) | 1,76,707 | 1,26,855 |
2021-22 (AE) | 2,07,771 | 1,49,848 |
చేపల పెంపకం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో చేపలు, రొయ్యలు లాంటివి పెంచడం, అమ్మడం ప్రజలకు ఒక ప్రధాన వృత్తి. రొయ్యల ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ది ప్రథమ స్థానం. దేశంలో సుమారు 70% ఉత్పత్తి ఇక్కడే జరుగుతోంది.[11] రాష్ట్రం భౌగోళిక పరిస్థితులు ఇందుకు అనుకూలిస్తున్నాయి. తుఫానులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పంటలకు జరిగే నష్టం కన్నా చేపల చెరువులకు జరిగే నష్టం తక్కువ కావడంతో రైతులు ఈ వృత్తి వైపు మొగ్గు జూపారు. నెల్లూరులో ఉన్న జలాలు రొయ్యలు పెంపకానికి అనుకూలమైనవి.[12]
ఎగుమతులు
[మార్చు]రాష్ట్రం నుంచి సాఫ్ట్‌వేర్ సేవలు, ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
రాష్ట్ర రుణం
[మార్చు]CAG నివేదిక ప్రకారం 2020 నవంబరు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించిన మొత్తం ప్రజా రుణం 3,73,140 కోట్లు. ఇది 2021 సంవత్సరంలో 5.2 కోట్ల [13] జనాభాను అంచనా వేసుకుంటే ప్రతి పౌరునికి రూ.71750.[14] యూనియన్ ఆఫ్ ఇండియా కారణంగా ప్రతి పౌరుడిపై ప్రజా రుణం సుమారుగా రూ. 32371.61 (2021 సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 130 కోట్ల (1.3 బిలియన్) జనాభాకు దాదాపు భారతదేశం మొత్తం బాహ్య రుణం $570 బిలియన్లు ).
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-₹31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!". ABP Telugu. 2022-03-11. Retrieved 2022-03-15.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Andhra Pradesh Budget Analysis 2019-20" (PDF). PRS Legislative Research. Archived from the original (PDF) on 10 ఆగస్టు 2019. Retrieved 24 July 2019.
- ↑ "SDGs India Index". NITI Aayog. 31 December 2019.
- ↑ "Sub-national HDI – Area Database". Global Data Lab. Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
- ↑ "Andhra Pradesh Budget Analysis 2016-17" (PDF). PRS Legislative Research. Archived from the original (PDF) on 4 ఏప్రిల్ 2019. Retrieved 19 November 2016.
- ↑ "Unemployment Rate in India". Centre for Monitoring Indian Economy. Retrieved 3 November 2020.
- ↑ "Socio-economic Survey of Andhra Pradesh" (PDF). Archived from the original (PDF) on 6 June 2017.
- ↑ S, Arun (31 October 2016). "A.P., Telangana top in ease of doing business". The Hindu. ISSN 0971-751X. Retrieved 4 January 2018.
- ↑ "Andhra Pradesh witnesses huge shortfall in revenue in first quarter". thehansindia.com.
- ↑ 10.0 10.1 10.2 Socio economic survey 2021-22 (PDF). Amaravathi. 2022.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link)[permanent dead link] - ↑ "AP top producer of shrimp: MPEDA". 16 Jan 2013.
- ↑ "Waterbase India". waterbaseindia. Retrieved 18 July 2014.
- ↑ "Andhra Pradesh's debt burden rises to Rs 3.73 lakh crore, CAG accounts show". Retrieved December 16, 2021.
- ↑ "అప్పుల ఊబిలో ఆంధ్రా.. ఒక్కొక్కరి తలపై ఎంత అప్పుందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!". సమయం. 2021-01-05. Retrieved 2022-03-15.